మరోసారి తీన్మార్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్నాడు. 2019 ఎన్నికలతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్న పవన్, ఈలోగా వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకు తగ్గట్టుగా ఓ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను ఫైనల్ చేయాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు సినిమా షూటింగ్లో పాల్గొంటున్న పవన్ మరో రెండు సినిమాలను లాంఛనంగా ప్రారంభించాడు.
ముందుగా ఏఎమ్ రత్నం నిర్మాణంలో నేసన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. తమిళ సూపర్ హిట్ సినిమా వేదలంకు ఇది రీమేక్ అన్న ప్రచారం జరుగుతోంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు హీరోయిన్ వేట కొనసాగుతోంది. ముందుగా నయనతారను తీసుకోవాలని భావించినా.. ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారట.
ఇటీవల కోడి సినిమాతో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న సీనియర్ హీరోయిన్ త్రిషను ఫైనల్ చేయాలని భావిస్తున్నట్టుగా సమాచారం. గతంలో పవన్ కళ్యాణ్, త్రిష కాంబినేషన్లో రూపొందిన తీన్మార్ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా సెంటిమెంట్ను పక్కన పెట్టి మరోసారి పవన్, త్రిషతో తీన్మార్కు రెడీ అవుతాడేమో చూడాలి.