బ్రేకప్‌ తర్వాత... | Shimbu Nayanatara after Brake doing a movie sarasudu | Sakshi
Sakshi News home page

బ్రేకప్‌ తర్వాత...

Published Thu, Feb 2 2017 11:06 PM | Last Updated on Thu, Mar 28 2019 6:14 PM

బ్రేకప్‌ తర్వాత... - Sakshi

బ్రేకప్‌ తర్వాత...

కోలీవుడ్‌ మన్మథుడు శింబు, మలయాళ బ్యూటీ నయనతార గతంలో పీకల్లోతు ప్రేమలో మునిగి, పెళ్లి కూడా చేసుకుంటారనే టైమ్‌లో విడిపోయిన సంగతి తెలిసిందే. విడిపోయాక ఈ ఇద్దరూ కలసి నటించడం మానేశారు. ఇక ఎప్పటికీ కలవరనుకుంటున్న సమయంలో ‘ఇదు నమ్మ ఆళ్‌’ అనే చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి, అందర్నీ ఆశ్చర్యపరిచారు. బ్రేకప్‌ తర్వాత.. ఈ ఇద్దరూ నటించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైంది. పాండిరాజ్‌ దర్శకత్వంలో శింబు సినీ ఆర్ట్స్‌ పతాకంపై టి.రాజేందర్‌ నిర్మించిన ఈ చిత్రం తెలుగులో ‘సరసుడు’ పేరుతో రిలీజ్‌ కానుంది. టి. రాజేందర్‌ మాట్లాడుతూ –‘‘రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది.

ఐటీ ఉద్యోగులు ఎలా లవ్‌ చేసుకుంటున్నారు? ఏ విధంగా విడిపోతున్నారు? చివరికి వారి ప్రేమ పెళ్లిదాకా వస్తుందా, లేదా? అన్నదే కథ. తమిళంలో ఘనవిజయం సాధించింది. నవంబర్‌లోనే తెలుగులో రిలీజ్‌ చేయాల్సి ఉన్నా నోట్ల రద్దు వల్ల వాయిదా వేశాం. ఈలోపు తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేశాం. నా పెద్ద కొడుకు హీరోగా నటించిన ఈ చిత్రానికి చిన్న కొడుకు కుళల్‌ అరసన్  మంచి సంగీతం ఇచ్చాడు. ఈ నెల 14న పాటలు రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు. ఆండ్రియా, అదాశర్మ, సత్యం రాజేష్, సూరి, సంతానం, జయప్రకాష్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: బాలసుబ్రమణ్యం, కో–ప్రొడ్యూసర్‌: శ్రీమతి ఉషా రాజేందర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement