తమిళ పులిలో 'శ్రీదేవి' Sridevi returns to Tamil cinema with 'Puli' | Sakshi
Sakshi News home page

తమిళ పులిలో శ్రీదేవి'

Published Sun, Jan 4 2015 2:19 PM

తమిళ పులిలో 'శ్రీదేవి'

ముంబై : పులి సినిమా షూటింగ్ని మంచి ఎంజాయి చేస్తున్నానని ప్రముఖ నటి శ్రీదేవి తెలిపారు. చిత్రంలోని నటీ నటులు, సాంకేతిక బృందంతో కలసి పని చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ మేరకు ఆదివారం శ్రీదేవి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్ హాన్సికాకు తల్లిగా శ్రీదేవి నటిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ శ్రీదేవి తమిళ చిత్ర సీమలో అడుగుపెట్టారు.  ఈ చిత్రంలో విజయ్ హీరోగా నటిస్తున్నారు.

అలాగే శృతీ హాసన్, సుదీప్ కూడా నటిస్తున్నారు. దాదాపు నాలుగేళ్ల వయస్సులో బాలనటిగా చిత్రసీమలోకి అడుగు పెట్టిన శ్రీదేవి... తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాలలో నటించారు. ఇంగ్లీషు వింగ్లీషు చిత్రం ద్వారా శ్రీదేవి బాలీవుడ్ లో  సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement