చిత్తూరు, కురబలకోట: న్యూరో పైబ్రోమా అనే వ్యాధితో బాధపడుతూ ఇన్నాళ్లు మృత్యువుతో పోరాడిన చిన్నారి శృతి హాసన్ ఓడిపోయింది. బిడ్డను రక్షించుకునేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగులుస్తూ ప్రాణాలు విడిచింది. వివరాలు.. మండలంలోని తెట్టు గ్రామం పుల్లగూరవాండ్లపల్లెకు చెందిన సునీత, రెడ్డెప్పల కుమార్తె శృతిహాసన్ మూడేళ్ల వయసు నుంచి న్యూరోపైబ్రోమాతో బాధపడుతోంది.
వ్యాధితో నరకయాతన పడుతు న్న చిన్నారికి తల్లిదండ్రులు తిరుపతి, బెంగళూరుల్లోని పలు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించారు. అయినా ఫలితం కానరాలేదు. ఈ నేపథ్యంలో బిడ్డ కారుణ్యమరణానికి అనుమతి ఇవ్వాలని కోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో అయినా ప్రభుత్వం ఆదుకుని చికిత్సలు చేయిస్తుందని వారు ఆశలు పెట్టుకున్నారు. అయినా స్పందన కానరాలేదు. ఈ నేపథ్యంలో ఆస్పత్రులలో చికిత్స పొంది ప్రస్తుతం ఇంట్లో ఉన్న చిన్నారి ఆదివారం ప్రాణాలు విడించింది. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.
శృతిహాసన్ మృతదేహం
‘కారుణ్య’ చిన్నారి శృతిహాసన్ మృతి
Published Mon, Oct 2 2017 5:54 PM | Last Updated on Mon, Aug 13 2018 3:11 PM
Advertisement