శ్రీశ్రీ రవిశంకర్ గౌరవ దినోత్సవం జరుపుకుంటున్న 27 నగరాల సరసన ఇపుడు అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని అలెఘెనీ కౌంటీ కూడా చేరింది.నగర ప్రాంతంలో హింస, నేరాలను తగ్గించి, వివిధ వర్గాల ప్రజలను స్వచ్ఛంద సేవ, సామాజిక కార్యకలాపాలవైపు మళ్లించి వారిని ఏకీకృతం చేసేందుకు చేపట్టిన చర్యలను గుర్తిస్తూ ప్రతి ఏటా జూన్ 22వ తేదీన శ్రీశ్రీ రవిశంకర్ గౌరవ దినంగా జరుపుకోబోతున్నట్లు కౌంటీ ఎగ్జిక్యూటివ్ రిచ్ ఫిట్జ్‌గెరాల్డ్ ప్రకటించారు.
ఈ సందర్భంగా శ్రీశ్రీ రవిశంకర్‌ను ప్రపంచ మానవతావాదిగా, ఆధ్యాత్మిక నాయకుడిగా, శాంతి దూతగా’ ఆయన కొనియాడారు. శ్రీశ్రీ రవిశంకర్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఇప్పటికే ఆయన 5 దేశాల అత్యున్నత పౌర పురస్కారాలు, 39కి పైగా ప్రపంచ దేశాల అవార్డులు, 26 గౌరవ డాక్టరేట్‌లను అందుకున్నారు.
ఈ ఏడాది సెప్టెంబరు 29 నుండి అక్టోబర్ 1 వరకు వాషింగ్టన్ లోని నేషనల్ మాల్ స్టేడియంలో ప్రపంచ శాంతి, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే ఉత్సవాలలో అతి పెద్దదైన ‘ది వరల్డ్ కల్చ ఫెస్టివల్’ కు శ్రీశ్రీ సారధ్యం వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment