'పులి' ట్రైలర్ వచ్చేసింది... | Ilayathalapathy Vijay's 'Puli' does a 'Game of Thrones' in trailer | Sakshi
Sakshi News home page

'పులి' ట్రైలర్ వచ్చేసింది...

Published Thu, Aug 20 2015 12:30 PM | Last Updated on Sun, Sep 3 2017 7:48 AM

'పులి' ట్రైలర్ వచ్చేసింది...

'పులి' ట్రైలర్ వచ్చేసింది...

చెన్నై: అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'పులి' చిత్ర ట్రైలర్ను గురువారం విడుదల చేశారు.  ఇటీవల విడుదలయిన ఈ సినిమా  ఆడియోకి శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తుంది. టీజర్, ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విజయ్ హీరోగా  ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ ఎంటర్‌టైనర్గా తెరకెక్కిన పులి చిత్రంలోని 114 సెకండ్ల నిడివి గల ట్రైలర్ను యూట్యూబ్లో చిత్రబృందం ఉంచింది. హాలీవుడ్ చిత్రం మెల్ఫిసెంట్లో నటించిన ఏంజెలినా జూలీ పాత్ర తరహాలో పులిలో అతిలోక సుందరి శ్రీదేవి కనిపించింది.

ఇళయదళపతి విజయ్ నటించిన చిత్రాలన్నింటి కంటే పులి కొత్తగా ఉంటుందని ఆ చిత్ర నిర్మాత పి.టి.సెల్వకుమార్ ఇదివరకే చెప్పిన విషయం తెలిసిందే. ఎస్.కె.స్టూడియో పతాకంపై ఆయన నిర్మిస్తున్న అత్యంత భారీ చిత్రం పులి. విజయ్ సరసన హన్సిక, శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీదేవి రాణిగా ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. కన్నడ ప్రముఖ హీరో సుదీప్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని శింబుదేవన్ నిర్వహిస్తున్నారు.  పులికి సంగీత బాణీలను దేవిశ్రీ ప్రసాద్ అందించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement