రెహమాన్
సరికొత్త ట్యూన్స్, బీట్స్‌తో ఇన్ని సంవత్సరాలు సంగీత ప్రియుల్ని అలరించిన రెహమాన్ నిర్మాతగా, కథారచయితగా మారనున్న విషయం తెలిసిందే. ‘99 సాంగ్స్’ అనే చిత్రాన్ని నిర్మించడంతో పాటు ఈ సినిమా కథను రెహమానే అందించడం విశేషం. ఈ సినిమా జూన్ 21న రిలీజ్‌కు రెడీ అయింది. ఎహాన్ భట్, ఎడిల్సీ వర్గాస్ జంటగా మనీషా కొయిరాల, లిసా రే ముఖ్య పాత్రల్లో విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు.
ఈ సినిమా విశేషాల గురించి రెహమాన్ మాట్లాడుతూ – ‘‘నిర్మాతగా, కథా రచయితగా నా తొలి చిత్రం జూన్ 21న రిలీజ్ అవుతుందని ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ‘99 సాంగ్స్’ సినిమా స్వచ్ఛమైన ప్రేమకథతో తీసినది. సంగీతమే ఈ సినిమాకు సోల్. జియో స్టూడియోస్‌తో కలసి ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నాం. ఎప్పటిలానే మీ ప్రేమ, అభిమానం, సపోర్ట్‌కు చాలా థ్యాంక్స్’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment