'పులి' నిర్మాతలపై శ్రీదేవి కేసు | sridevi files a complaint on puli producers | Sakshi
Sakshi News home page

'పులి' నిర్మాతలపై శ్రీదేవి కేసు

Published Sun, Nov 8 2015 11:50 AM | Last Updated on Sun, Sep 3 2017 12:14 PM

'పులి' నిర్మాతలపై శ్రీదేవి కేసు

'పులి' నిర్మాతలపై శ్రీదేవి కేసు

చాలా కాలం తరువాత పులి సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి, ఆ సినిమా మొదలైన దగ్గర నుంచి ఏదో ఒక విధంగా వార్తల్లో కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా ఆ సినిమాలో శ్రీదేవి పాత్ర, ఆమె గెటప్, ఇండస్ట్రీ వర్గాలతో పాటు సినీ అభిమానులను కూడా ఆకట్టుకున్నాయి.

అయితే శ్రీదేవి వెండితెర మీద కనిపించిన ఆనందం అభిమానులకు ఎక్కువ రోజులు మిగల్లేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన పులి బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ మూట కట్టుకుంది. దీంతో భారీగా ఉంటుందనుకున్న శ్రీదేవి రీ ఎంట్రీ అతిలోక సుందరి అభిమానులను నిరాశపరిచింది. సినిమా షూటింగ్ సమయంలో పులి యూనిట్ తో శ్రీదేవి కి వివాదాలున్నట్టుగా చాలా వార్తలు వినిపించినా వాటిని కొట్టి పారేశారు.

తాజాగా సినిమా రిలీజ్ అయిన ఇన్ని రోజుల తరువాత మరోసారి ఈ వివాదాలు తెర మీదకు వచ్చాయి. తనకు రావాల్సిన రెమ్యునరేషన్ మొత్తం ఇవ్వలేదంటూ పులి నిర్మాతలపై శ్రీదేవి ముంబై ఫిలిం ఛాంబర్ లో కంప్లయింట్ చేసింది. త్వరలోనే ఈ కంప్లయింట్ ను చెన్నై చాంబర్ కు పంపేందుకు సిద్దమవుతున్నారు ముంబై వర్గాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement