
సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన ‘పద్మావత్’ చిత్రం బాగుందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ కితాబిచ్చారు. బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో కలిసి రవిశంకర్ చిత్రాన్ని వీక్షించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘పద్మావత్’ చిత్రం చాలా బాగుందన్నారు. దీపికా పదుకునే, షాహిద్ కపూర్, రణ్‌వీర్ సింగ్‌ల నటన అద్భుతంగా ఉందని రవిశంకర్ చెప్పారు. ఈ చిత్రంపై రాజపుత్రులు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు అర్థం లేనివని అన్నారు.
అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వారంతా చిత్రాన్ని చూసి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ‘పద్మావత్’ చిత్రం రాజపుత్రుల గౌరవాన్ని పెంచుతుందని, రాణీ పద్మావతి దేవి గొప్పతనాన్ని తెలియజేస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment