నా అనుభవాలతో పుస్తకం రాస్తున్నా! | Lisa Ray goes on another shopping spree in Jaipur | Sakshi
Sakshi News home page

నా అనుభవాలతో పుస్తకం రాస్తున్నా!

Published Tue, Jul 28 2015 10:37 PM | Last Updated on Sun, Sep 3 2017 6:20 AM

నా అనుభవాలతో పుస్తకం రాస్తున్నా!

నా అనుభవాలతో పుస్తకం రాస్తున్నా!

‘టక్కరిదొంగ’ చిత్రంలో నటించిన లిసారే గుర్తున్నారా? ఆ చిత్రంలో ‘చుక్కల్లో చంద్రుడే చిన్నోడు...’ అంటూ మహేశ్‌బాబుతో ఆమె చేసిన సందడిని అంత సులువుగా మర్చిపోలేం. ఆ తర్వాత తెలుగులో లిసా రే సినిమాలు చేయలేదు. పలు హిందీ చిత్రాల్లో నటించిన ఆమె పెళ్లి చేసుకుని, కొన్నాళ్లు వెండితెరకు దూరమయ్యారు. దురదృష్టవశాత్తు ఆరేళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడ్డారు. చివరకి మృత్యువుతో పోరాడి గెలిచారు. ఇప్పుడామె క్యాన్సర్ గురించి అందరిలోనూ అవగాహన కల్పించాలనుకుంటున్నారు.
 
  దీని గురించి లిసా రే మాట్లాడుతూ -‘‘క్యాన్సర్ నా జీవితాన్ని కొత్త దారిలో వెళ్లేలా చేసింది. అలాగే జీవితం పట్ల ఆశావహ దృక్పథాన్ని ఏర్పరచింది. ఈ వ్యాధి బారిన పడడం, చికిత్స చేయించుకున్నప్పటి రోజులు, మామూలు మనిషిగా బయటపడ్డ వైనం.. ఈ అనుభవాలతో ఓ పుస్తకం రాస్తున్నా. ఈ పుస్తకం పలువురికి ఆదర్శంగా నిలవాలన్నది నా కోరిక. క్యాన్సర్ అంటే ఇక చనిపోవాల్సిందేననే భ్రమను పోగొట్టి, ధైర్యంగా చికిత్స చేయించుకోవాలనే ఆత్మవిశ్వాసం కల్పించాలన్నది నా ఆకాంక్ష’’ అని చెప్పారామె.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement