
నటిగా, గాయనిగా దక్షిణాదిలోనే కాక బాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శృతీహాసన్. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ శృతీ తన వృత్తిగత, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇటీవల శృతీ ఇన్‌స్టాగ్రామ్‌లో 14 మిలియన్స్ (కోటీ నలభై లక్షలు) ఫాలోయర్స్‌ని సంపాదించుకున్నారు. తాజాగా శృతీ అండర్ వాటర్ ఫొటో షూట్‌కు సంబంధించిన త్రోబ్యాక్(పాత) ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘నేను ఎక్కడైనా డాన్స్ చేయగలను. నేను కలగన్న ప్రదేశానికి వెళ్లగలను’ అని ఆమె ఫొటోలకు కామెంట్ జతచేశారు. ఆమె ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో శృతీహాసన్ ఎరుపు రంగు దుస్తుల్లో చేతికి బ్రాస్‌లెట్ ధరించి కనిపిస్తున్నారు. ఇక నీటి లోపల తాను డాన్స్ చేస్తూ పలు పోజులతో ఫొటో షూట్‌ను ఎంజాయ్ చేసినట్లు పేర్కొంది. (కొత్త పుస్తకం చదువుతున్న మహేశ్!)
ఇక సినిమా విషయాలకు వస్తే.. రవితేజ సరసన ‘క్రాక్’ సినిమాలో శృతీహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా.. ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఇక లాక్‌డౌన్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. (సినిమాలపై దావూద్ ప్రభావం)
Comments
Please login to add a commentAdd a comment