న్యూఢిల్లీ : తొలి దేశీయ సోషల్ మీడియా సూపర్ యాప్ ‘ఎలిమెంట్స్’ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. గురుపౌర్ణిమ రోజు ఈ యాప్‌ను ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని గుర్తుచేశారు.(చదవండి : ఒక్కరోజులో 24వేలకు పైగా కరోనా కేసులు)
ఆత్మనిర్భర్ భారత్‌తో పట్టణాలు, గ్రామాల మధ్య సమన్వయం పెరుగుతుందని వెంకయ్యనాయుడు అన్నాడు. మేడిన్ ఇండియాపై అన్ని ప్రాంతాల్లో చైతన్యం వచ్చిందన్నారు. దేశంలోని వనరులను వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment