రజనీ సినిమా టైటిల్‌తో మరోసారి విశాల్ | Visal with Rajini cinema Title | Sakshi
Sakshi News home page

రజనీ సినిమా టైటిల్‌తో మరోసారి విశాల్

Published Thu, Mar 26 2015 11:08 PM | Last Updated on Sat, Sep 2 2017 11:26 PM

విశాల్

విశాల్

తమిళసినిమా: నటుడు విశాల్ మరోసారి రజనీకాంత్ టైటిల్‌తో తెరపైకి రానున్నారు. పాండియనాడు, శివప్పు మనిదన్, పూజై చిత్రాలతో వరుసగా హ్యాట్రిక్ సాధించిన విశాల్ తాజాగా సుశీంద్రన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరి కాంబినేషన్‌లో ఇంతకుముందు వచ్చిన పాండియనాడు చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత నటించిన చిత్రం నాన్ శివపుప మనిదన్ చిత్రంలో నటించారు. ఇదే టైటిల్‌తో ఇంతకుముందు రజనీకాంత్ నటించారన్నది గమనార్హం.

కాగా తాజాగా నటిస్తున్న చిత్రానికి 1983లో రజనీకాంత్ నటించిన  'పులి' టైటిల్‌ను నిర్ణయించడం విశేషం. ఈ వేందర్ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విశాల్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్‌ను ఏప్రిల్ మూడు నుంచి నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేల్‌రాజా ఛాయాగ్రహణను, డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement