సెప్టెంబర్‌ 8న 'సరసుడు' | Simbu, Nayanthara Sarasudu Releasing On September 8th | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌ 8న 'సరసుడు'

Published Sat, Aug 19 2017 2:12 PM | Last Updated on Sun, Sep 17 2017 5:42 PM

సెప్టెంబర్‌ 8న 'సరసుడు'

సెప్టెంబర్‌ 8న 'సరసుడు'

హీరో శింబు, అందాల తారలు నయనతార కాంబినేషన్ లో తెరకెక్కిన బ్యూటీఫుల్ లవ్ స్టోరి 'సరసుడు'. ఆండ్రియా, ఆదాశర్మ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను 'ప్రేమసాగరం' టి.రాజేందర్‌ సమర్పణలో శింబు సినీ ఆర్ట్స్‌ అండ్‌ జేసన్‌రాజ్‌ ఫిలింస్‌ బేనర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాండిరాజ్‌ దర్శకత్వంలో తమిళ్‌, తెలుగు భాషల్లో ఒకేసారి ఈ సినిమాను తెరకెక్కించారు.

తమిళంలో కొద్ది రోజులు కిందట 'ఇదు నమ్మ ఆళు' పేరుతో రిలీజైన ఈ సినిమా 27 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసి శింబు కెరీర్‌లోనే నెంబర్‌వన్‌ హిట్‌గా నిలిచింది. శింబు, నయనతార ప్రేమ వ్యవహరం తరువాత తెరకెక్కిన సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను తెలుగులో సెప్టెంబర్‌ 8న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement