jayanth c paranji
-
త్రిషకు అతనితో పెళ్లి చేయడమే పెద్ద మైనస్.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్
పవన్‌కల్యాణ్, త్రిష జంటగా నటించిన ప్రేమకథా చిత్రం 'తీన్మార్'. అయితే అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినస్థాయిలో అభిమానులను మెప్పించలేకపోయింది. అయితే ఈ చిత్ర పరాజయంపై దాదాపు 12 ఏళ్ల తర్వాత డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ స్పందించారు. తెలుగులో ప్రేమించుకుందాం రా, బావగారూ బాగున్నారా?, ప్రేమంటే ఇదేరా.. వంటి సూపర్‌హిట్ ఫీల్‌గుడ్ లవ్ స్టోరీ మూవీస్ ప్రేక్షకులకు అందించారు దర్శకుడు జయంత్ సి.పరాన్జీ. 2011లో విడుదలైన తీన్మార్ ఫ్లాప్ తర్వాత టాలీవుడ్‌కు దూరమయ్యారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జయంత్ సినిమా ఫ్లాప్‌పై స్పందించారు. ‘తీన్మార్’ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సీనియర్ నటి కన్నుమూత) జయంత్ సి పరాన్జీ మాట్లాడుతూ.. 'సినిమా ఫ్లాప్ సంగతి పక్కన పెడితే తీన్మార్ నాకిప్పటికీ ప్రెష్ లవ్ స్టోరీగానే అనిపిస్తుంది. ఈ చిత్రం ఫెయిల్ కావడానికి కారణాలు నేను చెప్పలేను. కానీ ఈ చిత్రంతో కొంత మంది ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. మరీ ముఖ్యంగా త్రిషకు సోనూసూద్‌తో వివాహం చేయడం.. ఆ తర్వాత ఆమె తిరిగి పవన్‌కల్యాణ్ వద్దకు చేరడం లాంటి సీన్స్ ప్రేక్షకులకు నచ్చలేదు. ఇదే చిత్రాన్ని అప్పుడున్న యంగ్ హీరోతో చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో.' అని అన్నారు. కాగా.. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటించిన లవ్ ఆజ్ కల్ మూవీకి రీమేక్‌గా తీన్మార్ తెరకెక్కించారు. పవన్‌కల్యాణ్, త్రిష, కృతి కర్బంద నటించిన ఈ చిత్రం మ్యూజికల్‌గా హిట్ అయినా.. బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. (ఇది చదవండి: కెరీర్ ఎందుకు నాశనం చేసుకుంటావ్? అని నా భార్య ప్రశ్నించింది: మనోజ్) -
పంచ్ పడుద్ది
‘ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, బావ గారూ బాగున్నారా, శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్, లక్ష్మీనరసింహ’ వంటి సూపర్‌హిట్స్ అందించిన జయంత్.సి.పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘నరేంద్ర’. నిలేష్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ మోడల్ ఇజా బెల్లాని హీరోయిన్గా ఫిక్స్చేశారు. జయంత్ సి.పరాన్జీ మాట్లాడుతూ– ‘‘చాంపియన్‌గా ఎదిగిన ఓ బాక్సర్ కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇప్పటికే తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి అయింది. కొత్త షెడ్యూల్ మార్చి 10 నుంచి ప్రారంభం కానుంది. వరల్డ్ రెజ్లింగ్‌లో భారతదేశం తరపున సత్తా చాటుతున్న స్టార్ రెజ్లర్ గ్రేట్ కాళీ ఈ చిత్రంలో నటిస్తుండం విశేషం. ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ రామ్ సంపత్ ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు. అన్ని ఎమోషన్స్‌తో ప్రేక్షకులను మెప్పించేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘జయంత్గారి వంటి సీనియర్ డైరెక్టర్‌తో పనిచేయడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో చాలెంజింగ్ రోల్ చేస్తున్నాను. మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు ఇజాబెల్లా. ఈ చిత్రానికి సంగీతం: రామ్ సంపత్, కెమెరా: వీరేన్ తంబిదొరై, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కోయలగుండ్ల, నిర్మాత: ఈషాన్ ఎంటర్టైన్మెంట్. -
జయంత్ సినిమాలో రెజ్లింగ్ స్టార్
మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి టాప్ స్టార్లను డైరెక్ట్ చేసిన స్టైలిష్ డైరెక్టర్ జయంత్ సీ పరాన్జీ. కమర్షియల్ ఎంటర్టైనర్లతో ఆకట్టుకున్న జయంత్ కొంత కాలంగా సరైన హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. చివరగా గంటా రవితేజను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన జయదేవ్ కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తాజాగా మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు జయంత్. మరోసారి రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన నిలేష్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు జయంత్. ‘నరేంద్ర’ అనే టైటిల్ తో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈషన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. ఈ సినిమాలో డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ ద గ్రేట్ ఖలీ కీలక పాత్రలో కనిపించనున్నాడు. -
యాక్షన్ థ్రిల్లర్‌గా ‘నరేంద్ర’
మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి టాప్ స్టార్లను డైరెక్ట్ చేసిన స్టైలిష్ డైరెక్టర్ జయంత్ సీ పరాన్జీ. కమర్షియల్ ఎంటర్టైనర్లతో ఆకట్టుకున్న జయంత్ కొంత కాలంగా సరైన హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. చివరగా గంటా రవితేజను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన జయదేవ్ కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తాజాగా మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు జయంత్. మరోసారి రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన నిలేష్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు జయంత్. ‘నరేంద్ర’ అనే టైటిల్ తో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈషన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. -
త్వరలో తెరపైకి ముందల్
తమిళసినిమా: సామాజిక దృక్పథంతో కూడిన భారీ యాక్షన్ కథా చిత్రంగా ముందల్ ఉంటుందని చిత్ర దర్శకుడు జయంత్ తెలిపారు. 250 చిత్రాలకు పైగా స్టంట్‌మాస్టర్‌గా పనిచేసిన ఈయన తొలిసారిగా మెగాఫోన్ పట్టిన చిత్రం ఇది. చిత్ర నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతున్న ఈ చిత్రం గురించి జయంత్ మాట్లాడుతూ ఒక స్టంట్ కళాకారుడిగా తన జీవితం ప్రారంభం అయినా దర్శకుడవ్వాలన్నది తన జీవిత లక్ష్యం అన్నారు. అది ఈ ముందల్ చిత్రం ద్వారా నెరవేరిందని చెప్పారు. ఇది సామాజిక దృక్పథంతో కూడిన యాక్షన్ ఎడ్వెంచర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. కాన్సర్ వ్యాధిని శాశ్వతంగా రూపుమాపే మందు ఫార్ములాను సిద్ధులు తాళపత్రాలపై రాసి వాటిని ఒక రహస్య ప్రదేశంలో భద్రపరచినట్లు కథానాయకుడికి తెలుస్తుందన్నారు. దాన్ని ఆ తాళపత్రాల గురించి కనిపెట్టి ఫార్ములాను ప్రభుత్వానికి అప్పగించి, తద్వారా ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించాలని ప్రయత్నిస్తాడన్నారు. ఇదే ఫార్ములా గురించి తెలుసుకున్న మరో ముఠా దాన్ని తమ స్వార్థం కోసం వాడుకోవాలని ప్రయత్నిస్తుందన్నారు. అయితే ఆ ఫార్ములా ఎవరికి లభిస్తుంది అన్నది చిత్ర కథ అని తెలిపారు. ఇందులో ఏడు ఫైట్స్ ఉంటాయని చెప్పారు. ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్న అప్పుకృష్ణ పోరాట దృశ్యాల్లో నటించడానికి కుంగ్‌ఫూ, సిలంబ్బాట్టం వంటి విద్యల్లో ప్రత్యేకంగా శిక్షణ పొందారని చెప్పారు. అదే విధంగా పలు సన్నివేశాలను సముద్ర అడుగు భాగంలో చిత్రీకించినట్లు, అందుకు హీరో ఈత కూడా నేర్చుకుని నటించారని తెలిపారు. విలన్‌గా నాన్‌కడవుల్ రాజేంద్రన్ అద్భుతంగా నటించారని చెప్పారు. చిత్రాన్ని ఏడు దేశాల్లో చిత్రీకరించినట్లు తెలిపారు. ముఖ్యంగా ఇంతవరకూ ఎవరూ షూటింగ్ చేయని కాంబోడియాలోని అంకూర్ వాడ్ ఆలయంలో పాట సన్నివేశాలను, ఫైట్ దృశ్యాలను చిత్రీకరించినట్లు చెప్పారు. చిత్ర నిర్మాణం కార్యక్రమాలు పూర్తి అయ్యాయని, త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు జయంత్ వెల్లడించారు. తన తదుపరి చిత్రం కూడా సామాజక స్పృహతో కూడిన కథాంశంతోనే ఉంటుందని ఆయన చెప్పారు. -
మహేష్ సినిమా ఫ్లాప్ కు కారణం నేనే : దర్శకుడు
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన కౌబాయ్ మూవీ టక్కరి దొంగ. స్టైలిష్ డైరెక్టర్ జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమా పరాజయం పై దర్శకుడు జయంత్ చాలా కాలం తరువాత స్పందించారు. ఇటీవల గంటా రవితేజ హీరోగా జయదేవ్ సినిమాను తెరకెక్కించిన జయంత్, ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా టక్కరిదొంగ సినిమాను గుర్తు చేసుకున్నాడు. ఇటీవల మహేష్ నటించిన స్పైడర్ సినిమా కూడా నిరాశపరచటంతో టక్కరిదొంగపై జయంత్ స్పందన సోషల్ ఈ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది. టక్కరిదొంగ సినిమా సమయంలో పూర్తి స్క్రిప్ట్ చేతులో లేకుండానే సినిమాను ప్రారంభించినట్టుగా తెలిపాడు జయంత్. దీంతో షూటింగ్ తో పాటు స్క్రిప్ట్ పనులు ఒకేసారి చేయటంతో సినిమా ఆశించిన స్థాయిలో రాలేదంటూ టక్కరిదొంగ ఫెయిల్యూర్ ను విశ్లేషించారు. -
రీమేక్‌తో ఎంట్రీ ఇస్తున్న రవితేజ
సినీ ప్రముఖుల వారసులు మాత్రమేకాదు.. రాజకీయనాయకుల వారసులు కూడా వెండితెరపై మెరిసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలా మంది రాజకీయనాయకుల వారసులు సినీరంగంలో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అదే బాటలో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు రవితేజ. ఏపి మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు రవితేజ త్వరలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే తొలి సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న రవితేజ, రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. తమిళ్ లో ఘనవిజయం సాధించిన సేతుపతి సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాకు రీమేక్ స్పెషలిస్ట్ జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతోంది. -
మాఫియా నేపథ్యంలో జయంత్ సినిమా
ఒకప్పుడు స్టైలిష్ డైరెక్టర్‌గా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న జయంత్ సి పరాన్జీ, ఈ మధ్య ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. ఒకప్పుడు వరుస సూపర్ హిట్స్‌తో స్టార్ డైరెక్టర్ అనిపించుకున్న జయంత్, తరువాత వరుస ఫ్లాప్‌లతో డీలా పడిపోయాడు. దీంతో చాలా రోజులుగా సినీ రంగానికి దూరంగా ఉంటున్న జయంత్ తాజాగా గంటా శ్రీనివాస్ తనయుణ్ని హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు మరో సినిమాను ఎనౌన్స్ చేశాడు. ఉగ్రం పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాతో నీలేష్ ఈటి అనే కొత్త హీరోను పరిచయం చేయనున్నాడు. ఇసాబెల్లా అనే మోడల్ హీరోయిన్గా పరిచయం అవుతోంది. ముంబై మాఫియాకు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌కు మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా కథ అని తెలుస్తోంది. ఎక్కువగా భాగం షూటింగ్ ముంబైలోనే జరగనుంది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాను పూర్తిచేసి నవంబర్ నుంచి ఉగ్రంను సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్లాన్ ఉన్నాడు జయంత్. -
మహేష్ సినిమా కోసం ఇద్దరు దర్శకులు
టాలీవుడ్లో కేవలం తన స్టార్ ఇమేజ్‌తో వంద కోట్ల వసూళ్లను రాబట్టగలిగిన హీరోగా ప్రూవ్ చేసుకున్న స్టార్ మహేష్ బాబు. శ్రీమంతుడు సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్‌లు సృష్టించిన మహేష్ వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం చేస్తోన్న బ్రహ్మోత్సవం ఇప్పటికే పూర్తి కావస్తుండటంతో తరువాత చేయబోయే సినిమాలను లైన్లో పెడుతున్నాడు. బ్రహ్మోత్సవం పూర్తి కాకముందే మరో రెండు సినిమాలను ఫైనల్ చేశాడు. త్వరలోనే తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రానికి రెడీ అవుతున్నాడు మహేష్. ఇప్పటికే కథా కథనాలు కూడా రెడీ అయిన ఈ సినిమా, ఏప్రిల్‌లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా పూర్తవ్వగానే మరో ఆసక్తికర చిత్రాన్ని పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు. కాఫీ లాంటి చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో నటించడానికి ఓకె చెప్పాడు. ఈ సినిమాను, మహేష్ బాబుతో టక్కరి దొంగ సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ జయంత్ సి పరాన్జీ నిర్మించనున్నాడు. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా మహేష్ నెక్ట్స్ సినిమా శేఖర్ కమ్ములతోనే అన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఒకే సినిమా కోసం ఇద్దరు దర్శకులు కలిసి పనిచేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. -
హ్యాంగ్ అప్ మూవీ ఆడియో లాంచ్