మహేష్ సినిమా కోసం ఇద్దరు దర్శకులు | Mahesh babu next film with sekhar kammula, jayanth c paranji | Sakshi
Sakshi News home page

మహేష్ సినిమా కోసం ఇద్దరు దర్శకులు

Published Sat, Jan 30 2016 11:26 AM | Last Updated on Sun, Sep 3 2017 4:38 PM

మహేష్ సినిమా కోసం ఇద్దరు దర్శకులు

మహేష్ సినిమా కోసం ఇద్దరు దర్శకులు

టాలీవుడ్లో కేవలం తన స్టార్ ఇమేజ్తో వంద కోట్ల వసూళ్లను రాబట్టగలిగిన హీరోగా ప్రూవ్ చేసుకున్న స్టార్ మహేష్ బాబు. శ్రీమంతుడు సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్లు సృష్టించిన మహేష్ వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం చేస్తోన్న బ్రహ్మోత్సవం ఇప్పటికే పూర్తి కావస్తుండటంతో తరువాత చేయబోయే సినిమాలను లైన్లో పెడుతున్నాడు. బ్రహ్మోత్సవం పూర్తి కాకముందే మరో రెండు సినిమాలను ఫైనల్ చేశాడు. త్వరలోనే తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రానికి రెడీ అవుతున్నాడు మహేష్.

ఇప్పటికే కథా కథనాలు కూడా రెడీ అయిన ఈ సినిమా,  ఏప్రిల్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా పూర్తవ్వగానే మరో ఆసక్తికర చిత్రాన్ని పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు. కాఫీ లాంటి చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో నటించడానికి ఓకె చెప్పాడు. ఈ సినిమాను, మహేష్ బాబుతో టక్కరి దొంగ సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ జయంత్ సి పరాన్జీ నిర్మించనున్నాడు. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా మహేష్ నెక్ట్స్ సినిమా శేఖర్ కమ్ములతోనే అన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఒకే సినిమా కోసం ఇద్దరు దర్శకులు కలిసి పనిచేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement