Takkari Donga
-
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మహేశ్ బాబు హీరోయిన్
దేశంలోని చాలామంది బ్యూటీలతో పాటు విదేశీ భామలు ఎందరో టాలీవుడ్లో హీరోయిన్లుగా చేశారు. కాకపోతే ఈ ప్రయత్నంలో క్లిక్ అయి, స్టార్ హీరోయిన్లు అయినోళ్లు చాలా తక్కువమంది. కానీ ఎంతో అందంగా ఉన్న ముద్దుగుమ్మలు కూడా స్టార్ హీరోల సరసన నటించారు. కాకపోతే అదృష్టం కలిసి రాక కనుమరుగైపోయారు. ఈ బ్యూటీది కూడా సేమ్ అలాంటి పరిస్థితి. ఇంతలా చెప్పాం కదా ఈమెని గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన కనిపిస్తున్న ఆమె పేరు లీసా రే. ఇప్పటికీ మీకు ఐడియా రాలేదు కదా! 'టక్కరి దొంగ' హీరోయిన్ అంటే బహుశా గుర్తుపడతారేమో? మహేశ్ బాబు కౌబాయ్ తరహా పాత్రలో నటించిన సినిమా అది. ఖర్చు బాగానే పెట్టారు గానీ తెలుగు ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. ఇదే మూవీలో మరో హీరోయిన్గా చేసిన బిపాసు బసు.. ఆ తర్వాత కాలంలో బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయిపోగా.. లీసా మాత్రం కొన్ని కారణాల వల్ల కెరీర్ సరిగా ప్లాన్ చేసుకోలేకపోయింది.(ఇదీ చదవండి: హీరో విశాల్‌ని టార్గెట్ చేసిన తమిళ నిర్మాతలు.. అసలేం జరుగుతోంది?)కెనడాకి చెందిన లీసారే.. హిందీ-బెంగాలీ ఫ్యామిలీలో పుట్టింది. మోడల్‌గా పలు యాడ్స్ చేసి, హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 1994 నుంచి 2019 వరకు 20కి పైగా సినిమాలు చేసింది. వీటిలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ మూవీస్ ఉన్నాయి. ఇకపోతే 2009లో క్యాన్సర్ బారిన పడి కోలుకున్నాక లీసాకు అవకాశాలు తగ్గిపోయాయి. 2012లో జేసన్ డేన్హీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని పూర్తిగా ఫ్యామిలీ పర్సన్ అయిపోయింది. ఈమెకు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు.ప్రస్తుతం లీసా రేకు 52 ఏళ్లు. అయితేనేం మోడ్రన్ డ్రస్సుల్లో ఇంకా గ్లామరస్‌గానే ఉంది. కాకపోతే అప్పటితో పోలిస్తే గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అయితే ఈమె మహేశ్ 'టక్కరిదొంగ' హీరోయిన్ అని తెలిసి మాత్రం చాలామంది అవాక్కవుతున్నారు.(ఇదీ చదవండి: ప్రాక్టీస్‌లోనూ తమన్నా రొమాంటిక్ డ్యాన్స్.. ఒరిజినల్ కంటే ఇదే..!) -
మహేష్ సినిమా ఫ్లాప్ కు కారణం నేనే : దర్శకుడు
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన కౌబాయ్ మూవీ టక్కరి దొంగ. స్టైలిష్ డైరెక్టర్ జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమా పరాజయం పై దర్శకుడు జయంత్ చాలా కాలం తరువాత స్పందించారు. ఇటీవల గంటా రవితేజ హీరోగా జయదేవ్ సినిమాను తెరకెక్కించిన జయంత్, ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా టక్కరిదొంగ సినిమాను గుర్తు చేసుకున్నాడు. ఇటీవల మహేష్ నటించిన స్పైడర్ సినిమా కూడా నిరాశపరచటంతో టక్కరిదొంగపై జయంత్ స్పందన సోషల్ ఈ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది. టక్కరిదొంగ సినిమా సమయంలో పూర్తి స్క్రిప్ట్ చేతులో లేకుండానే సినిమాను ప్రారంభించినట్టుగా తెలిపాడు జయంత్. దీంతో షూటింగ్ తో పాటు స్క్రిప్ట్ పనులు ఒకేసారి చేయటంతో సినిమా ఆశించిన స్థాయిలో రాలేదంటూ టక్కరిదొంగ ఫెయిల్యూర్ ను విశ్లేషించారు. -
ఈ బసవరాజు బయటికి వస్తే... ఇక అంతే!
ఉత్తమ విలన్ ఇతని పేరు బసవరాజు. తను సహజంగా బయటికి రాడు. వచ్చాడంటే ఏదో ఒక దారుణం జరుగుతుంది. అతడి అన్న రామరాజు... లోకల్ ఎం.ఎల్.ఏ. ఆలోచన అతనిది. ఆచరణ ఇతనిది. పై పరిచయ వాక్యాలు బసవరాజుగా నటించిన ‘రాహుల్ దేవ్’ గురించి ‘తులసి’ సినిమాలో వినిపిస్తాయి. విలన్ అంటే... డైలాగులతోనైనా భయపెట్టాలి. దేహదారుఢ్యంతోనైనా భయపెట్టాలి. హావభావాలతోనైనా భయపెట్టాలి. అలా అని... రాహుల్ దేవ్ వీర శూర భీకర... పంచ్ డైలాగులు వాడలేదు. అదే పనిగా తన ‘ప్యాక్’ బాడీని ప్రదర్శించలేదు. హావభావాలు కూడా అతిగా ప్రదర్శించలేదు. ‘ఎంత చేయాలో అంత’ అనే లెక్క ప్రకారమే నటిస్తున్నట్లుగా ఉంటుంది తప్ప... ప్రేక్షకులను భయపెట్టడానికి నటనతో నానా తిప్పలు పడినట్లు కనిపించదు. ‘టక్కరి దొంగ’ సినిమాలో ‘రేయ్ నేను నీ తమ్ముడిని రా’ అని ఒకవైపు బంధం గుర్తు తెస్తూనే... మరోవైపు... నిజం చెప్పించడానికి పది ఛాన్సులు ఇవ్వగలడు. ఆ తరువాత... ఏ ఛాన్సూ ఉండదు. అడకత్తెరతో వేళ్లను ఒక్కటొక్కడిగా కట్ చేయగలడు.మహేష్‌బాబు ‘టక్కరిదొంగ’లో ‘శాకా’గా తెలుగు తెరకు పరిచయం అయిన రాహుల్‌దేవ్... మొదటి సీన్‌తోనే ‘ఉత్తమ విలన్’ అనిపించుకున్నాడు. ఆ సినిమా బాగా ఆడి ఉంటే... తెలుగు తెరపై రాహుల్ దేవ్ మరింత బాగా పాపులరై ఉండేవాడేమో. ‘నా బెంగుళూరులో నన్ను కొట్టి బతుకుదామనే’ అని ‘బసరావజు’గా వార్నింగ్ ఇచ్చినా...‘నన్ను ఎదిరించాలంటే... ఎవడైనా కొత్తగా పుట్టి పెరిగి రావాలి’ అంటూ శ్రీశైలంగా ‘చిన్నోడు’ సినిమాలో తన శక్తి ఏమిటో చెప్పదలిచినా.... రాహుల్ దేవ్ అంటే విలన్. ఒక స్టైలిష్ విలన్. అతని విలనిజం నడకలో ఉందా, పల్చటి పొడవాటి తల వెంట్రుకలలో ఉందా, కండల్లో ఉందా... కళ్లలో ఉందా... కాస్త లోతుగా తెలుసుకోవాల్సిందే! హీరో పర్సనాలిటీ ఉన్న రాహుల్ ‘విలన్’ ఎలా అయ్యాడు?తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందట. డైరీలో మనమొకటి రాసుకుంటే... విధి మన నుదుట మరొకటి రాస్తుందట. రాహల్ దేవ్ మొదట మోడల్. ఆ తరువాత సినిమాల్లోకి వచ్చాడు.అయితే ‘మోడల్’ కావాలనిగానీ, ‘యాక్టర్’ కావాలనిగానీ ఎప్పుడూ అనుకోలేదు. క్రికెటర్ కావాలనుకున్నాడు. ‘ఇలా కావాలనుకుంటున్నాను’ అని చెప్పే పరిస్థితి ఇంట్లో లేదు. ఒంట్లోనేమో ధైర్యం లేదు.నాన్న ఐపీఎస్ ఆఫీసర్, అమ్మ టీచర్. చదువుకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. దీంతో తన డ్రీమ్ గురించి రాహుల్‌కు పెద్దగా మాట్లాడే అవకాశం రాలేదు. కాలేజీ రోజుల్లో ఒక డిస్కోలో రాహుల్‌ను చూసిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ ఖోల్సా రేమండ్స్ కోసం మోడలింగ్ చేయమని అడిగాడు. రాహుల్‌కు మోడలింగ్ గురించి ఏమీ తెలియదు, రోహిత్ ఖోల్సా గురించి కూడా ఎప్పుడూ విని ఉండలేదు. ‘ఒక్కసారి ట్రై చేసి చూద్దాం’ అని రంగంలోకి దూకాడు. అలా... మోడల్ అయ్యాడు.ఆ తరువాత... ‘దస్’ సినిమాతో వెండితెర మీదికి వచ్చాడు.సాధారణంగా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరిన తరువాత... సినిమాల్లోకి వస్తారు. రాహుల్ మాత్రం... సినిమాల్లోకి వచ్చాక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాడు. అక్కడ ఏర్పడిన పరిచయాలతో ‘ఛాంపియన్’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో ‘నసీర్ అహ్మద్’గా ఆకట్టుకునే నటనను ప్రదర్శించాడు. ‘‘మోడలింగ్‌లో పర్సనల్ స్టైల్‌కే ఎక్కువ మార్కులు పడతాయి. అయితే నటన ఇందుకు విరుద్ధం. ఒక పాత్ర పోషిస్తున్నప్పుడు పాత్రే కనిపించాలి తప్ప మనం కాదు’’ అంటాడు రాహుల్. అందుకే... తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా తన పేరుతో కంటే... ‘సాధు’ ‘బసవరాజు’ ‘వీరుభాయి’ మొదలైన పాత్రలతోనే రాహుల్ దేవ్ ఫేమస్ అయ్యాడు.‘మోడల్స్ నటులుగా మారితే వారి నటన అంతంత మాత్రంగానే ఉంటుంది’ అనే విమర్శ తప్పని... రాహుల్ దేవ్ విలనిజాన్ని చూస్తే మరోసారి అర్థమవుతుంది. అందుకే... రాహుల్ కేవలం నటుడు మాత్రమే కాదు ‘ఉత్తమ విలన్’ కూడా. -
నా అనుభవాలతో పుస్తకం రాస్తున్నా!
‘టక్కరిదొంగ’ చిత్రంలో నటించిన లిసారే గుర్తున్నారా? ఆ చిత్రంలో ‘చుక్కల్లో చంద్రుడే చిన్నోడు...’ అంటూ మహేశ్‌బాబుతో ఆమె చేసిన సందడిని అంత సులువుగా మర్చిపోలేం. ఆ తర్వాత తెలుగులో లిసా రే సినిమాలు చేయలేదు. పలు హిందీ చిత్రాల్లో నటించిన ఆమె పెళ్లి చేసుకుని, కొన్నాళ్లు వెండితెరకు దూరమయ్యారు. దురదృష్టవశాత్తు ఆరేళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడ్డారు. చివరకి మృత్యువుతో పోరాడి గెలిచారు. ఇప్పుడామె క్యాన్సర్ గురించి అందరిలోనూ అవగాహన కల్పించాలనుకుంటున్నారు. దీని గురించి లిసా రే మాట్లాడుతూ -‘‘క్యాన్సర్ నా జీవితాన్ని కొత్త దారిలో వెళ్లేలా చేసింది. అలాగే జీవితం పట్ల ఆశావహ దృక్పథాన్ని ఏర్పరచింది. ఈ వ్యాధి బారిన పడడం, చికిత్స చేయించుకున్నప్పటి రోజులు, మామూలు మనిషిగా బయటపడ్డ వైనం.. ఈ అనుభవాలతో ఓ పుస్తకం రాస్తున్నా. ఈ పుస్తకం పలువురికి ఆదర్శంగా నిలవాలన్నది నా కోరిక. క్యాన్సర్ అంటే ఇక చనిపోవాల్సిందేననే భ్రమను పోగొట్టి, ధైర్యంగా చికిత్స చేయించుకోవాలనే ఆత్మవిశ్వాసం కల్పించాలన్నది నా ఆకాంక్ష’’ అని చెప్పారామె. -
కొంత విరామం తర్వాత!
మహేష్‌బాబు నటించిన ‘టక్కరి దొంగ’ చిత్రంలో నటించిన మిల్క్ బ్యూటీ లిసా రే గుర్తుండే ఉంటారు. ఈ కెనడా భామ తర్వాత కొన్ని హిందీ చిత్రాలు చేయడంతో పాటు ఒకటీ రెండూ తమిళ, కన్నడ చిత్రాలు కూడా చేశారు. ఎక్కువగా కెనడా చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ దాదాపు ఆరేళ్ల క్రితం తనకు కేన్సర్ సోకిందనే విషయం తెలుసుకున్నారు. ఓ ఏడాది పాటు నిర్భయంగా చికిత్స చేయించుకుని, సంపూర్ణ ఆరోగ్యవంతురాలయ్యారు. మూడేళ్ల క్రితం జేసన్ డెనీ అనే వ్యక్తిని పెళ్లాడారు లిసా. ఆమె వెండితెరపై కనిపించి, నాలుగేళ్లు పైనే అయ్యింది. కొంత విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ నటన కొనసాగించాలనుకుంటున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆమె అంగీకరించిన హిందీ చిత్రం ‘ఇష్క్ ఫర్ ఎవర్’. ఈ నెలాఖరున ఈ చిత్రం ఆరంభం కానుంది.