శింభు స్పెషల్ విష్!
ఒకప్పడు డీప్‌గా తిరిగి... ఆ తరువాత కటీఫ్ చెప్పేసుకున్న తమిళ హీరో శింభు, కేరళ కుట్టి నయనతార మళ్లీ దగ్గరైనట్టే ఉన్నారు. నయన బర్త్‌డే సందర్భంగా అతగాడు స్పెషల్‌గా విషెస్ పంపించాడు. అమ్మడికి చాలామంది కోస్టార్లు, ఇండస్ట్రీ పీపుల్ కుప్పలుతెప్పలుగా శుభాకాంక్షలు చెప్పినా... శింభు పంపిన మెసేజ్‌పైనే అంతటా గుసగుస. శింభుతో విడిపోయి... ప్రభుదేవాతో పెళ్లి దాకా వెళ్లిన నయనతారకు మళ్లీ పాత కథ గుర్తుకొచ్చినట్టుంది. రాంరాం చెప్పేసిన పాత ప్రియుడితోనే తాజాగా ‘ఇదు నమ్మ ఆలు’ తమిళ చిత్రంలో చేస్తుండటం కొసమెరుపు!