Land acquisition issue
-
తొలుత బాపూఘాట్ వరకే!
సాక్షి, హైదరాబాద్: మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై కసరత్తు ముమ్మరం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తొలిదశలో బాపూఘాట్ ప్రాంతం వరకే పనులను పరిమితం చేయాలని భావిస్తోంది. నదీ తలంతోపాటు బఫర్ జోన్‌లోని నిర్మాణాల తొలగింపులో ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. నగర శివార్లలోని బాపూఘాట్ వరకు పునరుజ్జీవం, సుందరీకరణ పనులు పూర్తిచేశాక.. దానిని నమూనాగా చూపి హైదరాబాద్ నగరం నడిబొడ్డున మిగతా పనులు చేపట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. భూసేకరణ సమస్య లేకపోవడంతో.. వికారాబాద్ అడవుల్లో జన్మంచే మూసీ నది.. ఈసీ, మూసా అనే రెండు పాయలుగా ప్రవహిస్తూ వచి్చ, లంగర్‌హౌజ్ ప్రాంతంలోని బాపూఘాట్ వద్ద సంగమిస్తుంది. ఇందులో ఈసీపై హిమాయత్‌సాగర్, మూసాపై ఉస్మాన్‌సాగర్ రిజర్వాయర్లు ఉన్నాయి. ప్రభుత్వం ప్రస్తుతం ఈ రిజర్వాయర్ల దిగువ నుంచి ఈసీ, మూసా నదుల సంగమం బాపూఘాట్ వరకు భూసేకరణ సమస్యలు పెద్దగా ఉండవని ప్రభుత్వం భావిస్తోంది. రెండు నది పాయల తీరప్రాంతం, బాపూఘాట్‌ను పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఇందుకు అనుగుణంగా విభిన్న ప్రణాళికలు, నమూనాలతో సీఎం అధ్యక్షతన మూసీ పునరుజ్జీవంపై త్వరలో జరిగే భేటీకి రావాల్సిందిగా ప్రాజెక్టు కన్సల్టెంట్లను ఆదేశించింది. నిజానికి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు స్థితిగతులపై రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ అధ్యక్షతన భేటీ జరిగింది. ప్రభుత్వ ఉన్నతాధికారులతోపాటు మూసీ రివర్‌ఫ్రంట్ కార్పొరేషన్ అధికారులు, కన్సల్టెంట్ సంస్థ మెయిన్‌హార్ట్ కన్సార్షియం ప్రతినిధులు పాల్గొన్న ఈ భేటీలో మూసీ పునరుజ్జీవం, సుందరీకరణ కోసం చేపట్టాల్సిన పనులపై చర్చించి, పలు నిర్ణయాలు తీసుకున్నారు. భవిష్యత్ అవసరాలకు తగినట్టుగా ‘బఫర్’ మూసీకి ఇరువైపులా 50 మీటర్ల వరకు బఫర్ జోన్‌గా గుర్తించాలని ఇప్పటికే నిర్ణయించినా.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బఫర్ జోన్‌ను డిజైన్ చేయాలని సర్కారు భావిస్తోంది. భవిష్యత్తులో మూసీకి ఇరువైపులా రోడ్లు, వంతెనలు, భారీ కూడళ్లు, మెట్రో రైలు మార్గం వంటివి నిర్మించేందుకు వీలుగా ఇప్పుడే ప్రణాళికలు సిద్ధం చేస్తారు. బఫర్ జోన్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, రాళ్లు, వ్యర్థాలను తొలగించి సమతలం చేస్తారు.ప్రభుత్వ భూముల లభ్యతను దృష్టిలో పెట్టుకుని ఎక్కడికక్కడ విభిన్న డిజైన్లలో పర్యాటకులను ఆకర్షించేలా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారు. అయితే.. బాపూఘాట్ సమీపంలో ఈసీ, మూసా నదుల సంగమం తీర ప్రాంతంలో రక్షణశాఖ భూములు ఉన్నాయి. ఆ భూముల వివరాలను రెవెన్యూ విభాగం ద్వారా సేకరించి.. మూసీ అభివృద్ధి ప్రాజెక్టుకు కేటాయించేలా కేంద్రాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా బాపూఘాట్ ⇒ మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా బాపూ ఘాట్ ప్రాంతాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. పర్యాటకులను ఆకర్షించేలా బాపూఘాట్ వద్ద స్కైవే, బ్రిడ్జితో కూడిన బరాజ్, పాదచారుల వంతెనను నిర్మించేలా నమూనాలు, ప్రణాళికలు సిద్ధం చేసే బాధ్యతను కన్సల్టెంట్‌కు అప్పగించారు. బాపూఘాట్‌కు ఉన్న చారిత్రక ప్రాధాన్యతను ప్రతి బింబించేలా ఈ డిజైన్లు, ప్రణాళికలు ఉంటాయి.గుజరాత్‌లోని నర్మదానది వద్ద నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహం తరహాలో బాపూఘాట్ వద్ద మహాత్మాగాంధీ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయా లని భావిస్తున్నారు. ఇక ఈసీ, మూసా సంగమ ప్రదేశాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చి దిద్దేలా ప్రణాళికలు రూపొందించాలని కన్సల్టెంట్‌ను ఆదేశించారు. సంగమ స్థలం వద్ద మహాప్రస్థానం, స్నాన ఘట్టాలతో ఘాట్ల నిర్మాణం వంటి ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. ఉస్మాన్‌సాగర్‌కు గోదావరి జలాలు ⇒ జంట జలాశయాల నుంచి బాపూఘాట్ వర కు భారీ అభివృద్ధి ప్రణాళికల నేపథ్యంలో.. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి, సేకరించాల్సిన భూమిపై రెవెన్యూ శాఖ కసరత్తు చేయాల్సి ఉంది. గోదావరి జలాలను హి మాయత్‌సాగర్ మీదుగా ఉస్మాన్‌సాగర్‌కు తరలించేందుకు కాలువ తవ్వాలా లేక టన్నె ల్ నిర్మించాలా? అన్న అంశాలను తేల్చే బా ధ్యతను హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు కు అప్పగించారు. ఈ నెల 24న జరిగిన సమావేశంలో వీటిని సమీక్షించేందుకు సీఎం రేవంత్ మరో సమావేశం ఏర్పాటు చేస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. -
తాడిచర్ల తడబాటు
► మొదలుకాని ఓసీ పనులు ► కొలిక్కి రాని భూసేకరణ సమస్య ► నిర్వాసితులకు అందని పరిహారం ► కేటీపీపీ రెండవ దశకు బొగ్గు కష్టాలు ► నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జెన్కో గణపురం (వరంగల్) : వరంగల్ జిల్లా చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు(కేటీపీపీ) రెండవ దశ 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌కు అవసరమైన బొగ్గు అందించే తాడిచర్ల ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు పనులు ఇంకా ప్రారంభం కాలేదు. వాస్తవానికి కరీంనగర్ జిల్లా మల్హర్ మండలం తాడిచర్లలో ఓసీ తవ్వకం పనులు 2015లో ప్రారంభించి 2016లో బొగ్గు అందించేలా జెన్కో-సింగరేణి సంస్థల మధ్య ఒప్పందం జరిగింది. భూసేకరణ సమస్య కొలిక్కి రాకపోవడంతో సింగరేణి అడుగు లు ముందుకు వేయడం లేదు. తాటిచర్ల 1, 2 బొగ్గు బ్లాక్‌లను కేంద్రప్రభుత్వం జెన్కోకు కేటాయించింది. 1వ బ్లాక్ కోసం సూమారు 2,200 ఎకరాల భూమి సేకరించారు. అందులో పట్టా భూముల కు పరిహారం చెల్లించగా లావుని భూముల పరిహారం పెండింగ్‌లో ఉంది. తాడిచర్ల నుంచి కేటీపీపీకి కన్వేయర్ బెల్ట్ నిర్మాణానికి అవసరమైన భూమి సేకరించినా నిర్వాసితులకు పరిహారం చెల్లించలేదు. 20 కిలోమీటర్లు నిడివి లో నిర్మించనున్న కన్వేయర్ బెల్ట్ పక్క నుంచే 17 కిలోమీటర్ల మేర రోడ్డు వేయూల్సి ఉంది. ఆ పనుల ఊసే లేదు. అటవీ, పర్యావరణ అనుమతులు సైతం రావలసి ఉంది. ఈబాధ్యలన్నీ జెన్కో చూసుకోవాల్సి ఉంది. బొగ్గు వెలికితీసి ఇచ్చే బాధ్యత మాత్రమే సింగరేణి కంపెనీది. ఇప్పటికే తప్పని ఇబ్బందులు కేటీపీపీలోని 500 మెగావాట్ల ప్లాంట్‌కు 7,500 మెట్రిక్ టన్నుల బొగ్గు సేకరణ కష్టంగా మారింది. భూపాలపల్లి గనుల నుంచి అంత బొగ్గు సేకరణ కష్టమే. దీంతో ఎన్నో వ్యయప్రయూలసకోర్చి గోదావరిఖని, రామగుండం తది తర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రెండవ దశ 600 మెగావాట్ల ప్లాంటుకు అవసరమైన 9000 మేట్రిక్ టన్నుల బొగ్గు సేకరణ, రవాణా తలకు మించిన భారంగా పరిణమించింది. కేటీపీపీకి సుమారుగా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడిచర్ల బ్లాక్‌ల్లో బొగ్గు ఉత్పత్తి అరుుతే కన్వేయర్ బెల్ట్ ద్వారా తరలించే అవకాశం ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రానికి విద్యుత్ అవసరం ఎంతో ఉంది. అందుకు తగినట్టుగా సర్కారు వనరులను సమకూర్చుకుంటోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వం ఎంచుకున్న లక్ష్యం నీరుగారిపోతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. -
రైతులపై దౌర్జన్యం
- పోర్టు భూసేకరణపై తమ గోడు చెప్పేందుకు వచ్చిన రైతులు - వాగ్వాదానికి దిగిన టీడీపీ కార్యకర్తలు - సిగ్గుందా అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన మంత్రి రవీంద్ర మచిలీపట్నం : స్థానిక టౌన్‌హాలులో బందరు పోర్టు, అనుబంధ పరిశ్రమలకు భూసేకరణ అంశంపై టీడీపీ కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు శని వారం నిర్వహించిన సమావేశం తోపులాటకు దారితీసింది. బందరు పోర్టు, అనుబంధ పరిశ్రమల స్థాపన కోసం 30 వేల ఎకరాల సేకరణకు జారీచేసిన నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి హాజరైన కొందరు రైతులు మాట్లాడుతూ తమ సొంత భూములను సేకరించి రోడ్డున పడేస్తారా అంటూ మంత్రి, ఎంపీని నిలదీశారు. దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రైతులపై దౌర్జన్యానికి దిగారు. రైతులు, కార్యకర్తల మధ్యతోపులాట చోటుచేసుకుంది. అదే సమయంలో మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహంతో ‘మీకు సిగ్గులేదా? బందరు పోర్టును అడ్డుకుంటున్నారు. పేర్ని నాని రెచ్చగొడితేనే మీరు ఇక్కడకు వచ్చారు. ఏదేమైనా పోర్టు నిర్మించి తీరుతాం’ అంటూ ఊగిపోయారు. ఎంపీ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ రైతుల ఇష్టం లేనిదే భూములు సేకరించమని, ఈ కార్యక్రమంలో రాద్ధాంతం చేయవద్దని కోరారు. టీడీపీ కార్యకర్తలుగా ఉన్న కొందరు రైతులు తమ అభిప్రాయం చెప్పేందుకు ముందుకు వచ్చినా అవకాశం ఇవ్వలేదు. రైతులకు భూసేకరణపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే వ్యక్తిగతంగా వచ్చి చెబితే వాటిని పరిష్కరిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమి సేకరించి పోర్టు నిర్మాణం చేస్తామని ప్రకటన చేయిస్తామని మంత్రి చెప్పారు. -
పవన్..బాబు హిట్ రైతులు ఫట్