మృతుడు ఆర్టిజన్ కార్మికుడు కేతిరి వీరస్వామి
భూపాలపల్లి జిల్లా/హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం మొదటి దశ 500మెగావాట్ల ప్లాంట్‌లో సోమవారం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆర్టిజన్ కార్మికుడు కేతిరి వీరస్వామి హైదరాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు.
మృతుడు వీరస్వామి స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ. వీరస్వామికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన వీరస్వామి మృతిచెందడంతో కేటీపీసీలో విషాదం అలుముకుంది. రెండు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో ఏడుగురికి గాయాలు అయ్యాయి. యశోద ఆస్పత్రిలో ప్రస్తుతం జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు, కాంట్రాక్ట్ కార్మికుడు సీతారాములు చికిత్స పొందుతున్నారు.
హనుమకొండ అజార ఆస్పత్రిలో మరో నలుగురు కార్మికులు చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంపై విచారణ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. సీఈ సిద్దయ్య నిర్లక్ష్యంపై చర్యలు తీసుకునే పనిలో జెన్‌కో అధికారులు ఉన్నారు.
చదవండి: తంజావూరు రథయాత్రలో అపశ్రుతి.. కరెంట్ షాక్‌తో పది మందికిపైగా భక్తుల దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment