ఈసారి అభిమానుల మధ్య లేనట్లే! | Actor Vijay to skip birthday celebrations this year | Sakshi
Sakshi News home page

ఈసారి అభిమానుల మధ్య లేనట్లే!

Published Mon, Jun 15 2015 11:10 AM | Last Updated on Wed, Apr 3 2019 8:57 PM

ఈసారి అభిమానుల మధ్య లేనట్లే! - Sakshi

ఈసారి అభిమానుల మధ్య లేనట్లే!

చెన్నై: ప్రముఖ తమిళ నటుడు విజయ్ ఈసారి అభిమానుల మధ్య పుట్టిన రోజు వేడుకలకు దూరమయ్యాడు. ప్రస్తుతం ఆయన ఫ్యామిలీతో కలిసి సరదాగా లండన్లో గడుపుతున్నారు. ఈ నెల 26 తర్వాత గాని వచ్చే అవకాశం లేదు. కానీ, ఈ నెల 22నే ఆయన పుట్టిన రోజు. ప్రతి ఏటా అభిమానుల మధ్య పుట్టిన రోజు జరుపుకుంటాడు. ఆ సందర్భంగా పలు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తాడు.

అయితే, ఎప్పటిలాగే తమ అభిమాన నటుడు ఉంటాడని భావించిన ఫ్యాన్స్ అందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. ఒక్కసారిగా ఆయన ఈసారి వేడుకల్లో పాల్గొనడం లేదని, రావడం లేదని తెలియడంతో వారి ఆనందం ఆవిరైంది. తాము నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాలన్నింటిని నిలిపివేశారు. విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన పులి చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement