పవన్‌కల్యాణ్, త్రిష జంటగా నటించిన ప్రేమకథా చిత్రం 'తీన్‌మార్'. అయితే అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినస్థాయిలో అభిమానులను మెప్పించలేకపోయింది. అయితే ఈ చిత్ర పరాజయంపై దాదాపు 12 ఏళ్ల తర్వాత డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ స్పందించారు.
తెలుగులో ప్రేమించుకుందాం రా, బావగారూ బాగున్నారా?, ప్రేమంటే ఇదేరా.. వంటి సూపర్‌హిట్ ఫీల్‌గుడ్ లవ్ స్టోరీ మూవీస్ ప్రేక్షకులకు అందించారు దర్శకుడు జయంత్ సి.పరాన్జీ. 2011లో విడుదలైన తీన్‌మార్ ఫ్లాప్ తర్వాత టాలీవుడ్‌కు దూరమయ్యారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జయంత్ సినిమా ఫ్లాప్‌పై స్పందించారు. ‘తీన్‌మార్’ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
(ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సీనియర్ నటి కన్నుమూత)
జయంత్ సి పరాన్జీ మాట్లాడుతూ.. 'సినిమా ఫ్లాప్ సంగతి పక్కన పెడితే తీన్‌మార్ నాకిప్పటికీ ప్రెష్ లవ్ స్టోరీగానే అనిపిస్తుంది. ఈ చిత్రం ఫెయిల్ కావడానికి కారణాలు నేను చెప్పలేను. కానీ ఈ చిత్రంతో కొంత మంది ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. మరీ ముఖ్యంగా త్రిషకు సోనూసూద్‌తో వివాహం చేయడం.. ఆ తర్వాత ఆమె తిరిగి పవన్‌కల్యాణ్ వద్దకు చేరడం లాంటి సీన్స్ ప్రేక్షకులకు నచ్చలేదు. ఇదే చిత్రాన్ని అప్పుడున్న యంగ్ హీరోతో చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో.' అని అన్నారు.
కాగా.. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటించిన లవ్ ఆజ్ కల్ మూవీకి రీమేక్‌గా తీన్‌మార్ తెరకెక్కించారు. పవన్‌కల్యాణ్, త్రిష, కృతి కర్బంద నటించిన ఈ చిత్రం మ్యూజికల్‌గా హిట్ అయినా.. బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.
(ఇది చదవండి: కెరీర్ ఎందుకు నాశనం చేసుకుంటావ్? అని నా భార్య ప్రశ్నించింది: మనోజ్)
Comments
Please login to add a commentAdd a comment