
మోటర్ నుంచి వస్తున్న మంటలు
గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్‌లో ఉన్న కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు (కేటీపీపీ)లో బుధవారం రాత్రి మరో సారి అగ్ని ప్రమాదం సంభవించింది. జెన్‌కో స్టేజ్–2లో యాష్ హ్యాండిలింగ్ సిస్టం లోని ఓవర్ ఫ్లో పంపు మోటార్ నుంచి మంట లు చెలరేగాయి. అధిక వేడిమి కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని సమాచారం. మంటలు చెలరేగిన సమయంలో అక్కడ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పింది. కొద్ది రోజుల క్రితం ప్లాంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ కార్మికుడు మృతిచెందగా, ఏడుగురు కార్మికులు గాయపడిన విషయం తెలిసిందే.
నిలిచిన విద్యుదుత్పత్తి
కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలో బుధవారం రాత్రి 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రధాన ప్లాంట్‌లోని బాయిలర్ ట్యూబ్ లీకేజీతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment