లుక్... ఇలా ఉంటుంది! | Vijay looks charming and charismatic in the official poster of 'Puli' | Sakshi
Sakshi News home page

లుక్... ఇలా ఉంటుంది!

Published Mon, Jun 22 2015 12:30 AM | Last Updated on Sun, Sep 3 2017 4:08 AM

లుక్... ఇలా ఉంటుంది!

లుక్... ఇలా ఉంటుంది!

తమిళ పరిశ్రమలో రజనీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్ అని అక్కడివారు చెబుతుంటారు. విజయాల శాతం ఎక్కువ అపజయాల శాతం తక్కువ అన్నట్లుగా ఉంటుంది విజయ్ కెరీర్. ప్రస్తుతం విజయ్ హీరోగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న చిత్రం ‘పులి’. ఎస్.కె.టి. స్టూడియో పతాకంపై శింబుదేవన్ దర్శకత్వంలో పీటీ సెల్వకుమార్, శిబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ శ్రీదేవి ఈ చిత్రానికే పచ్చజెండా ఊపారు. ఈ చిత్రకథ, పాత్ర ఆమెకు అంతగా నచ్చాయి. ఇందులో శ్రుతీహాసన్, హన్సిక కథానాయికలుగా నటిస్తున్నారు. ఇది యాక్షన్ అడ్వంచర్ ఫ్యాంటసీ మూవీ. ఈ చిత్రంలో విజయ్ లుక్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఆయన అభిమానులు ఉవ్విళ్లూరారు. ‘నా లుక్ ఇలా ఉంటుంది’ అంటూ ట్విట్టర్‌లో ఫస్ట్ లుక్‌ని పోస్ట్ చేశారు విజయ్. సోమవారం విజయ్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఫస్ట్ లుక్‌ని, టీజర్‌ను విడుదల చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement