తొలిసారిగా ఆ పని చేస్తోన్నకమల్హాసన్ | Kamal Hasan promoting textile showroom pothys | Sakshi
Sakshi News home page

తొలిసారిగా ఆ పని చేస్తోన్నకమల్హాసన్

Sep 22 2015 12:22 PM | Updated on Sep 3 2017 9:47 AM

తొలిసారిగా ఆ పని చేస్తోన్నకమల్హాసన్

తొలిసారిగా ఆ పని చేస్తోన్నకమల్హాసన్

60 ఏళ్ల సుధీర్ఘ కెరీర్లో లోకనాయకుడు కమల్హాసన్ ఇంత వరకు ఏ ఒక్క బ్రాండ్కు కూడా ప్రచార కర్తగా వ్యవహరించలేదు. ఇమేజ్ పరంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న కమల్, చేయాలని అనుకుంటే ఎన్నో మల్టీ నేషనల్...

60 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో లోకనాయకుడు కమల్హాసన్ ఇంత వరకు ఏ ఒక్క బ్రాండ్కు కూడా ప్రచారకర్తగా వ్యవహరించలేదు. ఇమేజ్ పరంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న కమల్, చేయాలని అనుకుంటే ఎన్నో మల్టీ నేషనల్ కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకునేవి. సినిమాల మీదే ఎక్కువగా సమయం కేటాయిస్తూ వస్తున్న కమల్హాసన్ అంబాసిడర్గా తన ఇమేజ్ ను క్యాష్ చేసుకోవాలని అనుకోలేదు.

నటుడిగా ఎన్నో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన కమల్హాసన్ ఇప్పుడు తొలిసారిగా ఓ వస్త్రదుకాణానికి ప్రమోటర్గా వ్యవహరించడానికి అంగీకరించాడు. కమల్తో ఓ యాడ్ షూట్ చేయడానికి అంగీకారం కుదుర్చుకుంది ప్రముఖ టెక్స్టైల్ సంస్థ పొతీస్. నటుడు, ఫొటోగ్రాఫర్ కృష్ణ ఈ యాడ్ను రూపొందిస్తున్నాడు. కొంతకాలంగా కమల్ కూతురు శృతిహాసన్ ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తుండగా ఇప్పుడు ఆ బాధ్యతను కమల్హాసన్ తీసుకున్నాడు.

కమల్ ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ 'చీకటిరాజ్యం' రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. బైలింగ్యువల్గా తెరకెక్కిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించింది. ఈ సినిమాతో పాటు 'విశ్వరూపం 2'కు సంబందించిన పొస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో కూడా బిజీగా ఉన్నాడు యూనివర్సల్ స్టార్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement