
ముద్దెవరూ ఇవ్వలేదు!
కన్నడ ముద్దుగుమ్మ హర్షిక పూనాచా, తమిళ హీరో శింభుల లిప్ లాక్ వీడియో ఇప్పుడు అభిమానులను ఊపేస్తోంది. దీనిపై ఇంతకాలం సెలైంట్‌గా ఉన్న ఈ అమ్మడు... ఎట్టకేలకు పెదవి విప్పింది. తనకెవరూ ముద్దు ఇవ్వలేదని ఎంత చెప్పినా వినరేంటని తెగ సీరియస్ అయిపోతోంది. ‘ఇదో పనికిమాలిన ప్రచారం. ఇటీవల మలేిసియాలో జరిగిన అవార్డుల కార్యక్రమం సందర్భంగా ఇలా లిప్ లాకైందని కామెంట్స్ చేస్తున్నారు. ఇది సరైంది కాదు’ అంటూ ట్వీట్ చేసిందీ స్వీట్ సుందరి.