Kakatiya Thermal Power Project
-
కేటీపీపీలో మరోసారి అగ్నిప్రమాదం
గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్లో ఉన్న కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు (కేటీపీపీ)లో బుధవారం రాత్రి మరో సారి అగ్ని ప్రమాదం సంభవించింది. జెన్కో స్టేజ్–2లో యాష్ హ్యాండిలింగ్ సిస్టం లోని ఓవర్ ఫ్లో పంపు మోటార్ నుంచి మంట లు చెలరేగాయి. అధిక వేడిమి కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని సమాచారం. మంటలు చెలరేగిన సమయంలో అక్కడ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పింది. కొద్ది రోజుల క్రితం ప్లాంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ కార్మికుడు మృతిచెందగా, ఏడుగురు కార్మికులు గాయపడిన విషయం తెలిసిందే. నిలిచిన విద్యుదుత్పత్తి కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలో బుధవారం రాత్రి 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రధాన ప్లాంట్‌లోని బాయిలర్ ట్యూబ్ లీకేజీతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు వెల్లడించారు. -
తాడిచర్ల తడబాటు
► మొదలుకాని ఓసీ పనులు ► కొలిక్కి రాని భూసేకరణ సమస్య ► నిర్వాసితులకు అందని పరిహారం ► కేటీపీపీ రెండవ దశకు బొగ్గు కష్టాలు ► నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జెన్కో గణపురం (వరంగల్) : వరంగల్ జిల్లా చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు(కేటీపీపీ) రెండవ దశ 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌కు అవసరమైన బొగ్గు అందించే తాడిచర్ల ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు పనులు ఇంకా ప్రారంభం కాలేదు. వాస్తవానికి కరీంనగర్ జిల్లా మల్హర్ మండలం తాడిచర్లలో ఓసీ తవ్వకం పనులు 2015లో ప్రారంభించి 2016లో బొగ్గు అందించేలా జెన్కో-సింగరేణి సంస్థల మధ్య ఒప్పందం జరిగింది. భూసేకరణ సమస్య కొలిక్కి రాకపోవడంతో సింగరేణి అడుగు లు ముందుకు వేయడం లేదు. తాటిచర్ల 1, 2 బొగ్గు బ్లాక్‌లను కేంద్రప్రభుత్వం జెన్కోకు కేటాయించింది. 1వ బ్లాక్ కోసం సూమారు 2,200 ఎకరాల భూమి సేకరించారు. అందులో పట్టా భూముల కు పరిహారం చెల్లించగా లావుని భూముల పరిహారం పెండింగ్‌లో ఉంది. తాడిచర్ల నుంచి కేటీపీపీకి కన్వేయర్ బెల్ట్ నిర్మాణానికి అవసరమైన భూమి సేకరించినా నిర్వాసితులకు పరిహారం చెల్లించలేదు. 20 కిలోమీటర్లు నిడివి లో నిర్మించనున్న కన్వేయర్ బెల్ట్ పక్క నుంచే 17 కిలోమీటర్ల మేర రోడ్డు వేయూల్సి ఉంది. ఆ పనుల ఊసే లేదు. అటవీ, పర్యావరణ అనుమతులు సైతం రావలసి ఉంది. ఈబాధ్యలన్నీ జెన్కో చూసుకోవాల్సి ఉంది. బొగ్గు వెలికితీసి ఇచ్చే బాధ్యత మాత్రమే సింగరేణి కంపెనీది. ఇప్పటికే తప్పని ఇబ్బందులు కేటీపీపీలోని 500 మెగావాట్ల ప్లాంట్‌కు 7,500 మెట్రిక్ టన్నుల బొగ్గు సేకరణ కష్టంగా మారింది. భూపాలపల్లి గనుల నుంచి అంత బొగ్గు సేకరణ కష్టమే. దీంతో ఎన్నో వ్యయప్రయూలసకోర్చి గోదావరిఖని, రామగుండం తది తర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రెండవ దశ 600 మెగావాట్ల ప్లాంటుకు అవసరమైన 9000 మేట్రిక్ టన్నుల బొగ్గు సేకరణ, రవాణా తలకు మించిన భారంగా పరిణమించింది. కేటీపీపీకి సుమారుగా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడిచర్ల బ్లాక్‌ల్లో బొగ్గు ఉత్పత్తి అరుుతే కన్వేయర్ బెల్ట్ ద్వారా తరలించే అవకాశం ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రానికి విద్యుత్ అవసరం ఎంతో ఉంది. అందుకు తగినట్టుగా సర్కారు వనరులను సమకూర్చుకుంటోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వం ఎంచుకున్న లక్ష్యం నీరుగారిపోతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. -
కొత్త విద్యుత్‌ప్లాంట్లపై కోటి ఆశలు
సత్వర వెలుగునిచ్చే ప్రాజెక్టుల్లో పెట్టుబడి కేటీపీపీ రెండోదశ పూర్తికి రూ.300 కోట్లు కొత్తగూడెం కొత్త ప్లాంట్‌కు రూ.300 కోట్లు బీహెచ్ఈఎల్ ప్రాజెక్టులకు రూ.400 కోట్లు సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంక్షోభం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని గట్టెంక్కించేందుకు వచ్చే డిసెంబర్ నాటికి పూర్తయ్యే ప్రాజెక్టులకు సర్కార్ మొదటి ప్రాధాన్యమివ్వనుంది. ఇందుకోసం కొత్త కేంద్రాలపైనే ఆశలు పెట్టుకుంది. తెలంగా ణ జెన్కో సారథ్యంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతోపాటు, బీహెచ్ఈఎల్తో ఒప్పందం చేసుకున్న థర్మల్ప్లాంట్లను శరవేగంగా పూర్తి చేయడంపై దృష్టి కేంద్రీకరిం చింది. బడ్జెట్లో టీఎస్ జెన్కోలో పెట్టుబడికి నిర్దేశించిన రూ.1000 కోట్లను ఈ కొత్తప్లాంట్ల కోసం ఖర్చు చేయనుంది. భూపాలపల్లిలో నిర్మాణంలో ఉన్న 600 మెగావాట్ల కాకతీయ థర్మల్ ప్రాజెక్టు రెండో దశకు రూ. 300 కోట్లు, కొత్తగూడెం థర్మల్ ప్లాంట్ ఏడోదశలో తలపెట్టిన 800 మెగావాట్ల ప్రాజెక్టుకు మరో రూ. 300 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించింది. మిగతా రూ. 400 కోట్లను బీహెచ్ఈఎల్తో ఒప్పందం చేసుకునే థర్మల్ ప్రాజెక్టులకు కేటాయించనుంది. 2012లోనే పూర్తికావాల్సింది.. భూపాలపల్లి ప్లాంట్‌కు ఆర్ఈసీ రూ.2170 కోట్ల రుణం మంజూరీ చేసింది. గత నెలాఖరు వరకే దాదాపు రూ.2565 కోట్లు దీనికి ఖర్చయినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2009 ఫిబ్రవరిలో ఈ ప్లాంట్ పని ప్రారంభమైంది. ఒప్పందం ప్రకారం 2012లోనే పూర్తి కావాలి. కాంట్రాక్టర్ల జాప్యంతో రెండేళ్లు ఆలస్యమైంది. అంతేకాక గతనెలలో భారీయంత్రాలు అమర్చే క్రేన్ విరగడంతో బాయిలర్ నిర్మాణం మధ్యలో ఆగింది. దీంతో నెలరోజులు పనులన్నీ నిలిచిపోయాయి. ఇటీవలే టీఎస్జెన్కో ఛైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ డి.ప్రభాకరరావు అక్కడికివెళ్లి పనుల పురోగతిని పరిశీలించారు. ఆగస్టు నాటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిపారు. దీంతో పాటు మణుగూరులో 1080 మెగావాట్ల (2704 యూనిట్లు) థర్మల్ విద్యుత్కేంద్ర నిర్మాణంపై జెన్కో దృష్టి సారించింది. దీనిని ఈపీసీ విధానంలో బీహెచ్ఈఎల్ కంపెనీకి అప్పగించనుంది. మణుగూరులో 1031.19 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా థర్మల్ ప్రాజెక్టు నిర్మాణానికి మూడేళ్ల సమయం పడుతుంది. అయితే, 270 మెగావాట్ల ఉత్పత్తికి అవసరమయ్యే టర్బైన్లు, జనరేటర్లు బీహెచ్ఈఎల్ దగ్గర అందుబాటులో ఉండడంతో రెం డేళ్ల వ్యవధిలోనే పూర్తిచేసేందుకు అంగీకారం కుదిరిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక కొత్తగూడెం థర్మల్ పవర్‌ప్లాంట్‌లో 800 మెగావాట్ల కేంద్రాన్ని మూడేళ్లలో పూర్తి చేసేందుకు జెన్కో ఏర్పాట్లు చేస్తోంది. వీటికితోడు ఇప్పటికే నిర్మాణంలో ఉన్న జల విద్యుత్కేంద్రాలు వచ్చే ఏడాది చివరినాటికి ఉత్పత్తిచేసే దశకు చేరుకుంటాయని అధికారులు అంచనా వేశారు. లోయర్ జూరాల హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ద్వారా 240 మెగావాట్లు (640), పులిచింతల ప్రాజెక్టు ద్వారా 120 మెగావాట్లు (430) ఉత్పత్తి చేసే యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి 70 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. డిసెంబర్ 15 వరకు ఈ యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి సిద్ధంగా ఉంటుందని జెన్కో అంచనా వేసింది. -
తోడేస్తున్నారు
జిల్లాలో ఇసుకాసుర రాజ్యం వట్టిపోతున్న వాగులు దట్టమైన వనాల్లో నిరంతర దందా మాఫియూకు కొమ్ముకాస్తున్న అధికారులు అందినకాడికి దండుకుంటున్న పలువురు నిరుపయోగంగా మారిన వాల్టా చట్టం సాక్షి, హన్మకొండ: అడవులకు ప్రాణాధారంగా ఉండే వాగుల్లోంచి ఇసుకను ఎడాపెడా తోడేస్తున్నారు. నడవడానికి కష్టం గా ఉండే దట్టమైన అడవుల్లో ఇప్పుడు నిర్విరామంగా ఇసుక ట్రాక్టర్లు తిరుగుతున్నాయి. ఇష్టారాజ్యంగా ఇసుక అక్రమ రవాణాతో అటవీప్రాంతాల్లోని వాగులు... ఇ సుక లేకుండా గోతులతో దర్శనమిస్తున్నాయి. భూపాలపల్లి చుట్టూ విస్తరించిన దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఇసుక మా ఫియూ యథేచ్ఛగా రెచ్చిపోతోంది. నీరు-భూమి-చెట్ల పరిరక్షణ (వాల్టా) చట్టం సాక్షిగా వాగులన్నీ వట్టిపోతున్నా యి. దీ న్ని అరికట్టాల్సిన అటవీశాఖ అధికారులు... ఇసుకాసురుల కు కొమ్ముకాస్తున్నారు. ఇతర ప్రభుత్వ విభాగాల అ దికారు లు పలువురు కళ్లుమూసుకుని ఈ అక్రమ రవాణా నిరాటంకంగా కొనసాగేందుకు తమవంతు సాయమందిస్తున్నారు. అయ్యో అడవీ... సింగరేణి బొగ్గు గనులు ఉన్న భూపాలపల్లి పట్టణం పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో ఈ పట్టణ కేంద్రంగా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. భూపాలపల్లి చుట్టూ వరంగల్ ఉత్తరం, కరీంనగర్ తూర్పు విభాగాల పరిధిలో వందల హెక్టార్ల పరిధిలో అడవి విస్తరించి ఉంది. ఇందులో వరంగల్ ఉత్తరం విభాగంలో మల్లంపల్లి, పెద్దాపూర్, కమలాపూర్ గ్రామాల పరిసరాల్లో ఉన్న దట్టమైన అటవీప్రాంతాల గుండా బొగ్గులవాగు, తీగలవాగులు ప్రవహిస్తున్నాయి. అదేవిధంగా... కరీంనగర్ తూర్పు విభాగం పరిధిలో జంగేడు, కాసంపల్లి సమీపంలోని అడవుల్లో వడ్లోని వాగు ప్రవహిస్తోంది. ఈ వాగులన్నీ ఒకప్పుడు నీటిప్రవాహంతో ఇసుక మేటలతో నిండిఉండేది. కానీ.. కొద్దికాలంగా ఎడాపెడా ఇసుకను తోడేయడంతో ఈ వాగుల్లో ఇసుక మేటలు కనుమరుగయ్యాయి. నీరు పూర్తిగా అడుగంటి పోయింది. 40 ట్రాక్టరు.. 250 ట్రిప్పులు బొగ్గులవాగు, తీగలవాగుల్లో ఇసుకను తోడేందుకు నిత్యం 30 ట్రాక్టర్లు తిరుగుతున్నారుు. వీటి ద్వారా రోజుకు సగటున 180 ట్రిప్పుల ఇసుకను అటవీ ప్రాంతం నుంచి తోడేస్తున్నారు. వడ్లోనివాగులో ఇసుకను తోడేందుకు మరో 10 ట్రాక్టర్లు రోజంతా విరామం లేకుండా తిరుగుతూనే ఉన్నారుు. వీటి ద్వారా రోజుకు వంద ట్రిప్పుల ఇసుకను వాగులో నుంచి భూపాలపల్లికి తరలిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం దసరా పండుగ జరిగే అక్టోబరులో మొదలై మళ్లీ జూన్ వరకు సాగుతూ ఉండడం పరిపాటిగా మారింది. ఇలా ఎనిమిది నెలలపాటు భూపాలపల్లి కేంద్రంగా నిత్యం 40 ట్రాక్టర్లు సగటున రోజుకు 250 ట్రిప్పులు తిరుగుతూ ఉన్నట్లు అంచనా. పారిశ్రామిక అవసరాలే పెట్టుబడి... భూపాలపల్లి పారిశ్రామికంగా దినదినాభివృద్ధి చెందుతుండడంతో నిర్మాణ రంగం ఇక్కడ జోరుమీదుంది. ఒకవైపు సింగరేణి సంస్థ కార్మికులకు పెద్ద ఎత్తున నివాస స్థలాలు నిర్మిస్తుండగా... మరోవైపు కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ విస్తరణ పనులు జరుగుతున్నాయి. వీటికి అదనంగా సొంత నిర్మాణాలు ఉండనే ఉన్నాయి. ఫలితంగా గడిచిన కొన్నేళ్లలో భూపాలపల్లిలో ఇరవైకి పైగా యాష్బ్రిక్, సిమెంట్ బ్రిక్ తయారీ సంస్థలు వెలిశాయి. ఇసుక మాఫియాకు వెన్నుదన్నుగా ఈ యాష్బ్రిక్ సంస్థలు నిలుస్తున్నాయి. అటవీశాఖపై అనుమానాలెన్నో... భూపాలపల్లి చుట్టూ ఉన్న అటవీ ప్రాంతాలను రక్షించేందుకు వరంగల్, కరీనంగర్ అటవీశాఖల పరిధిలో రెండు రేంజ్ కార్యాలయాలున్నాయి. బీట్ ఆఫీసర్ నుంచి ఫారెస్ట్ రేంజర్ వరకు ఒక్కో విభాగంలో కనీసం 35 మంది సిబ్బంది వంతున రెండు డివిజన్లకు సంబంధించి 75 మంది ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు గస్తీ తిరిగేందుకు ఆరు వాహనాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి. అయితే ఈ సిబ్బందికి ఇక్కడ ఇసుక అక్రమ రవాణా కనిపించదు. తమ కళ్లెదుటే వాల్టా చట్టానికి తూట్లు పడుతున్నా పట్టించుకోరు. దీనికంతటికీ ముడుపుల మాయూజాలమే కారణమని తెలుస్తోంది. పలువురు అటవీ శాఖ అధికారులకు ఇసుకాసురుల నుంచి ఒక్కో ట్రాక్టరుకు రూ.పది వేల వంతున నెలకు రూ.నాలుగు లక్షలు అందుతున్నట్లు సమాచారం. ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి సైతం ఏ ఇబ్బందులు తలెత్తకుండా ఒక్కో ట్రాక్టరుకు రూ.ఐదువేల వంతున రెవెన్యూ, శాంతిభద్రతల విభాగాలకు చెందిన సిబ్బందికి నెలకు రూ. రెండు లక్షలు సమర్పించుకుంటున్నట్లు తెలిసింది. ఇలాంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నా ఆ శాఖ ఉన్నతాధికారులు అ అంశాన్ని పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.