లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్ంలో తెరకెక్కుతున్న చిత్రం ఇండియన్ 2. చాలా కాలంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా భారీ హిట్ సాధించిన 'భారతీయుడు'కు సీక్వెల్‌గా రాబోతుంది. పలు అనివార్య కారణాలతో గత కొన్ని నెలలుగా సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతూ వచ్చింది. కొన్నిసార్లు వివాదాల్లో కూడా చిక్కుకున్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఈ సినిమాకు మరో ఆటంకం ఏర్పడిందని ప్రచారం జరుగుతోంది. ఈ భారీ చిత్రం నుంచి హీరోయిన్ కాజల్ అగర్వాల్ తప్పుకుందని టాక్. అందుకు కారణం ఆమె ప్రెగ్నెంట్ కావడమే అని కోలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే కాజల్ స్థానంలో వర్షం బ్యూటీ త్రిషను తీసుకోనున్నట్లు కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. అన్ని వివాదాలు సద్దుమణిగి తిరిగి డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుందనంగా ఈ ఆసక్తికర విషయం బయటకొచ్చింది.
అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ఐశ్వర్య రాజేష్, సిద్ధార్థ్, వివేక్ తదితరులు నటిస్తున‍్నారు. భారతీయుడు సినిమా పలు రికార్డులను సొంత చేసుకోవడంతో ఈ సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
చదవండి: భర్త కోసం అలాంటి కండీషన్లు పెడుతున్న కాజల్
Comments
Please login to add a commentAdd a comment