పులి తమిళ్ గ్లాడియేటరా? | Vijay Birthday Celebration: Celebs Wish 'Puli' Star Ilayathalapathy | Sakshi
Sakshi News home page

పులి తమిళ్ గ్లాడియేటరా?

Published Tue, Jun 23 2015 2:48 AM | Last Updated on Sun, Sep 3 2017 4:11 AM

పులి తమిళ్ గ్లాడియేటరా?

పులి తమిళ్ గ్లాడియేటరా?

పులి చిత్రం తమిళ గ్లాడియేటరా? ప్రస్తు తం కోలీవుడ్‌లో సాగుతున్న హాట్ టాఫిక్ ఇదే. ఇళయదళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం పులి. హన్సిక, శ్రుతిహాసన్ కథానాయికలుగా న టిస్తున్న ఈ భారీ సోషియో ఫాంటసీ చిత్రంలో అతిలోక సుందరి శ్రీదేవి మహారాణి పాత్రను పోషిస్తున్నారు. ఈమె దాదాపు రెండు దశాబ్దాల తరువాత తమిళంలో నటిస్తున్న చిత్రం ఇదే. కా గా కన్నడ చిత్రపరిశ్రమలో సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న సుదీప్ ఈ చిత్రంలో ముఖ్య భూమికను పోషించడం విశేషం.
 
 శింబుదేవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పిటీ సెల్వకుమార్ నిర్మిస్తున్నారు. షూటింట్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చిత్రం ఫస్ట్ లుక్ పోస్ట్‌ర్లు ఇటీవల విడుదలయ్యాయి. కాగా చిత్ర టీజర్‌ను విజయ్ పు ట్టిన రోజు సందర్భంగా విడదల చేయాలని చిత్ర దర్శకనిర్మాతలు భావించారు. ముందుగానే టీజర్ లీక్ అయ్యి కలకలం పుట్టించింది. వర్జినల్ టీజర్‌ను కూడా విడుదల చేయక తప్పలేదు. ఏదేమయినా పు లి టీజర్‌కు ఇటు చిత్రపరిశ్రమ నుం చి అటు విజయ్ అభిమానుల నుంచి అనూహ్య స్పం దన వస్తోంది.
 
 ఇదిలా ఉంటే పులి చిత్ర టీజర్‌లో విజయ్ కత్తి చేతపట్టి వీర విహారంచేసే దృశ్యాలు, శ్రీదేవి పట్టపురాణి గెటప్‌లో హుందాగా నడిచొచ్చే సన్నివేశం, మధ్య మధ్యలో శ్రుతిహాసన్, హన్సిక అందమైన నగుమోముల దృశ్యాలు చిత్రంపై ఆసక్తిని, అంచనాలను పెంచేలా ఉన్నాయి. కాగా ఈ చిత్రాన్ని నిర్మాతలు హాలీవుడ్ చిత్రం గ్లాడియేటర్‌తో పోల్చడం విశేషం. 2000 సంవత్సర ంలో తెరపైకొచ్చిన గ్లాడియేటర్ చిత్రం ఎప్పటికీ సంచలనమే. పులి చిత్రంలోనూ విజయ్ పోరాట దృశ్యాలు ఆ తరహాలో ఉంటాయంటున్నారు చిత్ర నిర్మాతలు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement