మరోసారి కమల్‌తో..?
కమల్‌హాసన్ సరసన త్రిష మరో చిత్రంలో నటించనున్నారా? చెన్నయ్ వార్తల ప్రకారం అవుననే చెప్పాలి. ఐదేళ్ల క్రితం ‘మన్మథన్ అన్బు’ చిత్రంలో ఈ జంట నటించారు. అది రొమాంటిక్ కామెడీ మూవీ. ఈసారి ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో జతకట్టనున్నారట. ఈ చిత్రం ద్వారా కమల్ తన అసోసియేట్‌ని దర్శకునిగా పరిచయం చేయనున్నారని సమాచారం. సొంత సంస్థపై ఆయన ఈ చిత్రాన్ని నిర్మించాలనుకుంటున్నారట. ఇది జేమ్స్ బాండ్ చిత్రాల తరహాలో సాగే యాక్షన్ థ్రిల్లర్ అని భోగట్టా.
ఇందులో త్రిష పాత్ర చాలా స్టయిలిష్‌గా ఉంటుందని తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణ పూర్వ కార్యక్రమాల కోసం కమల్ మలేసియా కూడా వెళ్లారట. అక్కడ లొకేషన్స్‌ని పరిశీలించారని సమాచారం. వచ్చే నెలాఖరున ఈ చిత్రం ప్రారంభమయ్యే అవకాశం ఉందని వినికిడి.