Bhavna
-
మాలీవుడ్ సూపర్ ‘హీట్’.. ‘అమ్మ’ రాజీనామా!
కేరళ సినిమా రంగంలో భూకంపం పుట్టింది. నటీనటుల సంఘం ‘అమ్మ’ కార్యవర్గం పూర్తిగా రాజీనామా చేసింది. వీరిలో మోహన్‌లాల్ ఉన్నారు. గత కొన్ని రోజులుగా కేరళ సినిమా రంగంలో మహిళలపై దురాగతాలు బయటికి వస్తుండటంతో పరిశ్రమ వణుకుతోంది. కొందరు తమ పదవులకు రాజీనామాలు చేస్తుంటే మరికొందరు ముఖం చాటేస్తున్నారు. ఈ దావానలం బాలీవుడ్ వరకు పాకితే మరింత ప్రక్షాళనం జరగవచ్చు.మలయాళ సినీ పరిశ్రమలో గొలుసుకట్టు ఘటనలు జరుగుతున్నాయి. 2017లో మలయాళ నటి భావనా మీనన్‌పై లైంగిక దాడి జరగడం (కొచ్చి శివార్లలో కారులో కొందరు వ్యక్తులు చేశారని ఆరోపణ) వెనుక సూత్రధారి మలయాళ హీరో దిలీప్ అని రేగిన కార్చిచ్చు అక్కడి ప్రభుత్వం చేత జడ్జి హేమ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేయించింది. అయితే ఆ కమిటీ రి΄ోర్టు ఆలస్యంగా 2024 ఆగస్టులోగాని బయటకు రాలేదు. అది వచ్చిన వెంటనే మలయాళ పరిశ్రమలో కొంతమంది మహిళలు తమ అనుభవాలను బయటకు చెప్పసాగారు. దాంతో మలయాళ పరిశ్రమ కుదుపులకు లోనవుతోంది.నటుడు సిద్దిఖీ పై ఆరోపణమలయాళంలో టాప్ కేరెక్టర్ ఆర్టిస్ట్, అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ)కు జనరల్ సెక్రటరీ అయిన సిద్దిఖీ పై రేవతి సంపత్ అనే జూనియర్ ఆర్టిస్ట్ అత్యాచార ఆరోపణలు చేసింది. హేమా కమిషన్ బయటకు వచ్చాక ఆమె తన ఆరోపణలను మరోసారి మీడియా ముందుకు తెచ్చింది. ‘2016లో అతను కొచ్చిలోని ఒక హోటల్లో నా పై అత్యాచారం చేశాడు. అప్పుడు నాకు 21 ఏళ్లు ఉంటాయి. నాకు సినిమా రంగం ఆసక్తి ఉందని తెలిసి హోటల్‌కు పిలిపించి హఠాత్తుగా లైంగికదాడి చేశాడు’ అని ఆమె చెప్పింది. ఈ ఆరోపణలు ఆమె 2019లో చేసినా ఇప్పుడు మళ్లీ శక్తి పుంజుకుని సిద్దిఖీని విమర్శల వలయంలో నిలబెట్టాయి. దాంతో అతడు ‘అమ్మ’ పదవికి రాజీనామా చేశాడు. అయితే అతడు తాజాగా ఆ జూనియర్ ఆర్టిస్టు తనపై లేని΄ోని అభాండాలు వేస్తోందని కేరళ డి.జి.పికి ఫిర్యాదు చేశాడు.ఎం.ఎల్.ఏ పేరుమరోవైపు నటుడు ముకేష్ (ఇతను సి.పి.ఎం ఎం.ఎల్.ఏ) పై కూడా టెస్ జోసఫ్ అనే కాస్టింగ్ డైరెక్టర్ అమర్యాదకరంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసింది. ‘అతను ఔట్‌డోర్‌లో తన రూమ్ పక్కన నా రూమ్ ఉండేలా కుట్ర చేశాడు. నా రూమ్ తలుపు పదే పదే కొట్టాడు’ అని ఆమె తెలియచేసింది. అయితే ముకేష్ ఇదంతా రాజకీయ కుట్ర అని అంటున్నాడు. ఈ దుమారం ఇలా ఉంటే ప్రభుత్వ చలచిత్ర అకాడెమీ ప్రస్తుత చైర్మన్, దర్శకుడు రంజిత్‌పై ఇలాంటి ఆరోపణలు రావడంతో అతనూ రాజీనామా చేశాడు. దీంతో ప్రభుత్వం సినిమా పరిశ్రమలో వస్తున్న ఫిర్యాదులపై విచారణకు 4 మహిళా ముగ్గురు పురుష ఐపిఎస్‌లతో ‘సిట్’ ఏర్పాటు చేసింది. ఈ ‘సిట్’ తనకు తానుగా ఫిర్యాదులు నమోదు చేయదని, ఫిర్యాదులను పరిశీలిస్తుందని ప్రభుత్వం చెప్పడంతో అంతా మసిపూసి మారేడుకాయ చేసే వ్యవహారంగా ఇది మిగలనుందని విమర్శలు వస్తున్నాయి.మేము న్యాయపోరాటాలు చేయలేంఫిర్యాదులు చేస్తున్న మహిళలు ‘మేము కేసులు పెట్టి కోర్టులు చుట్టు తిరగలేం’ అని చెప్పడం గమనార్హం. ‘మేం అంత పెద్దవారిని ఎదుర్కోలేం’ అని వారు అంటున్నారు. మలయాళ ఇండస్ట్రీలో ఉన్న 15 మంది శక్తిమంతులు పరిశ్రమలో ఎవరో పైకి రావాలో, ఎవరు వెనుక ఉండిపోవాలో నిర్ణయిస్తున్నారని హేమ కమిషన్ తెలియచేసింది. వీరు చెప్పినట్టు వినకపోతే ఇండస్ట్రీలో మనలేని పరిస్థితి ఉందని కమిషన్ పేర్కొంది. ‘స్త్రీలను ఎందుకు ఇబ్బంది పెడతారు? అని ప్రశ్నించే పురుషులను కూడా బ్యాన్ చేస్తున్నారు’ అని తెలపడం విశేషం. రాబోయే రోజుల్లో ఈ కందిరీగల తుట్టె ఏ మేరకు ఎవరిని కుట్టనుందో వేచి చూడాలి.కాంప్రమైజ్ – అడ్జస్ట్ఒక నటి సినిమా చేయడానికి అంగీకరించే ముందు మలయాళ పరిశ్రమలో వినిపించే రెండు పదాలు కాంప్రమైజ్, అడ్జస్ట్. వేషం తె ప్రొడక్షన్ మేనేజర్లు ‘రాజీ పడాలని’, ‘సర్దుకుపోవాలని’ కోరుతారు. ‘సరే’ అంటే వేషం. లేకుంటే లేదు. అంతటితో వదిలితే ఫరవాలేదు. కాని హేమా కమిషన్ ప్రకారం ఏ మహిళా ఆర్టిస్ట్ అయినా నో అంటే వెంటనే ఇండస్ట్రీ అంతటా వ్యాపిస్తుంది. ఆమెను ‘దారి’కి తెచ్చే పని ఇండస్ట్రీ అంతా తీసుకుంటుంది. ‘మా సారు (ఏ పెద్ద స్టారో దర్శకుడో ప్రొడ్యూసర్) అడిగితే కాదంటావా?’ అని ఎవరూ వేషం ఇవ్వరు. పస్తులతో మాడేలా చేస్తారు. అందుకే మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ముందుకొచ్చి‘మహిళలు చేసే ఏ ఫిర్యాదునైనా సీరియస్‌గా తీసుకోవాలి’ అని బహిరంగంగా మాట్లాడాడుఫ్యాన్స్ ఆర్మీలైంగిక దుశ్చర్యలు ఎదుర్కొన్న మహిళలు బయటకు చెప్పేందుకు భయపడటానికి మరో కారణం ఈ పెద్ద నటులు ఫ్యాన్స్ ఆర్మీలను దాడికి పురిగొల్పుతుండటమే. ఏ హీరోను ఎవరేమన్నా వారి అభిమానులు సోషల్ మీడియాలో బూతులు జోడిస్తూ మీమ్స్ తయారు చేస్తుండటంతో బాధితులు బెంబేలెత్తుతున్నారు. కొన్నిసార్లు భౌతికంగా దాడి చేస్తారనే భయం కూడా సృష్టిస్తున్నారు. అందుకే హేమా కమిషన్ ఫ్యాన్స్‌ను కట్టడి చేయాలని ప్రభుత్వానికి ప్రత్యేకంగా సూచించింది.తలుపు విరిగేలా బాదుతారు‘ఔట్‌డోర్ షూటింగ్లో అర్ధరాత్రి తాగేసి వచ్చి తలుపు విరిగేలా బాదుతారు. అందుకే ఔట్‌డోర్‌లో కుటుంబ సభ్యులను తోడు తీసుకొని వెళ్లాల్సి వస్తోంది’ అని చాలామంది మహిళా ఆర్టిస్టులు హేమా కమిషన్‌కు చెప్పారు. వేషం ఇచ్చేటప్పుడే ‘అడిగితే అంగీకరించాలనే’ డిమాండ్ ప్రోడక్షన్ మేనేజర్ చల్లగా చెపాడని తెలియచేశారు.మోహన్‌లాల్ రాజీనామా30 ఏళ్ల చరిత్ర కలిగిన ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్’ (అమ్మ) అధ్యక్ష పదవికి నటుడు మోహన్‌లాల్ రాజీనామా చేశారు. మలయాళ పరిశ్రమలో స్త్రీలపై సాగుతున్న లైంగిక దోపిడిని జస్టిస్ హేమా కమిషన్ బయట పెట్టాక వినవచ్చిన ఆరోపణల్లో ‘అమ్మ’ జనరల్ సెక్రటరీ సిద్దిఖీతో పాటు మరికొందరి పేర్లు ఉన్న దరిమిలా నైతిక బాధ్యత వహిస్తూ మొత్తం 17 మంది సభ్యులున్న కార్యవర్గం రాజీనామా చేసింది. హడావిడిగా ఏర్పాటు చేసిన ఆన్లైన్ మీటింగ్‌లో కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ‘మమ్మల్ని విమర్శకు, దిద్దుబాటుకు లోను చేసినందుకు కృతజ్ఞతలు’ అని రాజీనామా లేఖలో కమిటీ సభ్యులు పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకూ మోహన్‌లాల్, మమ్ముట్టి తదితర సూపర్స్టార్లు హేమా కమిషన్ గురించి ఏమీ మాట్లాడక΄ోవడాన్ని ‘ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ (డబ్లు్యసిసి) తప్పుబట్టింది. మలయాళ రంగంలోని మహిళా నటీమణులు ‘అమ్మ’తో విభేదించి ఈ గ్రూపును నియమించుకున్నారు. హేమా కమిషన్ రిపోర్టును బయటపెట్టమని ΄ోరాడింది వీరే. ‘తంగలాన్’ నటి ΄ార్వతి తిరువోతు ఈ గ్రూప్‌లో చురుగ్గా పని చేస్తోంది. మెంబర్‌షిప్‌కు వెళ్లినా‘మూడు సినిమాల్లో నటిస్తే అమ్మలో మెంబర్షిప్ తీసుకోవచ్చు. దానికోసం నేను ఫోన్ చేస్తే ఆ పనులు చూసే సభ్యుడు తన ఫ్లాట్‌కు రమ్మన్నాడు. నేను ఫ్లాట్‌కు వెళ్లి ఫామ్ ఫిలప్ చేస్తుంటే వెనుక నుంచి వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. ఔట్‌డోర్ షూటింగ్ లో ఒక నటుడు నా రూమ్‌కు వచ్చి తలుపు తీసిన వెంటనే మంచం మీదకు లాగే ప్రయత్నం చేశాడు. ఇంకో నటుడు రెస్ట్రూమ్ నుంచి బయటకు వస్తున్నప్పుడూ వదల్లేదు. కావలించుకున్నాడు. ‘అడ్జస్ట్’ అవమని అందరూ చెప్పడమే. ఎంత అడ్జస్ట్ అవుదామని చూసినా ఇది భరించలేనంతగా ఉండటం వల్ల మలయాళ ఇండస్ట్రీ వదిలిపెట్టి చెన్నైకి మారి΄ోయాను’ అని నటి మీను మునీర్ ఫేస్బుక్లో రాసింది. హేమా కమిషన్ బయటకు వచ్చాక ఈమె ఈ వివరాలు తెలిపింది. – ఫ్యామిలీ డెస్క్ -
అధిరోహణ: బుక్ షెల్ఫ్ నుంచి భవనం దాకా!
శిఖరాలను అధిరోహించాలంటే పర్వతాల దగ్గరకే చేరుకోనక్కర్లేదు. ఎంచుకున్న రంగంలో అత్యుత్తమ స్థాయికి ఎదగడం కూడా అధిరోహణే. ప్రతి అధిరోహణలోనూ సవాళ్లు ఉంటాయి. సానుకూలంగా గమనిస్తూ అధిగమిస్తేనే దారి సుగమమం అవుతుంది. ఢిల్లీలో ఉంటున్న 30 ఏళ్ల భవ్నా ఖన్నా పురుషుల ప్రపంచమైన భవన నిర్మాణ రంగంలో తనదైన ముద్ర వేస్తోంది. కోట్ల రూపాయల ప్రాజెక్ట్‌లను సకాలంలో పూర్తి చేసి ‘శభాష్’ అనిపించుకుంటోంది. తనే శిఖరమంతగా ఎదిగి మరికొందరికి ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది. ఆర్కిటెక్చర్ రంగం దాదాపు పురుషులదే అయి ఉంటుంది. అలాంటి రంగంలో మూడు వేల రూపాయల నుంచి వర్క్ మొదలుపెట్టిన భవ్నా ఖన్నా నేడు మూడు కోట్ల ప్రాజెక్ట్‌లను కూడా అందిపుచ్చుకుంటోంది. ఢిల్లీవాసి అయిన భవ్నా పెద్ద పెద్ద భవనాలను, హాస్పిటాలిటీ ప్రాజెక్ట్స్, రిసార్ట్స్నూ డిజైన్ చేస్తోంది. 30 ఏళ్ల భవ్నా భవన నిర్మాణ రంగంలో ఎదుగుతున్న తీరు, సమస్యలను అధిగమిస్తున్న విధానం నవతరానికి స్ఫూర్తిదాయకం. ‘‘ఎనిమిదేళ్ల వయసులోనే ఎల్తైన భవనాలను చూసి, ఎంతో ఇష్టపడేదాన్ని. కొన్నాళ్లకు నా ఇష్టాన్ని గమనించిన మా నాన్న నా 13వ పుట్టిన రోజున బిల్డింగ్ గేమ్ కానుకగా ఇచ్చారు. ఆ గేమ్‌లో బ్లాకులను కలుపుతూ ఏదైనా భవనాన్ని కట్టచ్చు. ఆ ఆటలో మిగతా ప్రపంచాన్ని మర్చిపోయేదాన్ని. కట్టిన వాటిని పడేస్తూ, తిరిగి కడుతూ చాలా సమయం గడిపేసేదాన్ని. పన్నెండవ తరగతి తర్వాత, ఐదేళ్ల ఆర్కిటెక్చర్ డిగ్రీ కోర్సు చేశాను. ఏడాది పాటు ఉద్యోగం చేశాను. తర్వాత ఉద్యోగంలో నాకోసం నేనేదీ చేయలేనని అర్థం చేసుకున్నాను. నా సొంతంగా ఏదైనా ప్రారంభించాలనుకున్నాను. ఎవరి సూచనలతోనో పనిచేయలేకపోయాను. నాకు నా సొంత ఆలోచనలు ఉన్నాయి. భవనం లేదా ఫామ్ హౌజ్ లేదా కోట దేనిని నిర్మించాలన్నా ముందగా నా ఆలోచనలను కాగితంమీద పెట్టేదాన్ని. ఒక్కో ఇటుక పేర్చుకుంటూ.. భవనాన్ని నిర్మించాలంటే ఒక్కో ఇటుకను పేర్చాలి. అలాగే, సిమెంట్, స్టీల్, స్టోన్.. ప్రతీ పనిలో నైపుణ్యం చూపాలి. అందుకు తగిన టీమ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. నా నైపుణ్యాలు నాకు అర్థమయిన తర్వాత నా ఉద్యోగం వదిలి, ఆపై నా పనిని ప్రారంభించాను. స్టూడియో ఆస్ట్రిడ్ ఇండియా పేరుతో కంపెనీని ప్రారంభించాను. ఈ రంగంలో నాకు గాడ్‌ఫాదర్ లేకపోవడంతో నా సొంత వ్యాపారాన్ని ప్రారంభించడం సవాళ్లతో కూడుకున్నది. ప్రతీ పని స్వయంగా తెలుసుకుంటూ చేయాలి. ముందు ఎవ్వరూ టీమ్‌గా చేరలేదు. నెమ్మదిగా కలిశారు. చిన్న పుస్తకాల షెల్ఫ్‌తో మొదలు.. కొన్ని రోజుల వరకు నా కంపెనీ పనిలో నేనున్నాను. 2016లో ఒకరోజు త్రీ బై త్రీ బుక్ షెల్ఫ్ చేసివ్వమని ఒక ఆర్డర్ వచ్చింది. మూడు వేల రూపాయలతో వచ్చిన చిన్న ప్రాజెక్ట్ అది. నా కలలు పెద్దవే. కానీ, మొదటి ప్రాజెక్ట్, అందుకే కష్టపడ్డాను. ఆ చిన్న బుక్ షెల్ఫ్ నుంచి ఈ రోజు పెద్ద పెద్ద భవనాలు, రిసార్టులు డిజైన్ చేస్తున్నాను. 3 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కూడా తీసుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి ఎల్తైన భవనాలు, మెరిసే అద్దాల గోడలు నా కళ్లలో కలల ఇంటిని కట్టుకునేవి. చిన్నతనంలో నా అరచేతిలో రూపుదిద్దుకున్న చిట్టి చిట్టి భవనాలపైనే నాకు అంత ఆకర్షణ ఉందని అప్పట్లో తెలియదు. పెద్దయ్యాక ఆ కలే నన్ను ఆర్కిటెక్ట్‌గా ఎదిగేందుకు ప్రోత్సాహమిచ్చింది. క్లయింట్ అవసరాలు వినడం నుంచి అమలు చేయడం వరకు అన్ని పనులు స్వయంగా చూస్తుంటాను. సవాళ్లను ఎదుర్కొంటేనే సరైన దారి ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు నాలో మార్పు స్పష్టంగా చూశాను. నామీద నాకు చాలా నమ్మకం వచ్చింది. అనుభవం పెరిగింది. ఎక్స్పోజర్ పెరిగింది. ఆరు సంవత్సరాలలో నైపుణ్యం కలిగిన క్రియేటివ్ డైరెక్టర్‌గా నన్ను నేను చూసుకుంటున్నాను. ఆడపిల్లలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగాలు చేసే రోజులు పోయాయి అని నన్ను నేను చూసుకున్నప్పుడు స్పష్టంగా కనిపించింది. నా స్నేహితుల జాబితాలో కూడా నలుగురిలో మాట్లాడటానికి సిగ్గుపడే అమ్మాయిలు ఇప్పుడు మంచి వక్తలుగా మారారు. శిల్పకళ లేదా వ్యాపార రంగంలోకి రావాలనుకునే అమ్మాయిలకు పదే పదే చెప్పే మాట ‘ప్రతి రంగానికి దానికి తగిన సవాళ్లు ఉంటాయి. వాటిని వదులుకోవద్దు. మార్గం ధైర్యంతోనే వేయబడుతుంది. మీరు వృద్ధిలోకి వస్తున్నప్పుడు మరికొన్ని మార్గాలను కనుక్కుంటారు’ అని వివరిస్తారు భవ్నా ఖన్నా. ఈ ఆరేళ్లలో స్పార్క్ ఎక్సలెన్స్ అవార్డు, యువ పారిశ్రామికవేత్త బిరుదును అందుకున్న భవ్నాఖన్నా గురించి ప్రముఖ జాతీయ మ్యాగజైన్లు కవర్‌పేజీ కథనాలతో ఆమె ఘనతను చాటాయి. విజయం ఒక్కరోజులోనే అందకపోవచ్చు. ప్రతీరోజు ప్రయత్నంతోనే మొదలవ్వాలి. ప్రతీ ప్రయత్నం విజయంవైపుగా కృషి చేయాలి. సవాళ్లను స్థైర్యంగా ఎదుర్కోవాలి అని ఈ ఆర్కిటెక్చర్ జీవనం ఎంతోమందికి ప్రేరణనిస్తోంది. -
ప్రేమలో ఓడిన కథానాయికలు
ప్రేమ అనే పదానికి అక్షరాలు రెండే. కాని భావాలెన్నో. ప్రేమ పవిత్రమైందంటారు కొందరు. కాదు గుడ్డిదంటారు ఇంకొందరు. ఇక సినిమా రంగం విషయానికొస్తే అసలు ప్రేమకు అర్థం ఏమిటో ఎవరూ చెప్పలేకపోవచ్చు. ఇక్కడ ఎవరు ఎప్పుడు ఎవరితో ప్రేమలో పడతారో, ఎప్పుడు బ్రేక్ అప్ అంటారో అర్థంకాని పరిస్థితి. భావన.. భావన ఒక దర్శకుడి ప్రేమలో పడ్డారు. తొలుత ఈ ప్రేమ మధురంగానే అనిపించినా ఆ తరువాత చేదు అనుభవన్నే మిగిల్చింది. ఆమె ఎవరితో మాట్లాడరాదనే ఆంక్షలు విధించాడు. చివరకు సెల్‌ఫోన్‌ను కూడా లాక్కున్నాడు. ఆ కఠిన నిబంధనల చెరను భావన భరించలేకపోయింది. ఆ ప్రేమ అనే బంధం నుంచి బయటపడగలిగింది. మీరాజాస్మిన్.. ఈమె బహుభాషా నటి. ఈ కేరళ కుట్టి కూడా తొలుత ఒక దర్శకుడితో ప్రేమాయణం సాగించింది. ఆ తరువాత ఒక రాజకీయ నాయకుడి లవ్‌లో పడినట్లు పుకార్లు షికార్లు చేశారు. ఆ మధ్య మాండలిన్ రాజేష్‌తో ప్రేమ వ్యవహారం సాగించారు. వీరిద్దరూ పెళ్లి పీటలెక్కనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఆ తరువాత లవ్ బ్రేక్ అప్ అంటూ వార్తలు వెలువడ్డాయి. తాజాగా ఇద్దరూ సహ జీవనం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. నయనతార.. మోస్ట్ క్రేజియస్ట్ హీరోయిన్ ఈ బ్యూటీ. సంచలనాలకు కేంద్ర బిందువని కూడా చెప్పవచ్చు. మొదట నటుడు శింబు ప్రేమలో పడ్డారు. వీరి రొమాన్స్ ఫొటోలు ఇంటర్నెట్లో కలకలం సృష్టించాయి. వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని ప్రచారం సాగింది. చివరకు వీరి ప్రేమ పెటాకులైంది. విల్లు చిత్ర షూటింగ్ సమయంలో ఆ చిత్ర దర్శకుడు ప్రభుదేవాతో నయనతార ప్రేమాయణం సాగించారు. సుమారు రెండేళ్లు సాగిన వీరి ప్రేమ పెళ్లి ఖాయం అనే స్థాయికి చేరుకుంది. నయనతార ప్రేమకోసం మతాన్ని కూడా మార్చుకున్నారు. నటనకు స్వస్తి చెప్పారు. అయినా వీరి ప్రేమకు ఫుల్స్టాప్ పడింది. ప్రస్తుతం నటుడు ఆర్య మోజులో ఉన్నట్లు సమాచారం. ఆర్య మాత్రం అలాంటిదేమీ లేదని ఖండించారు. ఇక నటి ఆండ్రియా, యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌తో రసవత్తర ప్రేమ సన్నివేశాలు ఇంటర్నెట్లో దర్శనమిచ్చి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఏ విషయంలోనయినా డోంట్ కేర్ అన్నట్లుగా ప్రవర్తించే ఆండ్రియా ఒకప్పుడు తాను, అనిరుధ్ ప్రేమించుకున్న ప్రేమ విషయం నిజమే. ఇప్పుడు తమ మధ్య అదేంలేదని సెలవిస్తోంది. రిచా గంగోపాధ్యాయ తమిళంలో ఒస్తి, మయక్కం ఎన్న చిత్రాలలో నటించింది. ఈమె ఆదిలోనే ఒక ఫొటోగ్రాఫర్‌తో ప్రేమాయణం సాగించింది. ఆ ప్రేమ వికటించింది. తమిళం, తెలుగు భాషలలో మంచి స్థానం కోసం తాపత్రయ పడుతున్న నటి తాప్సి. ఈ జాన ప్రేమ వ్యవహారంలో నెరజాణే. నటుడు మహత్తో ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ అమ్మడి ప్రేమ కోసం ఇద్దరు యువకులు ముష్టియుద్ధానికి దిగినట్టు వార్తలు వచ్చాయి. ఈ ప్రేమ వ్యవహారాన్ని తాప్సీ ఖండించారనుకోండి. ఏది ఏమై నా ప్రేమను ఇప్పు డు తమ పరిస్థితులకనుగుణంగా మా ర్చుకుంటున్నారని చెప్పక తప్పదు.