2 కోట్ల సెట్‌... 2 నిమిషాలే! | 2 Crores spent by Shankar for a 2 minute set in Indian 2 | Sakshi
Sakshi News home page

2 కోట్ల సెట్‌... 2 నిమిషాలే!

Published Thu, Jan 3 2019 4:01 AM | Last Updated on Thu, Aug 8 2019 11:13 AM

2 Crores spent by Shankar for a 2 minute set in Indian 2 - Sakshi

కమల్‌హాసన్‌, హృతిక్‌ రోషన్‌

‘2.0’ రిలీజ్‌ టైమ్‌కే దర్శకుడు శంకర్‌ తన నెక్ట్స్‌ చిత్రం ‘ఇండియన్‌ 2’ సినిమా పనులతో బిజీ అయిపోయారు. గతేడాది డిసెంబర్‌ 14న ఈ చిత్రం షూటింగ్‌ స్టార్ట్‌ చేద్దాం అని ప్లాన్‌ కూడా  చేశారు. కానీ ‘భారతీయుడు’ రెగ్యులర్‌ షూటింగ్‌ కొంచెం ఆలస్యంగా ప్రారంభం కానుందట. కమల్‌హాసన్‌ , దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో 1996 వచ్చిన చిత్రం ‘భారతీయుడు’. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌ రూపొందిస్తున్నారు. ఈ సీక్వెల్‌లో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్‌ జనవరి 18న మొదలు కానుందని కోలీవుడ్‌ టాక్‌.

ఈ సినిమా కోసం కాజల్‌ అగర్వాల్‌ కేరళ మార్షల్‌ ఆర్ట్‌ కలరి పయ్యట్టు నేర్చుకోనున్నారు. కమల్‌ కనిపించనున్న పాత్రల్లో తాత పాత్ర ఒకటి. దీని కోసం కమల్‌హాసన్‌ బరువు తగ్గారు కూడా. ఈ సినిమా బడ్జెట్‌ విషయంలో అస్సలు కాంప్రమైజ్‌ కాకూడదని దర్శకుడు శంకర్‌ ఫిక్స్‌ అయినట్టున్నారు. ఈ సినిమాలో ఓ సెట్‌ కోసం సుమారు 2 కోట్లు వరకూ వెచ్చించారట. గోల్డ్‌ సెట్‌ అని పిలిచే దీని తయారీకు కావాల్సిన వస్తువులను ప్రత్యేకంగా చైనా నుంచి తెప్పించారు.

2 కోట్లతో వేయించిన ఈ సెట్‌ సినిమాలో 2 నిమిషాలు కూడా కనిపించదట. సెట్స్‌ వర్క్‌తో పాటు నేచురల్‌ లొకేషన్స్‌లోనూ పలు సీన్స్‌ ప్లాన్‌ చేశారు. ముఖ్యంగా కీలక సన్నివేశాలను ఉక్రెయిన్‌ దేశంలో షూట్‌ చేయనున్నారట. ఈ సినిమాలో దుల్కర్‌ సల్మాన్, శింబు కూడా కీలక పాత్రలు పోషించే అవకాశం ఉందని టాక్‌ నడుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి అనిరు«ద్‌ సంగీత దర్శకుడు. 2020లో రిలీజ్‌ కానుంది.

హృతిక్‌తో శంకర్‌?
‘భారతీయుడు 2’ తర్వాత దర్శకుడు శంకర్‌ చేయబోయే ప్రాజెక్ట్‌లో హీరోగా హృతిక్‌ రోషన్‌ కనిపించనున్నారని బాలీవుడ్‌ టాక్‌. సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌లో ఈ చిత్రకథ ఉండబోతోందట. ఆల్రెడీ శంకర్‌ వినిపించిన ఐడియా హృతిక్‌కు నచ్చిందని, ‘భారతీయుడు 2’ తర్వాత ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుందని భోగట్టా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement