
పులి కోసం పాట
శ్రుతీహాసన్ బహుముఖ ప్రజ్ఞాశాలి. పాటలు పాడతారు, కవితలు రాస్తారు. అన్నింటికీ మించి ఆమె అద్భుతమైన నటి. సంగీతం మీద ఉన్న మక్కువతో తాను నటిస్తున్న సినిమాల్లోని పాటలు పాడుతుంటారు శ్రుతి. ఆ మధ్య ‘ఆగడు’లో ‘జంక్షన్లో.. జంక్షన్లో..’ పాట పాడారు. అలాగే, హిందీ చిత్రం ‘తేవర్’ కోసం రెండు పాటలు పాడారు. తాజాగా, విజయ్ సరసన కథానాయికగా నటిస్తున్న ‘పులి’ చిత్రం కోసం శ్రుతి ఓ పాట పాడారు. ఆమెతో కలిసి విజయ్ కూడా ఈ పాట పాడటం విశేషం. రెండేళ్ల క్రితం ‘తుపాకీ’ కోసం ఓ పాట పాడిన విజయ్, మళ్లీ పాడటం ఇప్పుడే. చిత్రసంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఆధ్వర్యంలో ఈ తాజా పాట రికార్డ్ అయ్యింది.