సాక్షి, భూపాలపల్లి: కాంగ్రెస్ విజయ భేరి బస్సు యాత్రలో మాజీ మంత్రి కొండా సురేఖకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. భూపాలపల్లిలో బైక్ ర్యాలీలో పాల్గొన్న సురేఖ స్కూటీ నడుపుతూ కిందపడ్డారు. ముఖానికి, చేతికి గాయాలయ్యాయి. వెంటనే ఆమె అనుచరులు హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో సురేఖ చికిత్స పొందుతున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి పట్టణంలో కాంగ్రెస్ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. భూపాలపల్లి పట్టణంలోని బాంబుల గడ్డ వరకు నిరుద్యోగులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ ర్యాలీకి తరలివచ్చారు.
చదవండి: కేసీఆర్ అవినీతిపై ఈడీ, సీబీఐ ఫోకస్ ఎందుకు లేదు: రాహుల్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment