
కొత్త విషయం నేర్చుకోవాలి!
‘‘జీవితంలో మనకు చాలామంది వ్యక్తులు తారసపడుతూ ఉంటారు. అందరి దగ్గరి నుంచీ అన్నీ నేర్చుకోలేం. అయితే, మనం ఎలా ఉంటే బాగుంటుంది, మనలోని కొత్తదనాన్ని ఎలా బయటకు తీసుకురావాలి...
‘‘జీవితంలో మనకు చాలామంది వ్యక్తులు తారసపడుతూ ఉంటారు. అందరి దగ్గరి నుంచీ అన్నీ నేర్చుకోలేం. అయితే, మనం ఎలా ఉంటే బాగుంటుంది, మనలోని కొత్తదనాన్ని ఎలా బయటకు తీసుకురావాలి అనే విషయాలను మాత్రం కొందరి మాట తీరు, నడక నుంచి నేర్చుకోవచ్చు.
జీవితంలో ఇలా ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి. అలా మనకు తెలియకుండానే మనలోని కొత్త వ్యక్తిని ఆవిష్కరించుకోవచ్చు. అందులోనే పరిపూర్ణమైన ఆనందం ఉంటుందని నా అభిప్రాయం. ’’
- శ్రుతీహాసన్