విజయ్ అభిమానులకు దీపావళి గిఫ్ట్ | vijay 59 first look teaser launch on diwali | Sakshi
Sakshi News home page

విజయ్ అభిమానులకు దీపావళి గిఫ్ట్

Published Wed, Nov 4 2015 2:04 PM | Last Updated on Sun, Sep 3 2017 12:00 PM

విజయ్ అభిమానులకు దీపావళి గిఫ్ట్

విజయ్ అభిమానులకు దీపావళి గిఫ్ట్

పులి సినిమాతో అభిమానులను నిరాశపరిచిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, వీలైనంత త్వరగా తన అభిమానులకు సక్సెస్ ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాడు. తన తదుపరి సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావటం కోసం శరవేగంగా షూటింగ్ చేస్తున్నాడు. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

పులి డిజాస్టర్తో నిరాశలో ఉన్న ఇలయ దళపతి అభిమానులకు దీపావళికి భారీ కానుక ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాడు విజయ్. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన నెక్ట్స్ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్తో పాటు టీజర్ను కూడా రిలీజ్ చేస్తున్నాడు.  ఇప్పటి వరకు విజయ్ 59గా ప్రచారంలో ఉన్న ఈ సినిమా టైటిల్ను కూడా అదే రోజు ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్.

విజయ్ సరసన సమంత, అమీజాక్సన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. సీనియర్ డైరెక్టర్ మహేంద్రన్తో పాటు, సత్యారాజ్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ వరకు షూటింగ్ పూర్తి చేసి 2016 సమ్మర్లో సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement