లిప్‌లాక్‌కు ఓకే | “I am ready for lip-lock” : Lakshmi Menon | Sakshi
Sakshi News home page

లిప్‌లాక్‌కు ఓకే

Published Sun, Mar 16 2014 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 4:45 AM

లిప్‌లాక్‌కు ఓకే

లిప్‌లాక్‌కు ఓకే

 సినీ తారలు పరిస్థితులకనుగుణంగా తమ మైండ్ సెట్‌ను మార్చుకుంటుంటారు. యువ నటి లక్ష్మీమీనన్ కుంకీ చిత్రం ద్వారా తమిళ చిత్ర రంగంలో మెరిసిన ఈ మలయాళీ కుట్టి ఆ చిత్రంలో కొండప్రాంత వాసి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ఆ చిత్రం విజయంతో వరుసగా సుందరపాండియన్, పాండియనాడు, కుట్టిపులి అంటూ వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి. ఈ చిత్రాలు సక్సెస్ కావడంతో లక్ష్మీమీనన్ రాశిగల నటిగా మారిపోయింది. ప్రస్తుతం చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. మొన్నటి వరకు గ్లామర్ పాత్రలే బాడీ లాంగ్వేజ్‌కు నప్పుతాయి అంటూ చెప్పుకుంటూ వచ్చింది. 
 
 పస్తుతం అన్నీ గ్లామర్ పాత్రల్నే పోషిస్తోంది. కాస్త బొద్దు ముద్దుగా ఉన్న ఈ అమ్మడి బరువు తగ్గే ప్రయత్నం చేయవచ్చుగా అంటే తానిట్టాగే ఉంటాను. ఇష్టం వచ్చినవి లాగించేస్తాను కూడా అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చేసింది. ఆ తరువాత ఆ మాటలను మూటగట్టి అటకెక్కించి బరువు తగ్గి నాజూగ్గా తయారైంది. తాజా చిత్రం నాన్ సిగప్పు మనిదన్ చిత్ర ప్రచార చిత్రం, పాటలు చూస్తే ఆమె ఎంతగా బరువు తగ్గిందో అర్థం అవుతుంది. అంతేకాదు గ్లామర్‌కు దూరం అంటూనే ఇప్పుడు ఆ తరహా పాత్రలు విజృంభిస్తున్న ఈ బ్యూటీ లిప్‌లాక్‌లకు నో చెప్పింది. 
 
 తాజాగా నాన్ శివప్పు మనిధన్ చిత్రంలో విశాల్‌తో యమ గాఢంగా పెదవి పెదవి కలిపేసి చుంభనాలు సన్నివేశంలో నటించేసింది. ఈ విషయం గురించి అడిగితే సినిమాల్లో లిప్‌లాక్‌కు తనకెలాంటి సమస్య లేదని బదులిచ్చింది. చిత్రకథకు అవసరం అయితే ముద్దులకు సిద్ధమే నంటోంది. నాన్ శివప్పు మనిగదన్ చిత్రంలో లిప్‌లాక్ ఆవశ్యకత గురించి దర్శకుడు తిరు వివరించడంతో ఓకే చెప్పానని తాను నటనకు బానిసనని చెప్పింది. పాత్రకు న్యాయం చేయడానికి ఎలాగైనా నటిస్తానని లక్ష్మీమీనన్ తన లిప్‌లాక్ చర్యలను సమర్థించుకుంటోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement