ఆంటీనయ్యాను | priyamani says aunty | Sakshi
Sakshi News home page

ఆంటీనయ్యాను

Published Thu, Apr 17 2014 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 AM

ఆంటీనయ్యాను

ఆంటీనయ్యాను

నేనిప్పుడు ఆంటీని అయ్యాను అంటూ తెగ సంబరపడిపోతున్నారు నటి ప్రియమణి. సాధారణంగా హీరోయిన్లు ఏ విషయం గురించి ఓపెన్‌గా మాట్లాడినా తమ వయసు గురించి మాత్రం నోరు మెదపరు అన్నది ఒకప్పటి మాట. శ్రుతిహాసన్, శ్రీయ వంటి వారు తమ వయసును దాచుకునే ప్రయత్నం చేయడం లేదు. అదే విధంగా ప్రియమణి కూడా ఏ విషయాన్ని అయినా నిర్భయంగా చెబుతారు. చక్కని అభినయ తార అయిన ఈమె ఎందుకనో రెండు మూడేళ్లుగా తమిళ తెరకు దూరం అయ్యారు. అయితే కన్నడం, మలయాళం, తెలుగు భాషల్లో నటిస్తూ బిజీగానే ఉన్నారు. ప్రస్తుతం కన్నడంలో అంబరీష్ అనే చిత్రంలో నటిస్తున్న ప్రియమణి తన ట్విట్టర్‌లో పేర్కొంటూ తాను ఆంటీని అయ్యానని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ప్రియమణి సోదరుడు విశాక్ దేవ్, ప్రార్థన దంపతులకు ఇటీవలే పండంటి ఆడబిడ్డ జన్మించిందట. దీంతో షూటింగ్‌కు కూడా విరామం ఇచ్చి ప్రియమణి తన సోదరుడి కూతురిని లాలిస్తూ గడిపేస్తున్నారట. దీంతో ఆమె తల్లి తన కూతురికి పెళ్లి ఆశ కలిగిందంటున్నారట. దీనిపై ప్రియమణి మాట్లాడుతూ, వయసు పెరుగుతుందన్నది నిజమేనని, దాని కోసం వివాహం చేసుకోవాలని లేదుగా అన్నారు. నిజం చెప్పాలంటే వివాహం చేసుకోవాలనే ఆలోచన తనకింత వరకు రాలేదన్నారు. అలాంటి ఆశ కలిగినప్పుడు ఆ విషయం గురించి ఆలోచిస్తానని అంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement