Lisa Ray
-
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మహేశ్ బాబు హీరోయిన్
దేశంలోని చాలామంది బ్యూటీలతో పాటు విదేశీ భామలు ఎందరో టాలీవుడ్లో హీరోయిన్లుగా చేశారు. కాకపోతే ఈ ప్రయత్నంలో క్లిక్ అయి, స్టార్ హీరోయిన్లు అయినోళ్లు చాలా తక్కువమంది. కానీ ఎంతో అందంగా ఉన్న ముద్దుగుమ్మలు కూడా స్టార్ హీరోల సరసన నటించారు. కాకపోతే అదృష్టం కలిసి రాక కనుమరుగైపోయారు. ఈ బ్యూటీది కూడా సేమ్ అలాంటి పరిస్థితి. ఇంతలా చెప్పాం కదా ఈమెని గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన కనిపిస్తున్న ఆమె పేరు లీసా రే. ఇప్పటికీ మీకు ఐడియా రాలేదు కదా! 'టక్కరి దొంగ' హీరోయిన్ అంటే బహుశా గుర్తుపడతారేమో? మహేశ్ బాబు కౌబాయ్ తరహా పాత్రలో నటించిన సినిమా అది. ఖర్చు బాగానే పెట్టారు గానీ తెలుగు ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. ఇదే మూవీలో మరో హీరోయిన్గా చేసిన బిపాసు బసు.. ఆ తర్వాత కాలంలో బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయిపోగా.. లీసా మాత్రం కొన్ని కారణాల వల్ల కెరీర్ సరిగా ప్లాన్ చేసుకోలేకపోయింది.(ఇదీ చదవండి: హీరో విశాల్‌ని టార్గెట్ చేసిన తమిళ నిర్మాతలు.. అసలేం జరుగుతోంది?)కెనడాకి చెందిన లీసారే.. హిందీ-బెంగాలీ ఫ్యామిలీలో పుట్టింది. మోడల్‌గా పలు యాడ్స్ చేసి, హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 1994 నుంచి 2019 వరకు 20కి పైగా సినిమాలు చేసింది. వీటిలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ మూవీస్ ఉన్నాయి. ఇకపోతే 2009లో క్యాన్సర్ బారిన పడి కోలుకున్నాక లీసాకు అవకాశాలు తగ్గిపోయాయి. 2012లో జేసన్ డేన్హీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని పూర్తిగా ఫ్యామిలీ పర్సన్ అయిపోయింది. ఈమెకు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు.ప్రస్తుతం లీసా రేకు 52 ఏళ్లు. అయితేనేం మోడ్రన్ డ్రస్సుల్లో ఇంకా గ్లామరస్‌గానే ఉంది. కాకపోతే అప్పటితో పోలిస్తే గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అయితే ఈమె మహేశ్ 'టక్కరిదొంగ' హీరోయిన్ అని తెలిసి మాత్రం చాలామంది అవాక్కవుతున్నారు.(ఇదీ చదవండి: ప్రాక్టీస్‌లోనూ తమన్నా రొమాంటిక్ డ్యాన్స్.. ఒరిజినల్ కంటే ఇదే..!) -
‘నా భర్త దగ్గర ఆ రహస్యం దాచాను’
‘‘ఒకానొక సమయంలో నాకు వ్యాధి తిరగబెట్టింది. పెళ్లైన నెల తర్వాత ఇలా జరిగింది. అది చాలా కఠిన సమయం. అయితే ఈ రహస్యాన్ని నా భర్త దగ్గర దాచిపెట్టాను. పెళ్లి జరిగిన తర్వాత అన్నీ సర్దుకుంటాయని భావించాను. వైవాహిక జీవితం సాఫీగా సాగిపోవాలనే ఇలా చేశాను. దాని కారణంగా నేను ఒక్కదాన్నే క్యాన్సర్‌తో పోరాడాల్సి వచ్చింది. నిజాయితీగా చెప్పాలంటే నా జీవితంలో అత్యంత బాధ పడిన సమయం అదే’’ అంటూ మోడల్, నటి లీసా రే తన జీవితంలోని సంఘటనల గురించి పంచుకున్నారు. అర్థం చేసుకునే భర్త దొరికిన కారణంగా పెద్దగా సమస్యలేవీ ఎదురుకాలేదని కరీనా కపూర్ టాక్ షోలో చెప్పుకొచ్చారు. మోడలింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లీసారే క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. క్రమంగా వ్యాధి నుంచి కోలుకున్న ఆమె... 2012లో తన ప్రియుడు జాసన్ డేహ్నిని పెళ్లాడారు. తాజాగా ఈ విషయాల గురించి కరీనాతో మాట్లాడిన లీసా రే.. ప్రాణాంతక వ్యాధి బారిన పడిన మహిళను స్వీకరించే భర్త లభించడం తన అదృష్టమన్నారు. ‘‘ నాకు అందమైన మనస్సున్న భర్త దొరికాడు. నన్ను పెళ్లి చేసుకుంటున్నందుకు థాంక్స్ బేబీ అని తనకు చెప్పాను. ఒకవేళ వ్యాధి మళ్లీ తిరగబెడితే చికిత్స కోసం వెళ్లాల్సి ఉంటుందని కూడా చెప్పాను. నేను ఊహించినట్లుగానే జరిగింది. అయితే తనతో ప్రయాణం నాలో మార్సులు తీసుకువచ్చింది. కేవలం 3 నెలల వ్యవధిలోనే కోలుకున్నాను’’ అని భర్తపై ప్రేమను చాటుకున్నారు. కాగా లీసా రే- జాసన్ డేహ్ని జంట సరోగసీ విధానంలో 2018లో కవల ఆడపిల్లలకు జన్మనిచ్చారు. ఇక తాను క్యాన్సర్‌ను జయించిన క్రమంలో ఎదురైన మానసిక సంఘర్షణ గురించి ‘క్లోజ్ టూ ది బోన్’ పేరిట లీసా రే పుస్తకరూపంలో తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. -
గత జన్మలో మహిళ.. ఈ జన్మలో ఇలా!
మత భోధకుడు కృష్ణస్వరూప్ దాస్జీ మహిళలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యాలపై బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా, నటి లిసా రే స్పందించారు. స్వామి నారాయణ్ భుజ్ మందిర్‌కు చెందిన కృష్ణస్వరూప్ దాస్జీ.. నెలసరి సమయంలో భర్తలకు వండిపెట్టిన స్త్రీలు వచ్చే జన్మలో కుక్కలై పుడతారని, ఆ వంట తిన్న భర్తలు ఎద్దులై పుడతారంటూ వ్యాఖ్యానించిన వీడియోలు తాజాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నటి లిసా రే ఓ కుక్క ఫోటోను ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘దీని పేరు జిన్ని.. తను గత జన్మలో తను ఓ మహిళ. నెలసరి సమయంలో భర్తకు వండిపెట్టింది. అంతేగాక ఓసారి తన భర్తను కూడా వండి తినేసింది. అందుకే ఈ జన్మలో ఇలా కుక్కలా పుట్టి తన జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది. ఇక స్త్రీలంతా జిన్నిలా చేసి జీవితాన్ని ఆనందంగా గడపండి’ అంటూ ట్వీట్ చేశారు. ఇక ఆమె ట్వీట్‌కు కొంత మంది బాలీవుడ్ నటులు ఫన్నీ మీమ్స్‌తో సమాధానం ఇస్తున్నారు. ఈ ఫన్నీ మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(‘నెలసరిలో వంట చేస్తే కుక్కలుగా పుడతారు’) This is Ginni. She was a woman in her past life. Ginni used to cook for her husband while she was menstruating. Once she cooked her husband and ate him as well. Now Ginni is born as Kutri and enjoying her life at fullest. Be like Ginni. Via Mamta Jaswal pic.twitter.com/pvtemTl5tQ — Lisa Ray (@Lisaraniray) February 21, 2020 అలాగే హీరో ఆయుష్మాన్ ఖురానా ‘అవునా.. తనని అనుకరించే ముందు ప్రజలు కూడా ఎవరిని అనుకరిస్తున్నారో ముందుగా తెలుసుకోవాలి. అంతేకాదు ప్రస్తుతం మనం అభివృద్ధి చెందుతున్న సమాజంలో ఉన్నాం. కాలానుగుణంగా మన ఆలోచనలు మారాలి. అయితే ఈ సమాజంలో రెండు రకాలుగా ఆలోచించే మనుషులు ఉన్నారు. కొంతమంది మారుతున్న కాలానుగుణంగా తమ ఆలోచనలను మార్చుకుంటుంటే.. మరికొందరు పాత పద్దతులనే ఆచరిస్తూ.. అవే సరైనవని బలంగా నమ్ముతారు. ఏదేమైనా ప్రజలు ప్రస్తుత సమాజాన్ని, మారుతున్న కాలాన్ని బట్టి నడుచుకోవాలన్న విషయాన్ని తప్పక అంగీకరించాల్సిందే’ అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక మత భోధకుడు కృష్ణస్వరూప్ దాస్జీ పురాణాల కాలం నుంచి నెలసరితో ఉన్న మహిళలు కొన్ని కట్టుబాట్లను పాటిస్తున్నారని, అవి పాటించని పక్షంలో వాళ్లను ద్వేషించినా తప్పు లేదని తన అనుయాయులకు చెప్పిన వీడియోలు బయటకు రావడంతో ఆయనపై ప్రగతిశీల వాదులు మండిపడుతున్నారు. -
‘అదెంత పొరపాటో తెలుసుకున్నా’
‘ఎటువంటి మేకప్ లేకుండా 47వ ఏట ఇదీ నేను. మనం ఎలా కనిపిస్తున్నామో.. అచ్చంగా... అలాగే ప్రపంచం ముందుకు రావడానికి మనలో ఎంత మందికి ధైర్యం ఉంటుంది? యుక్త వయస్సులో ఉన్నపుడైతే నాకు ఆ ధైర్యం లేదు. ప్రతీ ఒక్కరు మన విలువను గుర్తించలేరు. అయితేనేం మీ చర్మాన్ని, అది చెప్పే కథలను ప్రేమించండి. ఓ మహిళా... నీ అనుభవాలు, నీ ప్రత్యేకతను, నీ విలువను నువ్వే గుర్తించాలి! అపుడే ప్రపంచం కూడా ఇదే విషయాన్ని ప్రతిబింబిస్తుంది. లేనిపక్షంలో అటువంటి వాళ్ల గురించి వదిలేసెయ్’ అంటూ బాలీవుడ్ నటి, మోడల్ లీసా రే తన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోకు జత చేసిన సందేశాత్మక క్యాప్షన్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ‘క్యాన్సర్‌ని జయించి..జీవితంలో నిలదొక్కుకున్న మీరు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. బాహ్య సౌందర్యం కంటే అంతఃసౌందర్యమే గొప్పదని మరోసారి నిరూపించారు. ప్రతీ మహిళ మీలాగే ఆలోచించాలి. మేకప్ ఉన్నా లేకున్నా మీరెప్పుడూ పర్ఫెక్ట్గానే ఉంటారు మేడమ్’ అంటూ లీసారేపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా మోడలింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లీసారే క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. క్రమంగా వ్యాధి నుంచి కోలుకున్న ఆమె...2012లో తన ప్రియుడు జాసన్ డేహ్నిని పెళ్లాడారు. ఈ జంట గతేడాది సెప్టెంబరులో సరోగసీ విధానంలో కవలలకు జన్మనిచ్చారు. ఇక తాను క్యాన్సర్‌ను జయించిన తీరును..ఆ క్రమంలో ఎదుర్కొన్న మానసిక సంఘర్షణను..‘క్లోజ్ టూ ది బోన్’ పేరిట లీసారే పుస్తక రూపంలో తీసుకువచ్చారు. ‘రోగాల బారిన పడినంత మాత్రాన.. జీవితం ముగిసిపోదు.. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. వైద్యరంగంలో వచ్చిన మార్పుల వల్ల నేడు అన్నీ సాధ్యమే. అందుకు నేనే ఉదాహరణ. కాబట్టి ఎప్పుడూ నిరాశ చెందవద్దంటూ’ క్యాన్సర్ బాధితుల్లో స్ఫూర్తి నింపుతున్నారు. అంతేకాకుండా అందంగా లేనంటూ ఆత్మన్యూనతతో బాధపడకూడదని.. యుక్త వయస్సులో తాను కూడా ఇలా అనుకునేదాన్నని..అది ఎంత పొరపాటో ఆలస్యంగా తెలుసుకున్నానని తన పుస్తకావిష్కరణ సందర్భంగా పలు విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నారు.‘ పదహారేళ్ల వయస్సులో ఎప్పుడూ ఎదుటివారికి ఎలా కనబడుతున్నానా అనే ఓ అభద్రతా భావంతో జీవించేదాన్ని. నేను అందంగా లేనని తెగ ఫీలైపోయేదాన్ని. అయితే ఇప్పుడే అర్థమైంది. టీనేజ్‌లో కంటే 47 ఏళ్ల వయస్సులో ఎంతో ఆకర్షణీయంగా ఉన్నానని’ అంటూ లీసారే తన గురించి చెప్పుకొచ్చారు. View this post on Instagram That’s me at 47, free and unfiltered. Do we have the courage to be seen as we are? I did not when I was younger. Not everyone will recognize your worth, but love your skin and the stories it tells, your experiences, your essence- know your worth woman!- and the world will reflect back your radiance. (And if it doesn’t, fuck it. You’re lovable and perfect regardless) Thanks @binapunjani for clearing the way for more of me and less hair to hide behind 🙏🏼 #unfilterme A post shared by lisaraniray (@lisaraniray) on Sep 15, 2019 at 11:53pm PDT -
‘‘సాహో’ టీం ఆమె వర్క్‌ను కాపీ చేసింది’
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సాహో చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయి యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కిన సాహో అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే కొంత డివైడ్ టాక్‌ను తెచ్చుకున్నప్పటికి వసూళ్లపరంగా ఇప్పటికే రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో సాహో చిత్రంపై కాపీ ఆరోపణలు వస్తున్నాయి. బాలీవుడ్ నటి లిసా రే సాహో చిత్ర యూనిట్‌పై కాపీ ఆరోపణలు చేస్తున్నారు. సాహో యూనిట్, షిలో శివ్ సులేమాన్ ఆర్ట్ వర్క్‌ను కాపీ కొట్టారని లిసా ఆరోపిస్తున్నారు. అంతేకాక ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ప్రభాస్, శ్రద్ధా కలిసి ఉన్న ‘బేబీ వోన్ట్ యూ టెల్ మీ’ అనే పోస్టర్‌ను, దాంతో పాటు ఒరిజినల్ పోస్టర్‌కు సంబంధించిన చిత్రాలను లిసా రే తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ రెండు ఫోటోల్లో బ్యాక్‌గ్రౌండ్ ఆర్ట్ వర్క్ ఒకేలా ఉంది. ఈ సందర్భంగా లిసా రే మాట్లాడుతూ.. ‘ఈ చిత్ర యూనిట్ చేసిన తప్పును ఎత్తి చూపడమే కాక బాధితుల పక్షాన నిలబడి, వారికి మద్దతుగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఓ భారీ బడ్జెట్ చిత్రంలో షిలో ఆర్ట్‌వర్క్‌ను ఒక దాన్ని కాపీ చేశారు. దీన్ని ప్రేరణ అనలేం.. ఇది ఖచ్చితంగా దొంగతనమే. ఇలాంటి పనులను ప్రపంచంలో ఎవరూ ఆమోదించరు. ఈ ఆర్ట్‌వర్క్‌ను వినియోగించుకునే ముందు సాహో యూనిట్ దాని సంబంధిత యజమానిని సంప్రదించలేదు.. ఆమె అనుమతి కూడా తీసుకోలేదు. కనీసం ఆమె పనికి తగిన గుర్తింపు కూడా ఇవ్వలేదు. ఇది సరైన పద్దతి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో సదరు వ్యక్తికి ఎలా ఉంటుందంటే.. ఎవరో దొంగ మీ ఇంట్లో చొరబడి మీ జీవితానికి, మీ జీవనోపాధికి, ఆత్మకు సంబంధించి అతి ముఖ్యమైన వస్తువును దొంగిలిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు షిలో పరిస్థితి కూడా అలానే ఉంది’ అని తెలిపారు లిసా రే. (చదవండి: జీవితం భలే మారిపోయింది) View this post on Instagram What is creativity? What is art? Where does it come from? We know what it is not. It’s not your social status. It’s not your job title. It’s not your appearance. It’s not even the image you see in the mirror. Creativity and its sister Art reach us from the sweet spot of the universe- the soul you might say- through mystery. But I do know that the creator- artist is the channel for it. Let me tell you how hard it is to create- anything- original or authentic. I personally labored for years over my book, quelled the doubts and noise from others and didn’t emerge until I had almost undone myself. Because it’s a calling. And when I was moving through dark moment of self-doubt or creative blocks, I would turn to the work that @shiloshivsuleman puts out into the world and shares on her Instagram handle. She may not even know this, but I can recognize when a creator works honourably and deeply, bleeding, sacrificing, unsleeping, stretching herself in the direction of emotional bravery to produce work that births those feelings we all look for in day to day life. To feel inspired. To feel alive. That’s why when something dishonorable happens, we need to stand up and speak up. To hold up a mirror to these makers to make them understand THIS IS NOT RIGHT. It’s come to light that a big budget film production has ripped off one of Shilo’s original creations. This is NOT inspiration but blatant theft. In no world, is this acceptable. The production did not contact the creator, ask her permission nor offer to collaborate or offer a credit. Nothing. This is not right. I believed the Hindi film industry was evolving necessarily past stealing storylines and rampant plagiarism but the producers of Shahoo have obviously not gotten the memo when it comes to art. Here’s the thing- Creators are worthy of worship. What they produce are more lasting and precious so than all the other ‘things’ we accumulate that can be taken away. Let’s hold these producers accountable for their infuriating, dishonourable action. How would you feel if a thief slid into your home and took away your most prized possessions? Your heart. Your soul. And your livelihood. Image @dietsabya A post shared by lisaraniray (@lisaraniray) on Aug 30, 2019 at 5:05am PDT -
రెహమాన్ రాసిన ప్రేమకథ
సరికొత్త ట్యూన్స్, బీట్స్‌తో ఇన్ని సంవత్సరాలు సంగీత ప్రియుల్ని అలరించిన రెహమాన్ నిర్మాతగా, కథారచయితగా మారనున్న విషయం తెలిసిందే. ‘99 సాంగ్స్’ అనే చిత్రాన్ని నిర్మించడంతో పాటు ఈ సినిమా కథను రెహమానే అందించడం విశేషం. ఈ సినిమా జూన్ 21న రిలీజ్‌కు రెడీ అయింది. ఎహాన్ భట్, ఎడిల్సీ వర్గాస్ జంటగా మనీషా కొయిరాల, లిసా రే ముఖ్య పాత్రల్లో విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. ఈ సినిమా విశేషాల గురించి రెహమాన్ మాట్లాడుతూ – ‘‘నిర్మాతగా, కథా రచయితగా నా తొలి చిత్రం జూన్ 21న రిలీజ్ అవుతుందని ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ‘99 సాంగ్స్’ సినిమా స్వచ్ఛమైన ప్రేమకథతో తీసినది. సంగీతమే ఈ సినిమాకు సోల్. జియో స్టూడియోస్‌తో కలసి ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నాం. ఎప్పటిలానే మీ ప్రేమ, అభిమానం, సపోర్ట్‌కు చాలా థ్యాంక్స్’’ అన్నారు. -
‘మీరు సరిగ్గానే చెప్పారు. నేను వృద్ధురాలినే’
‘మీరు సరిగ్గానే చెప్పారు. నేను వృద్ధురాలినే. సమయం కన్నా, నా భర్త కన్నా కూడా. మీరు శారీరకంగా ఎదిగారు గానీ.. మానసికంగా మాత్రం ఎదగలేదు. అయినా తెలివితేటలు కలిగి ఉండటం కూడా ఓ వరమే. క్యాన్సర్‌ను జయించిన నేను.. నా 46వ ఏట పరిపూర్ణ జీవితాన్ని గడుపుతున్నాను. నా ఆత్మ- శరీరం.. భద్రత, సంతోషంతో నిండిపోయాయి. మీకు కూడా ఏదో ఒకరోజు ఇలాంటి అనుభవం రావాలని కోరుకుంటున్నా’ అంటూ మోడల్, బాలీవుడ్ నటి లీసా రే తనను ఎద్దేవా చేసిన వ్యక్తికి ట్విటర్ వేదికగా ఘాటు సమాధానమిచ్చారు. ఇంతకీ విషయమేమిటంటే.. టొరంటోలో తాను దిగిన ఫొటోను లీసారే ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇందుకు స్పందనగా హర్షద్ పటేల్ అనే నెటిజన్ ..‘ టూ ఓల్డ్’అంటూ కామెంట్ చేశారు. దీంతో లీసారే పైవిధంగా సమాధానమిచ్చారు. ఈ క్రమంలో వెనక్కి తగ్గిన హర్షద్ లీసారేను క్షమాపణ కోరాడు. ‘మీరనుకున్నట్లుగా నేను పబ్లిసిటీ కోసం కామెంట్ చేయలేదు. నాకు అనిపించింది చెప్పాను అంతే’ అంటూ మరో ట్వీట్ చేశాడు. ఇందుకు స్పందించిన లీసారే.. .‘ మీ మాటలకు నేను అస్సలు బాధపడలేదు. అయితే టూ ఓల్డ్ అనే పదం స్త్రీపట్ల సమాజపు ఆలోచనా విధానానికి నిదర్శనం. వయసు ఆధారంగా ఒక వ్యక్తిని చూసే దృష్టి మారుతుంది. ఇలాంటి మాటలు మన మానసిక పరిపక్వతను తెలియజేస్తాయి. నేనైతే కౌమార దశలోనే తెలివిగా ఎలా మసలుకోవాలి, ఎదుటి వ్యక్తుల పట్ల ఎలాంటి భావన కలిగి ఉండాలి అనే విషయాలు నేర్చుకున్నా’ అంటూ మరోసారి దిమ్మతిరిగే సమాధానమిచ్చారు. లీసా రే స్పందించిన తీరుపై సునీల్ శెట్టి, ఇలియానా సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. కాగా క్యాన్సర్ నుంచి కోలుకున్న రెండేళ్ల తర్వాత(2012) తన చిరకాల మిత్రుడు జాసన్ డేహ్నిని పెళ్లాడిన లీసా రే గతేడాది సెప్టెంబరులో సరోగసీ విధానంలో కవలలకు జన్మనిచ్చారు. అదేవిధంగా.. ‘రోగాల బారిన పడినంత మాత్రాన.. జీవితం కోల్పోయినట్లు కాదు.. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. వైద్యరంగంలో వచ్చిన మార్పుల వల్ల నేడు అన్నీ సాధ్యమే. అందుకు నేనే ఉదాహరణ. కాబట్టి ఎప్పుడూ నిరాశ చెందవద్దంటూ’ క్యాన్సర్ బాధితుల్లో స్ఫూర్తి నింపుతున్నారు. You’re right. I’m old. Older than time, my boy. Perhaps you will never grow up in your mind but your body will and it’s a blessing to be wise, a cancer survivor and living my best life at 46. Unshakeably secure and happy in my spirit and body. Hope you can experience that one day https://t.co/cfwuw9yQs1 — Lisa Ray (@Lisaraniray) January 28, 2019 Honestly not hurt, but adding ‘too’ to ‘old’ is a symptom of society’s unrealistic expectations for women. Imp. to embrace age. This dialogue is good to highlight each’s state of mind. When I was young, I was different and craved guidance towards a wider, kinder perspective 🙏🏽 https://t.co/y7dBH368h8 — Lisa Ray (@Lisaraniray) January 29, 2019 -
కవలలకు జన్మనిచ్చిన హీరోయిన్!!
‘ఈ క్షణం ఎన్నో భావోద్వేగాలు నన్ను చుట్టుముట్టాయి. పాలు పట్టడం, డైపర్లు మార్చడం, వాళ్లతో ఆడుకోవడం.. ఓ గాడ్.. ఇలా ఒక్కటేమిటి ప్రస్తుతం నాకోసం ఎన్నో పనులు ఎదురుచూస్తున్నాయి. వారిద్దరిని ముంబైకి తీసుకువచ్చే రోజు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నానంటూ’ మోడల్, బాలీవుడ్ హీరోయిన్ లీసా రే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. క్యాన్సర్ నుంచి కోలుకున్న రెండేళ్ల తర్వాత(2012) తన చిరకాల మిత్రుడు జాసన్ డేహ్నిని పెళ్లాడారు లీసా. తన వైవాహిక జీవితం ఎన్నో సంతోషాలతో కొనసాగుతోందని.. తన కూతుళ్ల రాకతో అది పరిపూర్ణమైందని భావోద్వేగానికి లోనయ్యారు. అవును లీసా రే ప్రస్తుతం ఇద్దరు ఆడపిల్లలకు తల్లి. అది కూడా కవలలు. జార్జియాలో జన్మించిన తన కవలలు ఇండియాకు రాగానే మనకు పరిచయం చేస్తారట. అదేంటి లీసా రే ఎప్పుడు గర్భం దాల్చారు.. ఆమె పిల్లలు జార్జియాలో జన్మించడమేంటని ఆశ్చర్యపోకండి. అసలు విషయమేమిటంటే.. సరోగసి ద్వారా ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చారు లీసా రే. ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్న లీసా.. తన జీవితంలో ఏదీ ప్రణాళిక ప్రకారం జరగలేదని, అయితే తన భర్త కూతుళ్ల రూపంలో తనకు గొప్ప సర్ప్రైజ్ ఇచ్చారంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని జీవితంలో నిలదొక్కుకున్నానని, క్యాన్సర్ బారిన పడినప్పటి నుంచి, తల్లిగా మారడం దాకా తన ప్రయాణంలో ఎదురైన అనుభవాలను ప్రతీ ఒక్కరికి తెలియజేస్తానన్నారు. ‘రోగాల బారిన పడినంత మాత్రాన.. జీవితం కోల్పోయినట్లు కాదు.. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. వైద్యరంగంలో వచ్చిన మార్పుల వల్ల నేడు అన్నీ సాధ్యమే. అందుకు నేనే ఉదాహరణ. కాబట్టి ఎప్పుడూ నిరాశ చెందవద్దంటూ’ స్ఫూర్తి నింపారు. -
నా అనుభవాలతో పుస్తకం రాస్తున్నా!
‘టక్కరిదొంగ’ చిత్రంలో నటించిన లిసారే గుర్తున్నారా? ఆ చిత్రంలో ‘చుక్కల్లో చంద్రుడే చిన్నోడు...’ అంటూ మహేశ్‌బాబుతో ఆమె చేసిన సందడిని అంత సులువుగా మర్చిపోలేం. ఆ తర్వాత తెలుగులో లిసా రే సినిమాలు చేయలేదు. పలు హిందీ చిత్రాల్లో నటించిన ఆమె పెళ్లి చేసుకుని, కొన్నాళ్లు వెండితెరకు దూరమయ్యారు. దురదృష్టవశాత్తు ఆరేళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడ్డారు. చివరకి మృత్యువుతో పోరాడి గెలిచారు. ఇప్పుడామె క్యాన్సర్ గురించి అందరిలోనూ అవగాహన కల్పించాలనుకుంటున్నారు. దీని గురించి లిసా రే మాట్లాడుతూ -‘‘క్యాన్సర్ నా జీవితాన్ని కొత్త దారిలో వెళ్లేలా చేసింది. అలాగే జీవితం పట్ల ఆశావహ దృక్పథాన్ని ఏర్పరచింది. ఈ వ్యాధి బారిన పడడం, చికిత్స చేయించుకున్నప్పటి రోజులు, మామూలు మనిషిగా బయటపడ్డ వైనం.. ఈ అనుభవాలతో ఓ పుస్తకం రాస్తున్నా. ఈ పుస్తకం పలువురికి ఆదర్శంగా నిలవాలన్నది నా కోరిక. క్యాన్సర్ అంటే ఇక చనిపోవాల్సిందేననే భ్రమను పోగొట్టి, ధైర్యంగా చికిత్స చేయించుకోవాలనే ఆత్మవిశ్వాసం కల్పించాలన్నది నా ఆకాంక్ష’’ అని చెప్పారామె. -
క్యాన్సర్ అంటే నాకు లెక్కలేదు...
ముంబై: క్యాన్సర్ వల్లనే తనకు జీవితం విలువ తెలిసొచ్చిందని, ఇప్పటి వరకు తాను సంపాదించినదాంట్లో కొంత భాగాన్ని క్యాన్సర్ పరిశోధనలకు వెచ్చించడం, తన సినిమా కెరీర్‌పై దృష్టిని కేంద్రీకరించడమే తన లక్ష్యమని గత ఆరేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న కెనడియన్-ఇండియన్ సినీ తార లీసా రే మీడియా ముందు వెల్లడించారు. అప్పుడే మూడు బాలివుడ్ సినిమా ప్రాజెక్టుల్లో నిమగ్నమయ్యానని ఆమె తెలిపారు. 2009, జూన్‌లో ఆమెకు తెల్ల రక్తకణాల్లో క్యాన్సర్ ఉన్నట్టు బయటపడింది. అప్పటి నుంచి ఆమె సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు బాగా కోలుకున్నానని, అందుకే మళ్లీ కెరీర్‌పై దృష్టి పెట్టానని ఆమె చెప్పారు. వాస్తవానికి తనలో క్యాన్సర్ గుర్తించిన నాటి నుంచే తాను నిజమైన జీవితాన్ని గుడుపుతున్నానని, ఈ జబ్బు వల్లనే జీవితం విలువ తెలిసొచ్చిందని, ఇక ముందున్నదంతా తనది తాత్విక జీవితమేనని ఆమె అన్నారు. లీసా రే 2001లో విక్రమ్ భట్ తీసిన ‘కసూర్’ సినిమా ద్వారా బాలీవుడ్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత దీపా మెహతా తీసిన ‘వాటర్’, దిలీప్ మెహతా తీసిన ‘కుకింగ్ విత్ స్టెల్లా’ లాంటి చిత్రాల్లోనే కాకుండా ‘కిల్ కిల్ ఫాస్టర్ ఫాస్టర్’ బ్రిటిష్ త్రిల్లర్ చిత్రంలో, మరికొన్ని హాలివుడ్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సంజయ్ డేమా దర్శకత్వంలో వెలువడనున్న తొలి సినిమా ‘ఇష్క్ ఫరెవర్’ తాను నటిస్తున్నానని, ఇది ఈ ఏడాది చివరలో విడుదలవుతోందని ఆమె తెలిపారు. అలాగే సంజయ్ సూరి దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నానని చెప్పారు. ‘మై ఔర్ చార్లెస్’ సినిమా సీక్వల్లో ఓ పాత్ర కోసం ఆ సినిమా నిర్మాతలతో చర్చలు జరుగుతున్నాయని ఆమె తెలిపారు. అంతర్జాతీయ క్రిమినల్ చార్లెస్ శోభరాజ్ జీవిత గాధ ఆధారంగా నిర్మిస్తున్న ‘మై ఔర్ చార్లెస్’ సినిమా జూలైలో విడుదల కానుంది. -
కొంత విరామం తర్వాత!
మహేష్‌బాబు నటించిన ‘టక్కరి దొంగ’ చిత్రంలో నటించిన మిల్క్ బ్యూటీ లిసా రే గుర్తుండే ఉంటారు. ఈ కెనడా భామ తర్వాత కొన్ని హిందీ చిత్రాలు చేయడంతో పాటు ఒకటీ రెండూ తమిళ, కన్నడ చిత్రాలు కూడా చేశారు. ఎక్కువగా కెనడా చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ దాదాపు ఆరేళ్ల క్రితం తనకు కేన్సర్ సోకిందనే విషయం తెలుసుకున్నారు. ఓ ఏడాది పాటు నిర్భయంగా చికిత్స చేయించుకుని, సంపూర్ణ ఆరోగ్యవంతురాలయ్యారు. మూడేళ్ల క్రితం జేసన్ డెనీ అనే వ్యక్తిని పెళ్లాడారు లిసా. ఆమె వెండితెరపై కనిపించి, నాలుగేళ్లు పైనే అయ్యింది. కొంత విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ నటన కొనసాగించాలనుకుంటున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆమె అంగీకరించిన హిందీ చిత్రం ‘ఇష్క్ ఫర్ ఎవర్’. ఈ నెలాఖరున ఈ చిత్రం ఆరంభం కానుంది. -
న్యూ ఫ్రెండ్స్...
బాలీవుడ్ కలల రాణి కత్రినా కైఫ్ కొత్త స్నేహం మొదలెట్టింది. రణబీర్ కపూర్ ఉండగా మధ్యలో ఈ దోస్తానా ఎవరనేగా..! బాయ్ కాదు... గాళ్‌ఫ్రెండ్! డేటింగ్షిప్ల్లో మునిగితేలుతున్న తారా లోకంలో వినడానికి కాస్త కొత్తగా ఉన్నా... ఇది నిజం. ఇటీవల ఓ కమర్షియల్ షూట్ సందర్భంగా కెనడా నటి లీసారెతో మాంచి దోస్తీ ఏర్పడింది. ఇద్దరూ గంటల కొద్దీ... తమ ట్రావెల్ ప్లాన్స్, ఇతర విషయాలను షేర్ చేసుకున్నారు. వింటర్లో స్కిన్ కేర్ గురించిన టిప్స్ ఒకరికొకరు చెప్పుకున్నారు. మొత్తానికి ఇద్దరు భామలూ ముచ్చట్లతో ఉల్లాసంగా గడిపారనేది ఓ వెబ్సైట్ కథనం. -
లీసా రే కేన్సర్ ఇన్స్టిట్యూట్
కెనడాలో పుట్టిన బాలీవుడ్ భామ లీసా రే భారత్‌లో కేన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని అనుకుంటోంది. మల్టిపుల్ మైలోమా అనే ఒకరకమైన కేన్సర్‌తో బాధపడుతున్న లీసా, కేన్సర్ పరిశోధనలపై కృషి సాగిస్తున్న శాండిల్య సేన్‌గుప్తా సహకారంతోఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. బోస్టన్లోని డానా-ఫార్బర్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ తరహాలోనే భారత్‌లో సకల సౌకర్యాలతో కూడిన కేన్సర్ ఇన్స్టిట్యూట్ నెలకొల్పాలని శాండిల్య, లీసా భావిస్తున్నట్లు సమాచారం. -
పర్యటనే నా అభిరుచి : లీసారే
కొత్త కొత్త అనుభవాలకోసం వెంపర్లాడుతుంటానని, అందువల్లనే ప్రపంచంలోని అనేక నగరాల్లో ఉన్నానని, ఒకేచోట ఉండలేకపోయానని నటి లీసారే తన మనసులో మాట చెప్పింది. త్వరలో సొంతగడ్డ అయిన భారత్‌కు రావాలని యోచిస్తున్నట్టు కేన్సర్ వ్యాధి బారినపడి విజయవంతంగా బయటపడిన ఈ 42 ఏళ్ల ఇండో కెనడియన్ ఇటీవల ప్రకటించింది. తన జీవితాన్ని, సినిమా కెరీర్‌ను మార్చేసిన తళుకుల నగరానికి రాబోతున్నానంది. ‘నేనొక దేశదిమ్మరిని. ప్రకృతిపరంగా వివిధ రకాల అనుభవాలను నా మనసు కోరుకుంటుంది. చిన్నతనంలో ఒకేచోట ఉండేదాన్ని. ఇప్పుడు జీవితంతోపాటు పరిశ్రమ కూడా మారిపోయింది. నాకు ఇక్కడ ఎన్నో ప్రాజెక్టులు దక్కబోతున్నాయి. వెనక్కివచ్చేయాలనే ఆలోచన ఏనాటినుంచో ఉంది. అయితే ఎప్పుడు రావాలనేదే ఓ ప్రశ్నగా మిగిలిపోయింది’ అని అంది. వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాల వల్లనే టొరంటోనుంచి ముంబైకి రావాలనుకుంటున్నానని ఈ రెండు నగరాల మధ్య తరచూ రాకపోకలు సాగించే ఈ ‘వాటర్’ నటి తెలిపింది. ‘న న్ను తీర్చిదిద్దిన నగరంలో మరింత సమయం గడపాల్సిన అవసరం ఉందనే విషయాన్ని గుర్తించాను. ఏ దేశంలో ఉన్నప్పటికీ నా మనసులో కొంత భాగం భారతదేశంలోనే ఉండేది. నా జీవితానికి సంబంధించి మరికొంత స్పష్టత రావాల్సి ఉంది. నా జీవితానికి ఏది వర్తిస్తుంది ? ఏది వర్చించదు? అనే విషయం నాకు బాగా తెలుసు. నాకు నా స్నేహితులు ఎంతో ముఖ్యం. ఇందుకు వ్యక్తిగతమైన కారణాలతోపాటు వృత్తిపరమైన కారణాలు కూడా ఉన్నాయి’ అని అంది. కాగా లీసారే కాశ్మీర్ కథాంశంగా రూపొందబోతున్న సినిమాకు సంతకాలు చేసింది. ఈ సినిమాలో సంజయ్సూరి సరసన నటించనుంది. -
నేనొక దేశదిమ్మరిని
న్యూఢిల్లీ: కొత్త కొత్త అనుభవాలకోసం వెంపర్లాడుతుంటానని, అందువల్లనే ప్రపంచంలోని అనేక నగరాల్లో ఉన్నానని, ఒకేచోట ఉండలేకపోయానని నటి లీసారే తన మనసులో మాట చెప్పింది. త్వరలో సొంతగడ్డ అయిన భారత్‌కు రావాలని యోచిస్తున్నట్టు కేన్సర్ వ్యాధి బారినపడి విజయవంతంగా బయటపడిన ఈ 42 ఏళ్ల ఇండో కెనడియన్ ఇటీవల ప్రకటించింది. తన జీవితాన్ని, సినిమా కెరీర్‌ను మార్చేసిన తళుకుల నగరానికి రాబోతున్నానంది. ‘నేనొక దేశదిమ్మరిని. ప్రకృతిపరంగా వివిధ రకాల అనుభవాలను నా మనసు కోరుకుంటుంది. చిన్నతనంలో ఒకేచోట ఉండేదాన్ని. ఇప్పుడు జీవితంతోపాటు పరిశ్రమ కూడా మారిపోయింది. నాకు ఇక్కడ ఎన్నో ప్రాజెక్టులు దక్కబోతున్నాయి. వెనక్కివచ్చేయాలనే ఆలోచన ఏనాటినుంచో ఉంది. అయితే ఎప్పుడు రావాలనేదే ఓ ప్రశ్నగా మిగిలిపోయింది’ అని అంది. వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాల వల్లనే టొరంటోనుంచి ముంబైకి రావాలనుకుంటున్నానని ఈ రెండు నగరాల మధ్య తరచూ రాకపోకలు సాగించే ఈ ‘వాటర్’ నటి తెలిపింది. ‘నన్ను తీర్చిదిద్దిన నగరంలో మరింత సమయం గడపాల్సిన అవసరం ఉందనే విషయాన్ని గుర్తించాను. ఏ దేశంలో ఉన్నప్పటికీ నా మనసులో కొంత భాగం భారతదేశంలోనే ఉండేది. నా జీవితానికి సంబంధించి మరికొంత స్పష్టత రావాల్సి ఉంది. నా జీవితానికి ఏది వర్తిస్తుంది ? ఏది వర్చించదు? అనే విషయం నాకు బాగా తెలుసు. నాకు నా స్నేహితులు ఎంతో ముఖ్యం. ఇందుకు వ్యక్తిగతమైన కారణాలతోపాటు వృత్తిపరమైన కారణాలు కూడా ఉన్నాయి’ అని అంది. కాగా లీసారే కాశ్మీర్ కథాంశంగా రూపొందబోతున్న సినిమాకు సంతకాలు చేసింది. ఈ సినిమాలో సంజయ్సూరి సరసన నటించనుంది.