ప్రేమలో ఓడిన కథానాయికలు
Published Tue, Oct 29 2013 4:20 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 AM
ప్రేమ అనే పదానికి అక్షరాలు రెండే. కాని భావాలెన్నో. ప్రేమ పవిత్రమైందంటారు కొందరు. కాదు గుడ్డిదంటారు ఇంకొందరు. ఇక సినిమా రంగం విషయానికొస్తే అసలు ప్రేమకు అర్థం ఏమిటో ఎవరూ చెప్పలేకపోవచ్చు. ఇక్కడ ఎవరు ఎప్పుడు ఎవరితో ప్రేమలో పడతారో, ఎప్పుడు బ్రేక్ అప్ అంటారో అర్థంకాని పరిస్థితి.
భావన..
భావన ఒక దర్శకుడి ప్రేమలో పడ్డారు. తొలుత ఈ ప్రేమ మధురంగానే అనిపించినా ఆ తరువాత చేదు అనుభవన్నే మిగిల్చింది. ఆమె ఎవరితో మాట్లాడరాదనే ఆంక్షలు విధించాడు. చివరకు సెల్‌ఫోన్‌ను కూడా లాక్కున్నాడు. ఆ కఠిన నిబంధనల చెరను భావన భరించలేకపోయింది. ఆ ప్రేమ అనే బంధం నుంచి బయటపడగలిగింది.
మీరాజాస్మిన్..
ఈమె బహుభాషా నటి. ఈ కేరళ కుట్టి కూడా తొలుత ఒక దర్శకుడితో ప్రేమాయణం సాగించింది. ఆ తరువాత ఒక రాజకీయ నాయకుడి లవ్‌లో పడినట్లు పుకార్లు షికార్లు చేశారు. ఆ మధ్య మాండలిన్ రాజేష్‌తో ప్రేమ వ్యవహారం సాగించారు. వీరిద్దరూ పెళ్లి పీటలెక్కనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఆ తరువాత లవ్ బ్రేక్ అప్ అంటూ వార్తలు వెలువడ్డాయి. తాజాగా ఇద్దరూ సహ జీవనం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
నయనతార..
మోస్ట్ క్రేజియస్ట్ హీరోయిన్ ఈ బ్యూటీ. సంచలనాలకు కేంద్ర బిందువని కూడా చెప్పవచ్చు. మొదట నటుడు శింబు ప్రేమలో పడ్డారు. వీరి రొమాన్స్ ఫొటోలు ఇంటర్నెట్‌లో కలకలం సృష్టించాయి. వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని ప్రచారం సాగింది. చివరకు వీరి ప్రేమ పెటాకులైంది. విల్లు చిత్ర షూటింగ్ సమయంలో ఆ చిత్ర దర్శకుడు ప్రభుదేవాతో నయనతార ప్రేమాయణం సాగించారు. సుమారు రెండేళ్లు సాగిన వీరి ప్రేమ పెళ్లి ఖాయం అనే స్థాయికి చేరుకుంది. నయనతార ప్రేమకోసం మతాన్ని కూడా మార్చుకున్నారు.
నటనకు స్వస్తి చెప్పారు. అయినా వీరి ప్రేమకు ఫుల్‌స్టాప్ పడింది. ప్రస్తుతం నటుడు ఆర్య మోజులో ఉన్నట్లు సమాచారం. ఆర్య మాత్రం అలాంటిదేమీ లేదని ఖండించారు. ఇక నటి ఆండ్రియా, యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌తో రసవత్తర ప్రేమ సన్నివేశాలు ఇంటర్నెట్‌లో దర్శనమిచ్చి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఏ విషయంలోనయినా డోంట్ కేర్ అన్నట్లుగా ప్రవర్తించే ఆండ్రియా ఒకప్పుడు తాను, అనిరుధ్ ప్రేమించుకున్న ప్రేమ విషయం నిజమే.
ఇప్పుడు తమ మధ్య అదేంలేదని సెలవిస్తోంది. రిచా గంగోపాధ్యాయ తమిళంలో ఒస్తి, మయక్కం ఎన్న చిత్రాలలో నటించింది. ఈమె ఆదిలోనే ఒక ఫొటోగ్రాఫర్‌తో ప్రేమాయణం సాగించింది. ఆ ప్రేమ వికటించింది. తమిళం, తెలుగు భాషలలో మంచి స్థానం కోసం తాపత్రయ పడుతున్న నటి తాప్సి. ఈ జాన ప్రేమ వ్యవహారంలో నెరజాణే. నటుడు మహత్‌తో ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ అమ్మడి ప్రేమ కోసం ఇద్దరు యువకులు ముష్టియుద్ధానికి దిగినట్టు వార్తలు వచ్చాయి. ఈ ప్రేమ వ్యవహారాన్ని తాప్సీ ఖండించారనుకోండి. ఏది ఏమై నా ప్రేమను ఇప్పు డు తమ పరిస్థితులకనుగుణంగా మా ర్చుకుంటున్నారని చెప్పక తప్పదు.
Advertisement
Advertisement