sarasudu
-
అక్కడ జీఎస్టీ 15 శాతమే..!
తమిళసినిమా: తెలుగు చిత్రపరిశ్రమలో 15 శాతం జీఎస్టీ అమలవుతోందని, అక్కడ రాష్ట్రప్రభుత్వం అధనంగా పన్ను విధించడం లేదని సీనియర్ నటుడు, దర్శకుడు టీ.రాజేందర్ పేర్కొన్నారు. ఈయన కొడుకు, నటుడు శింబు కథానాయకుడిగా నటించిన ఇదునమ్మఆళు చిత్రం సరసుడు పేరుతో శుక్రవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకతో పాటు తమిళనాడులోనూ విడుదల కానుంది. తమిళంలో శింబు, నయనతార జంటగా నటించిన ఈ చిత్రాన్ని శింబు ఆర్ట్స్ పతాకంపై టీ.రాజేంద్రన్ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో 50, 60 సన్నివేశాలను రీషూట్ చేసి తెలుగులో నేరుగా టీ.రాజేందర్ విడుదల చేస్తున్నారు. ఇందులో టీ.రాజేందర్ ఒక పాటను రాయడంతో పాటు ఒక పాటను పాడటం విశేషం. సరసుడు చిత్రాన్ని తానే శింబు ఆర్ట్స్ బ్యానర్లో సొంతంగా విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రేమసాగరం చిత్రం నుంచి తనను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే విధంగా శింబు నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులో అనువాదం అయ్యి మంచి విజయాన్ని సాధించాయన్నారు. సరసుడు చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు. -
పాటపాడి అలరించనున్న హీరో తండ్రి..
చెన్నై: తెలుగు చిత్రపరిశ్రమలో 15 శాతం జీఎస్టీ పన్నునే అమలవుతోందని, అక్కడ రాష్ట్రప్రభుత్వాలు అదనంగా పన్నును విధించడం లేదని సీనియర్ నటుడు, దర్శకుడు టి. రాజేందర్ పేర్కొన్నారు. ఆయన కుమారుడు శింబు హీరోగా నటించిన ఇదునమ్మ ఆళం చిత్రం సరసుడు పేరుతో శుక్రవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతోపాటు తమిళనాడులో విడుదల కానుంది. తమిళంలో శింబు, నయనతార జంటగా నటించిన ఈ చిత్రాన్ని శింబు ఆర్ట్స్ పతాకంపై టి. రాజేందర్ నిర్మించిన విషయం తెలిసిందే. ఈయన రెండో కుమారుడు కురలరసన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కాగా ఈ చిత్రంలో 50,60 సన్నివేశాలను రీషూట్ చేసి తెలుగులో నేరు చిత్రంగా విడుదల చేస్తున్నారు. అదే విధంగా తమిళంలో పొందుపరచని హలో పాటను తెలుగు చిత్రంలో చేర్చామని, ఈ పాట యువతను అలరిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. దీనికి సరసుడు అనే టైటిల్ను పెట్టారు. ఇందులో టి. రాజేందర్ ఒక పాటను రాయడంతోపాటు ఒక పాటను పాడటం విశేషం. సరసుడు చిత్రాన్ని తానే శింబు ఆర్ట్స్ బ్యానర్లో సొంతంగా విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రేమసాగరం చిత్రం నుంచి తనను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారన్నారు. అదే విధంగా తన కొడుకు శింబు నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులో అనువాదం అయ్యి మంచి విజయాన్ని సాధించయన్నారు. అలా, మన్మధ, వల్లభ చిత్రాల తరువాత ఈ సరసుడు సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు. -
సెప్టెంబర్ 8న 'సరసుడు'
హీరో శింబు, అందాల తారలు నయనతార కాంబినేషన్ లో తెరకెక్కిన బ్యూటీఫుల్ లవ్ స్టోరి 'సరసుడు'. ఆండ్రియా, ఆదాశర్మ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను 'ప్రేమసాగరం' టి.రాజేందర్ సమర్పణలో శింబు సినీ ఆర్ట్స్ అండ్ జేసన్రాజ్ ఫిలింస్ బేనర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాండిరాజ్ దర్శకత్వంలో తమిళ్, తెలుగు భాషల్లో ఒకేసారి ఈ సినిమాను తెరకెక్కించారు. తమిళంలో కొద్ది రోజులు కిందట 'ఇదు నమ్మ ఆళు' పేరుతో రిలీజైన ఈ సినిమా 27 కోట్లకు పైగా కలెక్ట్ చేసి శింబు కెరీర్లోనే నెంబర్వన్ హిట్గా నిలిచింది. శింబు, నయనతార ప్రేమ వ్యవహరం తరువాత తెరకెక్కిన సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను తెలుగులో సెప్టెంబర్ 8న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. -
బ్రేకప్ తర్వాత...
కోలీవుడ్ మన్మథుడు శింబు, మలయాళ బ్యూటీ నయనతార గతంలో పీకల్లోతు ప్రేమలో మునిగి, పెళ్లి కూడా చేసుకుంటారనే టైమ్లో విడిపోయిన సంగతి తెలిసిందే. విడిపోయాక ఈ ఇద్దరూ కలసి నటించడం మానేశారు. ఇక ఎప్పటికీ కలవరనుకుంటున్న సమయంలో ‘ఇదు నమ్మ ఆళ్’ అనే చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, అందర్నీ ఆశ్చర్యపరిచారు. బ్రేకప్ తర్వాత.. ఈ ఇద్దరూ నటించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైంది. పాండిరాజ్ దర్శకత్వంలో శింబు సినీ ఆర్ట్స్ పతాకంపై టి.రాజేందర్ నిర్మించిన ఈ చిత్రం తెలుగులో ‘సరసుడు’ పేరుతో రిలీజ్ కానుంది. టి. రాజేందర్ మాట్లాడుతూ –‘‘రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ఐటీ ఉద్యోగులు ఎలా లవ్ చేసుకుంటున్నారు? ఏ విధంగా విడిపోతున్నారు? చివరికి వారి ప్రేమ పెళ్లిదాకా వస్తుందా, లేదా? అన్నదే కథ. తమిళంలో ఘనవిజయం సాధించింది. నవంబర్లోనే తెలుగులో రిలీజ్ చేయాల్సి ఉన్నా నోట్ల రద్దు వల్ల వాయిదా వేశాం. ఈలోపు తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేశాం. నా పెద్ద కొడుకు హీరోగా నటించిన ఈ చిత్రానికి చిన్న కొడుకు కుళల్ అరసన్ మంచి సంగీతం ఇచ్చాడు. ఈ నెల 14న పాటలు రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ఆండ్రియా, అదాశర్మ, సత్యం రాజేష్, సూరి, సంతానం, జయప్రకాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: బాలసుబ్రమణ్యం, కో–ప్రొడ్యూసర్: శ్రీమతి ఉషా రాజేందర్.