అక్కడ జీఎస్టీ 15 శాతమే..! | Simbu, Nayanthara's 'Sarasudu' Releasing On September 15 | Sakshi
Sakshi News home page

అక్కడ జీఎస్టీ 15 శాతమే..!

Published Thu, Sep 14 2017 4:07 AM | Last Updated on Tue, Sep 19 2017 4:30 PM

అక్కడ జీఎస్టీ 15 శాతమే..!

అక్కడ జీఎస్టీ 15 శాతమే..!

తమిళసినిమా: తెలుగు చిత్రపరిశ్రమలో 15 శాతం జీఎస్టీ అమలవుతోందని, అక్కడ రాష్ట్రప్రభుత్వం అధనంగా పన్ను విధించడం లేదని సీనియర్‌ నటుడు, దర్శకుడు టీ.రాజేందర్‌ పేర్కొన్నారు. ఈయన కొడుకు, నటుడు శింబు కథానాయకుడిగా నటించిన ఇదునమ్మఆళు చిత్రం సరసుడు పేరుతో శుక్రవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకతో పాటు తమిళనాడులోనూ విడుదల కానుంది. తమిళంలో శింబు, నయనతార జంటగా నటించిన ఈ చిత్రాన్ని శింబు ఆర్ట్స్‌ పతాకంపై టీ.రాజేంద్రన్‌ నిర్మించిన విషయం తెలిసిందే. 

ఈ చిత్రంలో 50, 60 సన్నివేశాలను రీషూట్‌ చేసి తెలుగులో నేరుగా టీ.రాజేందర్‌ విడుదల చేస్తున్నారు. ఇందులో టీ.రాజేందర్‌ ఒక పాటను రాయడంతో పాటు ఒక పాటను పాడటం విశేషం. సరసుడు చిత్రాన్ని తానే శింబు ఆర్ట్స్‌ బ్యానర్‌లో సొంతంగా విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రేమసాగరం చిత్రం నుంచి తనను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే విధంగా శింబు నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులో అనువాదం అయ్యి మంచి విజయాన్ని సాధించాయన్నారు. సరసుడు చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement