
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన కౌబాయ్ మూవీ టక్కరి దొంగ. స్టైలిష్ డైరెక్టర్ జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమా పరాజయం పై దర్శకుడు జయంత్ చాలా కాలం తరువాత స్పందించారు. ఇటీవల గంటా రవితేజ హీరోగా జయదేవ్ సినిమాను తెరకెక్కించిన జయంత్, ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా టక్కరిదొంగ సినిమాను గుర్తు చేసుకున్నాడు.
ఇటీవల మహేష్ నటించిన స్పైడర్ సినిమా కూడా నిరాశపరచటంతో టక్కరిదొంగపై జయంత్ స్పందన సోషల్ ఈ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది. టక్కరిదొంగ సినిమా సమయంలో పూర్తి స్క్రిప్ట్ చేతులో లేకుండానే సినిమాను ప్రారంభించినట్టుగా తెలిపాడు జయంత్. దీంతో షూటింగ్ తో పాటు స్క్రిప్ట్ పనులు ఒకేసారి చేయటంతో సినిమా ఆశించిన స్థాయిలో రాలేదంటూ టక్కరిదొంగ ఫెయిల్యూర్ ను విశ్లేషించారు.
Comments
Please login to add a commentAdd a comment