శ్రీదేవి లిప్‌లాక్
పులి చిత్రంలో అతిలోక సుందరి శ్రీదేవి లిప్‌లాక్ సన్నివేశాలు చూడవచ్చనే ప్రచారం కోలీవుడ్‌లో జోరందుకుంది. ఇళయదళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం పులి. పలు ప్రత్యేకతలు సంతరించుకున్న ఈ చిత్రం గురించి ఇంతవరకు అధికారికంగా ఒక్క విషయం గురించి కూడా చిత్ర యూనిట్ ప్రకటించలేదు. అయితే అనధికారికంగా మాత్రం రోజుకో అంశం వార్తల్లో ఉంది. పులి సోషియా ఫాంటసీ కథా చిత్రం అని, ఇందులో విజయ్ త్రిపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. అతిలోకసుందరి శ్రీదేవి రాణిగా ప్రముఖ పాత్రలో కనిపించనున్నారు.
ఆమె కూతురు యువరాణిగా హన్సిక, మరో నాయకి శృతిహాసన్ నటిస్తున్నారు. వీరిద్దరూ నాయికల కంటే శ్రీదేవి అధిక పారితోషికం పుచ్చుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆమెకు జంటగా కన్నడ సూపర్‌స్టార్ సుదీప్ రాజుగా నటిస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు వీరిద్దరి మధ్య లిప్‌టు లిప్ చుంభనాల దృశ్యాలు కూడా యూత్‌ను కేక పుట్టిస్తాయనేది తాజాగా సమాచారం. సీనియర్ నటుడు ప్రభు పులి చిత్రంలో కీలక భూమికను పోషిస్తున్నారని తెలిసింది. ఇందులో ఆయన విజయ్‌కు గురువుగా నటిస్తున్నారట. ప్రస్తుతం చిత్రం కేరళలో చిత్రీకరణ జరుపుకుంటోంది. చిత్రానికి శింబుదేవన్ దర్శకుడు.