కొంత విరామం తర్వాత! | Lisa Ray back to work with 'Ishq Forever' | Sakshi
Sakshi News home page

కొంత విరామం తర్వాత!

Published Sun, Apr 5 2015 10:22 PM | Last Updated on Sat, Sep 2 2017 11:54 PM

కొంత విరామం తర్వాత!

కొంత విరామం తర్వాత!

మహేష్‌బాబు నటించిన ‘టక్కరి దొంగ’ చిత్రంలో నటించిన మిల్క్ బ్యూటీ లిసా రే గుర్తుండే ఉంటారు. ఈ కెనడా భామ తర్వాత కొన్ని హిందీ చిత్రాలు చేయడంతో పాటు ఒకటీ రెండూ తమిళ, కన్నడ చిత్రాలు కూడా చేశారు. ఎక్కువగా కెనడా చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ దాదాపు ఆరేళ్ల క్రితం తనకు కేన్సర్ సోకిందనే విషయం తెలుసుకున్నారు. ఓ ఏడాది పాటు నిర్భయంగా చికిత్స చేయించుకుని, సంపూర్ణ ఆరోగ్యవంతురాలయ్యారు. మూడేళ్ల క్రితం జేసన్ డెనీ అనే వ్యక్తిని పెళ్లాడారు లిసా. ఆమె వెండితెరపై కనిపించి, నాలుగేళ్లు పైనే అయ్యింది. కొంత విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ నటన కొనసాగించాలనుకుంటున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆమె అంగీకరించిన హిందీ చిత్రం ‘ఇష్క్ ఫర్ ఎవర్’. ఈ నెలాఖరున ఈ చిత్రం ఆరంభం కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement