గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మహేశ్ బాబు హీరోయిన్ | Do You Know How Mahesh Babu Takkari Donga Actress Lisa Ray Is Now, Her Latest Look Photos Goes Viral | Sakshi
Sakshi News home page

Guess This Actress: ఒక్కటే తెలుగు సినిమా.. ఇప్పుడేమో ఇద్దరు కూతుళ్లతో

Published Sat, Jul 27 2024 10:24 AM | Last Updated on Sat, Jul 27 2024 10:48 AM

Mahesh Babu Takkari Donga Actress Lisa Ray Present News

దేశంలోని చాలామంది బ్యూటీలతో పాటు విదేశీ భామలు ఎందరో టాలీవుడ్‌లో హీరోయిన్లుగా చేశారు. కాకపోతే ఈ ప్రయత్నంలో క్లిక్ అయి, స్టార్ హీరోయిన్లు అయినోళ్లు చాలా తక్కువమంది. కానీ ఎంతో అందంగా ఉన్న ముద్దుగుమ్మలు కూడా స్టార్ హీరోల సరసన నటించారు. కాకపోతే అదృష్టం కలిసి రాక కనుమరుగైపోయారు. ఈ బ్యూటీది కూడా సేమ్ అలాంటి పరిస్థితి. ఇంతలా చెప్పాం కదా ఈమెని గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

పైన కనిపిస్తున్న ఆమె పేరు లీసా రే. ఇప్పటికీ మీకు ఐడియా రాలేదు కదా! 'టక్కరి దొంగ' హీరోయిన్ అంటే బహుశా గుర్తుపడతారేమో? మహేశ్ బాబు కౌబాయ్ తరహా పాత్రలో నటించిన సినిమా అది. ఖర్చు బాగానే పెట్టారు గానీ తెలుగు ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. ఇదే మూవీలో మరో హీరోయిన్‌గా చేసిన బిపాసు బసు.. ఆ తర్వాత కాలంలో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిపోగా.. లీసా మాత్రం కొన్ని కారణాల వల్ల కెరీర్ సరిగా ప్లాన్ చేసుకోలేకపోయింది.

(ఇదీ చదవండి: హీరో విశాల్‌ని టార్గెట్ చేసిన తమిళ నిర్మాతలు.. అసలేం జరుగుతోంది?)

కెనడాకి చెందిన లీసారే.. హిందీ-బెంగాలీ ఫ్యామిలీలో పుట్టింది. మోడల్‌గా పలు యాడ్స్ చేసి, హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 1994 నుంచి 2019 వరకు 20కి పైగా సినిమాలు చేసింది. వీటిలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ మూవీస్ ఉన్నాయి. ఇకపోతే 2009లో క్యాన్సర్ బారిన పడి కోలుకున్నాక లీసాకు అవకాశాలు తగ్గిపోయాయి. 2012లో జేసన్ డేన్హీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని పూర్తిగా ఫ్యామిలీ పర్సన్ అయిపోయింది. ఈమెకు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు.

ప్రస్తుతం లీసా రేకు 52 ఏళ్లు. అయితేనేం మోడ్రన్ డ్రస్సుల్లో ఇంకా గ్లామరస్‌గానే ఉంది. కాకపోతే అప్పటితో పోలిస్తే గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అయితే ఈమె మహేశ్ 'టక్కరిదొంగ' హీరోయిన్ అని తెలిసి మాత్రం చాలామంది అవాక్కవుతున్నారు.

(ఇదీ చదవండి: ప్రాక్టీస్‌లోనూ తమన్నా రొమాంటిక్ డ్యాన్స్.. ఒరిజినల్ కంటే ఇదే..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement