lip-lock
-
శ్రీదేవి లిప్‌లాక్
పులి చిత్రంలో అతిలోక సుందరి శ్రీదేవి లిప్‌లాక్ సన్నివేశాలు చూడవచ్చనే ప్రచారం కోలీవుడ్‌లో జోరందుకుంది. ఇళయదళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం పులి. పలు ప్రత్యేకతలు సంతరించుకున్న ఈ చిత్రం గురించి ఇంతవరకు అధికారికంగా ఒక్క విషయం గురించి కూడా చిత్ర యూనిట్ ప్రకటించలేదు. అయితే అనధికారికంగా మాత్రం రోజుకో అంశం వార్తల్లో ఉంది. పులి సోషియా ఫాంటసీ కథా చిత్రం అని, ఇందులో విజయ్ త్రిపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. అతిలోకసుందరి శ్రీదేవి రాణిగా ప్రముఖ పాత్రలో కనిపించనున్నారు. ఆమె కూతురు యువరాణిగా హన్సిక, మరో నాయకి శృతిహాసన్ నటిస్తున్నారు. వీరిద్దరూ నాయికల కంటే శ్రీదేవి అధిక పారితోషికం పుచ్చుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆమెకు జంటగా కన్నడ సూపర్‌స్టార్ సుదీప్ రాజుగా నటిస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు వీరిద్దరి మధ్య లిప్టు లిప్ చుంభనాల దృశ్యాలు కూడా యూత్‌ను కేక పుట్టిస్తాయనేది తాజాగా సమాచారం. సీనియర్ నటుడు ప్రభు పులి చిత్రంలో కీలక భూమికను పోషిస్తున్నారని తెలిసింది. ఇందులో ఆయన విజయ్‌కు గురువుగా నటిస్తున్నారట. ప్రస్తుతం చిత్రం కేరళలో చిత్రీకరణ జరుపుకుంటోంది. చిత్రానికి శింబుదేవన్ దర్శకుడు. -
ముద్దెవరూ ఇవ్వలేదు!
కన్నడ ముద్దుగుమ్మ హర్షిక పూనాచా, తమిళ హీరో శింభుల లిప్ లాక్ వీడియో ఇప్పుడు అభిమానులను ఊపేస్తోంది. దీనిపై ఇంతకాలం సెలైంట్‌గా ఉన్న ఈ అమ్మడు... ఎట్టకేలకు పెదవి విప్పింది. తనకెవరూ ముద్దు ఇవ్వలేదని ఎంత చెప్పినా వినరేంటని తెగ సీరియస్ అయిపోతోంది. ‘ఇదో పనికిమాలిన ప్రచారం. ఇటీవల మలేిసియాలో జరిగిన అవార్డుల కార్యక్రమం సందర్భంగా ఇలా లిప్ లాకైందని కామెంట్స్ చేస్తున్నారు. ఇది సరైంది కాదు’ అంటూ ట్వీట్ చేసిందీ స్వీట్ సుందరి. -
ఆ ముద్దు నేను పెట్టలేదు
నటుడు శింబుకు ముద్దు పెట్టింది తాను కాదంటోంది కన్నడ నటి హర్షిక. శింబు ఒక నటిని గాఢంగా ముద్దుపెట్టుకుంటున్న సన్నివేశాలు ఇంటర్నెట్లో ప్రచారమై కలకలం సృష్టిస్తున్నాయి. ఒక నక్షత్ర హోటల్లో ఈ చుంబనాల దృశ్యాలను చిత్రీకరించారు. ఇటీవల పలువురు నటీనటులు మలేషియాలో జరిగిన స్టార్‌నైట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పుడు అక్కడి నక్షత్ర హోటల్లో ఈ ముద్దు సన్నివేశాల వీడియోను చిత్రీకరించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సన్నివేశాల్లో శింబుపై ముద్దుల వర్షం కురిపించింది కన్నడ నటి హర్షిక అనే కథనాలు వెలువడుతున్నయి. అయితే ఈ ప్రచారాన్ని నటి హర్షిక ఖండించింది. దీని గురించి ఆమె స్పందిస్తూ వీడియోలో ఉన్న నటిని తాను కాదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో తన పేరును పొరపాటుగా ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. నటుడు శింబు కూడా ఆ వీడియోలో ఉన్న నటుడిని తాను కాదని వెల్లడించారు. -
లిప్‌లాక్‌కు ఓకే
సినీ తారలు పరిస్థితులకనుగుణంగా తమ మైండ్ సెట్‌ను మార్చుకుంటుంటారు. యువ నటి లక్ష్మీమీనన్ కుంకీ చిత్రం ద్వారా తమిళ చిత్ర రంగంలో మెరిసిన ఈ మలయాళీ కుట్టి ఆ చిత్రంలో కొండప్రాంత వాసి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ఆ చిత్రం విజయంతో వరుసగా సుందరపాండియన్, పాండియనాడు, కుట్టిపులి అంటూ వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి. ఈ చిత్రాలు సక్సెస్ కావడంతో లక్ష్మీమీనన్ రాశిగల నటిగా మారిపోయింది. ప్రస్తుతం చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. మొన్నటి వరకు గ్లామర్ పాత్రలే బాడీ లాంగ్వేజ్‌కు నప్పుతాయి అంటూ చెప్పుకుంటూ వచ్చింది. పస్తుతం అన్నీ గ్లామర్ పాత్రల్నే పోషిస్తోంది. కాస్త బొద్దు ముద్దుగా ఉన్న ఈ అమ్మడి బరువు తగ్గే ప్రయత్నం చేయవచ్చుగా అంటే తానిట్టాగే ఉంటాను. ఇష్టం వచ్చినవి లాగించేస్తాను కూడా అంటూ స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఆ తరువాత ఆ మాటలను మూటగట్టి అటకెక్కించి బరువు తగ్గి నాజూగ్గా తయారైంది. తాజా చిత్రం నాన్ సిగప్పు మనిదన్ చిత్ర ప్రచార చిత్రం, పాటలు చూస్తే ఆమె ఎంతగా బరువు తగ్గిందో అర్థం అవుతుంది. అంతేకాదు గ్లామర్‌కు దూరం అంటూనే ఇప్పుడు ఆ తరహా పాత్రలు విజృంభిస్తున్న ఈ బ్యూటీ లిప్‌లాక్‌లకు నో చెప్పింది. తాజాగా నాన్ శివప్పు మనిధన్ చిత్రంలో విశాల్‌తో యమ గాఢంగా పెదవి పెదవి కలిపేసి చుంభనాలు సన్నివేశంలో నటించేసింది. ఈ విషయం గురించి అడిగితే సినిమాల్లో లిప్‌లాక్‌కు తనకెలాంటి సమస్య లేదని బదులిచ్చింది. చిత్రకథకు అవసరం అయితే ముద్దులకు సిద్ధమే నంటోంది. నాన్ శివప్పు మనిగదన్ చిత్రంలో లిప్‌లాక్ ఆవశ్యకత గురించి దర్శకుడు తిరు వివరించడంతో ఓకే చెప్పానని తాను నటనకు బానిసనని చెప్పింది. పాత్రకు న్యాయం చేయడానికి ఎలాగైనా నటిస్తానని లక్ష్మీమీనన్ తన లిప్‌లాక్ చర్యలను సమర్థించుకుంటోంది.