'పులి'ని ఆకాశానికి ఎత్తేశాడు.. | super star rajanikanth congratulated puli team | Sakshi
Sakshi News home page

'పులి'ని ఆకాశానికి ఎత్తేశాడు..

Published Tue, Oct 6 2015 12:14 PM | Last Updated on Thu, Sep 12 2019 10:40 AM

'పులి'ని ఆకాశానికి ఎత్తేశాడు.. - Sakshi

'పులి'ని ఆకాశానికి ఎత్తేశాడు..

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ 'పులి' సినిమాను ఆకాశానికి ఎత్తేశాడు. త్వరలో కపాలి సినిమా షూటింగ్ కోసం మలేషియా వెళ్లనున్న రజనీ.. విజయ్ హీరోగా నటించిన  పులి సినిమా స్పెషల్ షో చూశారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర యూనిట్ కు తన అభినందనలు తెలియజేశాడు.

పులి సినిమా అద్భుతంగా ఉందన్న రజనీ, భారీ సెట్స్ తో పాటు హాలీవుడ్ స్ధాయి గ్రాఫిక్స్తో తెరకెక్కిన పులి పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ను అలరిస్తుందన్నారు. ఇలాంటి కామెడీ ఫాంటసీలో నటించి సాహసం చేసిన  విజయ్ ని ప్రత్యేకంగా అభినందించారు.

విజయ్ హీరోగా చింబుదేవన్ దర్శకత్వంలో తెరకెక్కిన పులి, గురువారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. నెగెటివ్ టాక్తో స్టార్ట్ అయినా కలెక్షన్ల పరంగా మాత్రం సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తుంది ఈ సినిమా. ఇప్పటికే 62 కోట్లకు పైగా వసూళు చేసిన పులి సౌత్ ఇండియాలో సెకండ్ హైయస్ట్ గ్రాసర్గా రికార్డ్ సృష్టించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement