తాడిచర్ల తడబాటు
► మొదలుకాని ఓసీ పనులు
► కొలిక్కి రాని భూసేకరణ సమస్య
► నిర్వాసితులకు అందని పరిహారం
► కేటీపీపీ రెండవ దశకు బొగ్గు కష్టాలు
► నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జెన్‌కో
గణపురం (వరంగల్) : వరంగల్ జిల్లా చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు(కేటీపీపీ) రెండవ దశ 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌కు అవసరమైన బొగ్గు అందించే తాడిచర్ల ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు పనులు ఇంకా ప్రారంభం కాలేదు. వాస్తవానికి కరీంనగర్ జిల్లా మల్హర్ మండలం తాడిచర్లలో ఓసీ తవ్వకం పనులు 2015లో ప్రారంభించి 2016లో బొగ్గు అందించేలా జెన్‌కో-సింగరేణి సంస్థల మధ్య ఒప్పందం జరిగింది. భూసేకరణ సమస్య కొలిక్కి రాకపోవడంతో సింగరేణి అడుగు లు ముందుకు వేయడం లేదు. తాటిచర్ల 1, 2 బొగ్గు బ్లాక్‌లను కేంద్రప్రభుత్వం జెన్‌కోకు కేటాయించింది.
1వ బ్లాక్ కోసం సూమారు 2,200 ఎకరాల భూమి సేకరించారు. అందులో పట్టా భూముల కు పరిహారం చెల్లించగా లావుని భూముల పరిహారం పెండింగ్‌లో ఉంది. తాడిచర్ల నుంచి కేటీపీపీకి కన్వేయర్ బెల్ట్ నిర్మాణానికి అవసరమైన భూమి సేకరించినా నిర్వాసితులకు పరిహారం చెల్లించలేదు. 20 కిలోమీటర్లు నిడివి లో నిర్మించనున్న కన్వేయర్ బెల్ట్ పక్క నుంచే 17 కిలోమీటర్ల మేర రోడ్డు వేయూల్సి ఉంది. ఆ పనుల ఊసే లేదు. అటవీ, పర్యావరణ అనుమతులు సైతం రావలసి ఉంది. ఈబాధ్యలన్నీ జెన్‌కో చూసుకోవాల్సి ఉంది. బొగ్గు వెలికితీసి ఇచ్చే బాధ్యత మాత్రమే సింగరేణి కంపెనీది.
ఇప్పటికే తప్పని ఇబ్బందులు
కేటీపీపీలోని 500 మెగావాట్ల ప్లాంట్‌కు 7,500 మెట్రిక్ టన్నుల బొగ్గు సేకరణ కష్టంగా మారింది. భూపాలపల్లి గనుల నుంచి అంత బొగ్గు సేకరణ కష్టమే. దీంతో ఎన్నో వ్యయప్రయూలసకోర్చి గోదావరిఖని, రామగుండం తది తర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రెండవ దశ 600 మెగావాట్ల ప్లాంటుకు అవసరమైన 9000 మేట్రిక్ టన్నుల బొగ్గు సేకరణ, రవాణా తలకు మించిన భారంగా పరిణమించింది.
కేటీపీపీకి సుమారుగా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడిచర్ల బ్లాక్‌ల్లో బొగ్గు ఉత్పత్తి అరుుతే కన్వేయర్ బెల్ట్ ద్వారా తరలించే అవకాశం ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రానికి విద్యుత్ అవసరం ఎంతో ఉంది. అందుకు తగినట్టుగా సర్కారు వనరులను సమకూర్చుకుంటోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వం ఎంచుకున్న లక్ష్యం నీరుగారిపోతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు.