ఈ ఏడాది దేవర మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న హీరో జూనియర్ ఎన్టీఆర్. కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ యాక్షన్ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషించారు.
అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వార్ 2లో కనిపించనున్నారు. ఆ తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో జతకట్టనున్నారు. ఈ చిత్రాన్ని పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కించనున్నట్లు ఇటీవల నిర్మాత ప్రకటించారు.
అయితే ప్రస్తుతం షూటింగ్‌కు కాస్తా గ్యాప్ దొరకడంతో ఫ్యామిలీతో చిల్ అవుతున్నారు యంగ్ టైగర్. లండన్‌లో తన కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా లండన్‌లోని హైడ్ పార్క్‌లో తన పిల్లలతో కలిసి కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
#JrNTR anna at London with his family...@tarak9999 #prideofindia pic.twitter.com/CEtShHW8r4
— i am Rajesh(NRT)“🐉” (@rajeshntripati) December 28, 2024
Tiger @tarak9999 chilling on the streets of London ♥️🐯#JrNTR #War2 #NTRNeel #Dragon pic.twitter.com/LLxLG5N7zc
— poorna_choudary (@poornachoudary1) December 28, 2024
Comments
Please login to add a commentAdd a comment